నిర్మల్ జూలై26 తెలంగాణా ఎక్స్ ప్రెస్ (జిల్లా ప్రతినిధి); శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే ఎంత వారైనా ఉపేక్షించేది లేదని ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం కోర్బాగల్లీ, గుజిరిగల్లీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. అల్లర్లు, ఘర్షణలు, అభివృద్ధికి ఆటంకిగా నిలుస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొవాలన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు అన్ని గుర్తింపు పత్రాలు కలిగి ఉండాలన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాశాలు రెచ్చగొట్టె పోస్టులను పెడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సరైన పత్రాలు లేని 88 బైక్లు, 2 టాటా వాహానాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ ఎల్ శ్రీనుతో పాటు ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Latest
కాంగ్రెస్ ప్రతి అడుగు చేసే ప్రతి పని ప్రజా సంక్షేమం కోసమే టీపీసీసీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ నవీన్ పెట్టo
జనగామ, జులై 26(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
గురువారం రోజున జనగామ జిల్లా కేంద్రం లయన్స్ క్లబ్ లో జనగామ నియోకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతీష్ అధ్యక్షతన జనగామ జిల్లా సోషల్ మీడియా సమావేశo
ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ పెట్టం మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, దాని కోసం సోషల్ మీడియా డిపార్ట్మెంట్ కీలకపాత్ర వహించి ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా పాటుపడాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన ప్రజలకు వివరిస్తూ స్థానిక సమస్యల మీద పోరాటం చేయాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, యువతకు,మహిళలకు నెరవేస్తానన్న పథకాలు
కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రగతికి సోపానాలు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇంటికి రూ. 5 లక్షల సాయం,
రైతులకు, కౌలు రైతులకు, ఎకరాకు రూ. 15000 పెట్టుబడి సాయం,రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ,అమరుల తల్లిదండ్రులకు రూ. 25 వేల పెన్షన్,అమరుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం,భూమి లేని నిరుపేదలకు ప్రతి ఏడాది రూ. 12000,ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు,నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి,వృద్ధులకు వికలాంగులకు, ఒంటరి మహిళలకు,బీడీ కార్మికులకు, చేనేతలకు,గౌడన్న లకు 4000 పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు.జనగామ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాపోలు పృద్వి మాట్లాడుతూ
సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేసే విధంగా మనమందరం సైనికులు వలె ఒకతాటి పైన ఉంటూ ప్రజలకు వివరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా నాయకులు అల్లం ప్రదీప్ రెడ్డి,డీసీసీ కార్యదర్శి రాపోలు రామ్మూర్తి ,జనగామ పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మోటే శ్రీనివాస్ ,బండారు శ్రీనివాస్ ,జాయ మల్లేష్,యూత్ కాంగ్రెస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి,
కొడం శ్రీనివాస్ బిర్రు సత్యనారాయణ మోటే మల్లేష్,
జనగామ మండల సోషల్ మీడియా కన్వీనర్ బుర్ర కర్ణాకర్,జనగామ పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ బోలికొండ నర్సింహలు,బక్క ప్రవర్డన్,గాజుల రాజు ,
పాలకుర్తి నియోజకవర్గం సోషల్ మీడియా కో -ఆర్డినేటర్లు జోగు అనిల్,నక్క యాకస్వామి,పాలకుర్తి, కొడకండ్ల, పెద్దవంగర, దేవరుప్పుల మండలాల సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్ కొండ శ్రీను,బత్తుల వెంకన్న,ఎరుకలి సమ్మయ్య గౌడ్, గానుపాక ప్రదీప్ మరియు వివిధ గ్రామాల సోషల్ మీడియా కో-అర్డినేటర్స్ అశోక్, నర్సింహ,సాయి,విష్ణు, బానోత్ నవీన్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సాయి కృష్ణ, చిల్పుర్ చేతల్లి రజాక్, ధర్మసాగర్ బోడ కుమార్, నాగబంది సంతోష్, చిమ్ముల రాజేష్ రెడ్డి, కందుకూరి శ్రీకాంత్, మరియు వివిధ గ్రామాల సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారిక యంత్రాంగం అప్రమత్తంగా వుండాలి.అని ప్రజలకు విజ్ఞప్తి
- పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది..ప్రజలు ఆందోళన చెందవద్దు.
- అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
– ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.- పునరావాస కేంద్రాలను ఏర్పాటు ..- వర్షాలతో చెరువులు, కుంటలు జలకళ…- నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి..- రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్.మహబూబాబాద్,ప్రతినిధి న్యూస్ జూలై26(తెలంగాణ ఎక్స్ ప్రెస్):-భారీ వర్షాలు నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని జమాండ్లపల్లి నెల్లికుదురు మండలంలోని వావిలాల రావిరాల నెల్లికుదురు మండలం కాచికల్ తొర్రూరు మండలం మడిపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న ఆకేరు వాగు వరద ప్రవాహాన్ని మంత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారుల తో కలిసి పరిశీలించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశామని అన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షింస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాదానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులకు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. శిథిలావస్థ ఇండ్లలో ఎవరు ఉండకూడదని వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అన్ని పీ.హెచ్.సీలలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, అన్ని రకాల మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని, గర్భిణీలను సైతం పిహెచ్ సి లకు తరలించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, కుంటల వద్దకు వెళ్లవద్దని హితవుపలికారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకునే విధంగా చెరువులను పునరుద్ధరించారని స్పష్టం చేశారు. దీంతో చెరువులు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయని తెలిపారు.వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోగా, భూగర్భ జలాలు పెరిగాయని, బోర్లలో నీటి నిల్వలు పెరిగాయని పేర్కొన్నారు.నా తెలంగాణ కోటి రతణాల వీణ అని దాశరథి అంటే.. నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి.. అని సీఎం కేసీఆర్ నిరూపించారని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జిల్లా కలెక్టర్ శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇతర అధికారులు బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
శంకరపట్నం,జూలై 26:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇల్లు పూర్తిగా కూలిపోయింది, వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగుర్ గ్రామానికి చెందిన నిరుపేద అయిన పూదరి సంతోష్ తండ్రి వెంకటయ్య కు చెందిన ఇల్లు పూర్తిగా కూలిపోయింది, కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది,ఎప్పటిలాగే కూలి పనులకు వెళ్లిన భార్య భర్తలు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లు కూలిందని బోరున విలపించారు, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు,
యాదవ సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా చిలకల మురళీ యాదవ్ జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అంజి యాదవ్
మిర్యాలగూడ డివిజన్ జూలై 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్: యాదవ సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షునిగా స్థానిక రాయనిపాలెం గ్రామానికి చెందిన చిలకల మురళీ యాదవ్ ని , అంజి యాదవ్ ను జిల్లా యాదవ సంఘం ఘం ఉపాధ్యక్షుడు గా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల యాదయ్య యాదవ్ గారు నియమించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ యాదవ సంఘం బలోపేతం కోసం యాదవుల హక్కుల కోసం పోరాడాలని జాతి బలోపేతం చెయ్యడంలో ముందువుండాలని జిల్లా యాదవ సంఘం పిలుపులను విజయవంతం చెయ్యాలని కోరారు . ఈ సందర్బంగా మురళి యాదవ్ మాట్లాడుతూ త్వరలో ప్రతి గ్రామం నుండి ముగ్గురి సభ్యులతో నియోజక వర్గ కమిటీ ని నియమించి సంఘం అభివృధి కి కృషిచేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ యాదవ సంగం నాయకులూ ఎర్రయ్య ,మురళి యాదవ్ ,అంజియాదవ్ ,నాగేశ్వర్రావు ,జ్వాలా వెంకటేశ్వర్లు ,దూదిమెట్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
Meeting అపజయమే విజయానికి మార్గం
విద్యార్థులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దు— బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు దశరథ్ నాయక్మిర్యాలగూడ డివిజన్ జూలై 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్: అపజయమే విజయానికి మార్గమని విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దని బంజార ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరథ్ నాయక్ సూచించారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ర్యాంక్ సాధించిన దనవత్ కార్తీక్ ఆత్మహత్య విషయమై బుధవారం విలేఖర్లతో మాట్లాడుతూ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలకు పాల్పడడం సరైంది కాదన్నారు.బల్బ్ కనుగొన్న థమాస్ ఆల్వా ఎడిసన్ ఆ ప్రయత్నంలో వేయి సార్లు విఫలం అయ్యాడని అలా అని తయారని ఆపేస్తే మనకు బల్బ్ కనిపెట్టక పోయేదన్నరు.అపజయం ఆత్మహత్యలకు పరిష్కారం కాదని, ఆత్మ స్థైర్యంతో ముందుకు వెళ్ళి సాధించుకోవాలని సూచించారు. అపజయాల నుండీ గుణపాఠం నేర్చుకొని విజయం వైపు దృష్టి సారించాలని కోరారు. యువతకు మంచి భవిష్యత్ ఉందని కష్టపడి చదవి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆత్మహత్యలతో కడుపుకోత మిగల్చవద్దని సూచించారు. అవసరమైతే యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విజయమార్గాలు సూచిస్తామన్నారు.
మక్తల్ నియోజకవర్గ నేత కేశం టీపీసీసీ అధికార ప్రతినిధి. నాగరాజు గౌడ్ వ్యాఖ్యలు చేశారు
మక్తల్ .జులై .26 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్): నియోజకవర్గం పరిధి అమరచింత మండలంలోని మస్తిపూర్ గ్రామం నుండి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వరకు రోడ్డు గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున వెంటనే రోడ్డు వేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ గౌడ సంఘం కేశం నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యుబ్ ఖాన్ ,కాంగ్రెస్ పార్టీ అమరచింత మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ,మస్తిపూర్ గ్రామ అధ్యక్షుడు సత్యన్న సీనియర్ నాయకులు మనివర్ధన్ రెడ్డి ,శ్రీకాంత్ గారు,ప్రభాకర్ రెడ్డి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్యామ్ ,బీసీ సెల్ మండల అధ్యక్షుడు పోషిరిగారి విష్ణు ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు హన్మంత్ నాయక్ ఖాసిం ,అనిల్ , కేశవ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
రేగోడు మండల వ్యవసాయ అధికారి జావేద్
రేగోడు జులై 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అధిక వర్షాల పట్ల రేగోడు మండల రైతాంగం అప్రమత్తంగా ఉండాలని రేగోడు మండల వైద్యాధికారి జావేద్ అన్నారు.ఈ సందర్భంగా బుధవారం నాడు ఫీల్డ్ వర్క్ లో భాగంగా పత్తి చేనులలో తిరిగి రైతులకు తగు సూచనలు చేశారు. అధిక వర్షాలకు పత్తిలో నిలిచిన నీటిని సాధ్యమైనంత తొందరగా తీసివేయాలని. వీలైనంత త్వరగా భూమిలో తేమను |తగ్గించటానికి అంతరకృషి చేయాలనీ, దీని ద్వారా భూమిలో తేమ తగ్గి మొక్కలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని, వర్షాలను ఆసరా చేసుకుని ఎకరాకు భూమిలో 25 కిలోల యారియా,10 కిలోల పొటాష్ ఎరువులను మొక్కకు 5-7 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలనీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అంతర సేద్యం వీలు కాకపోతే 20-25 రోజుల దశలో క్విజిత్ పాప్ ఇథైల్ 400 మి.లీ. పైరిథియోబాక్ సోడియం 250 మి.లీ కలిపి ఎకరాకు పిచికారి చేయడం ద్వారా గడ్డిజాతి వెడల్పాటి కలుపును నివారించ వచ్చు అని అన్నారు.అధిక వర్షాలకు నల్ల నేలల్లో వేరుకుళ్ళు తెగులు ఆశించే అవకాశాలు ఉన్నాయనీ, అలా ఉంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజిమ్ 1 గ్రాము నీటిలో కలిపి మొక్క మొదళ్ళలో తడపాలనీ, అధిక వర్షాలకు లేత పసుపు రంగుకు మారిన మొక్కలను పోషకాలను ఆకుల ద్వారా 5-10 గ్రాములు లీటరు నీటికి మొక్క వయసును బట్టి పొటాషియం నైట్రేట్ పిచికారీ చేసినట్లయితే మొక్కలు సాధారణ స్థాయికి చేరుతాయని అన్నారు.
18, సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటు వేసే విధానం గురించి అవగాహన సదస్సు ఆందోల్ ఆర్డిఓ పాండు ఆధ్వర్యంలో జరిగింది.
జోగిపేట్ జూలై 26:-(తెలంగాణ ఎక్స్ప్రెస్) 18, సంవత్సరాల నిండిన యువతి యువకులకు ఓటు వేసే విధానం గురించి అవగాహన సదస్సు ఆందోల్ ఆర్డీవో పాండు ఆధ్వర్యంలో జరిగింది. జోగిపేట్ పట్టణంలోని ఎస్ఆర్ఎం కళాశాల లో ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే ఇందులో 80, సంవత్సరాల నిండిన వికలాంగులను తీసుకు వచ్చే విధానం గురించి ఈ సదస్సులో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ కమిషనర్ తిరుపతి, డిప్యూటీ తాసిల్దార్ మధుకర్ రెడ్డి. మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు
మిగిలిన రైతుబంధు డబ్బులను వెంటనే చెల్లించాలి
ఏఐకేఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎండి సర్దార్.
రేగోడు జులై 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్, తెలంగాణ వ్యాప్తంగా పానకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తుంది కావున మిగిలిన రైతుబంధు డబ్బులను వెంటనే విడుదల చేయాలని, మరియు లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయాలని ఆల్ ఇండియా కిసాన్ సభ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎండి సర్దార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇచ్చే రైతు బంధు పథకం డబ్బులు సుమారు 5 ఎకరాల వరకు ఇచ్చారని, మిగిలిన రైతులకి డబ్బులను వెంటనే చెల్లించాలని రైతు సంఘం డిమాండ్ చేస్తుందనీ, ఒక నెల నుండి ప్రారంభమైన ప్రక్రియ, నేటికీ పూర్తి కావాల్సి ఉండగా పూర్తికానందున రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో గురవుతున్నారని,వాన కాలం సీజన్ ప్రారంభమై నెల 20 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిన రైతులకి రైతుబంధు డబ్బులను విడుదల చేయాలని, అలాగే ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తూ న్నప్పటి కీకేవలం 40 వేల వరకే మాఫీ ఇవ్వడం జరిగిందనీ, అది కూడా పూర్తిగా జరగలేదని, ఈ మాఫీ చేసిన డబ్బులకు సంబంధించి రైతులకు కూడా ఇప్పటివరకు సమాచారం లేదని ఇప్పటివరకు మాఫీ చేసిన డబ్బులను బ్యాంకర్లు, ప్రతి బ్యాంక్ నోటీస్ బోర్డ్ పైన పెట్టి, సంబంధిత రైతులకి రుణ మాఫీ దృవపత్రం ఇవ్వవలసి ఉందని, బ్యాంకర్ల ముఖ్యంగాఇది గమనించాలనీ,అలాగే తక్కిన లక్ష రూపాయల వరకు ఉన్న పంట అప్పు లను ప్రభుత్వం వెంటనే మాఫీ చేసి రైతు ఖాతాలను జమ చేసి, ఈ ఋణ భారాన్ని తగ్గించి, రైతులను ఆదుకోవాలని, ఇప్పటికే లక్ష రూపాయల పంట రుణాలు ఉన్న రైతులు, వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నారనీ. లక్ష వరకు ఉన్న అసలు రుణం, ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లిస్తు రినివల్ చేస్తున్నా రుణాలు లక్షకు 1,50,000 వరకు పైగా దాటి ఉన్నవనీ దీనితో రైతులు తీవ్ర ఆవేదనతో, నిస్సహాయ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని అన్నారు,కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మిగిలిన రైతులకి రైతుబంధు డబ్బులను వెంటనే చెల్లించి, లక్ష వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని అన్నారు.