Latest
నిర్మల్ – భైంసా తీరప్రాంతానికి ఇక ప్రయాణం మరింత సులువు. నాలుగు లేన్ల రహదారికి లైన్ క్లియర్ఫలించిన ఎమ్మెల్యే రామరావ్ పటేల్ కృషి
తెలంగాణ ఎక్స్ ప్రెస్
భైంసా జూలై 22
భైంసా: జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని అప్పట్లో ఎమ్మెల్యే పి రామరావ్ పటేల్ తో పాటు, జిల్లాకు చెందిన బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపి ఢిల్లీలో కలిశారు. అయితే నిర్మల్ – భైంసా నాలుగు లైన్లు జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రాష్ట్రంలో నాలుగు వరుసల జాతీయ రహదారి రోడ్ల నిర్మాణానికి 15 రోడ్లకు 33 వేల 690కోట్ల వ్యయం అవుతుందని ప్రాధమికంగా అధికారులు అంచనా వేశారు.నిర్మల్ -భైంసా వైపు వెళ్లేవారికి ప్రయాణం సులువుగా మారడమే కాకుండా ప్రమాదాల సంఖ్య కూడా తగ్గే ఛాన్స్ పాటు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి రామరావ్ పటేల్ కేంద్ర ప్రభుత్వానికి,మంత్రి నితిన్ గడ్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

సద్వినియోగం చేసుకోండి ఏఎస్పీ సంపత్ రెడ్డి వెల్లడి. నర్సాపూర్, ఆగస్ట్ 11:(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) సంగారెడ్డి డివిజన్ పరిధిలో ని అన్ని సబ్ పోస్ట్ ఆఫీస్ లు, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో జాతీయ జెండాలను విక్రయిస్తున్నామని ఏఎస్పీ సంపత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా గుమ్మడి దల ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఎంపీడీఓ శత్రునాయక్ ను కలిసి జాతీయ జెండాను అందజేశారు. ఆయన మాట్లాడుతూ కేవలం 25 రూపాయలకు మాత్రమే జాతీయ జెండాను అందజేస్తామని అన్నారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నర్సాపూర్ సబ్ పోస్ట్ ఆఫీసులో జెండాల విక్రయాలు: ఎస్పీఏం హరి ప్రసాద్ వెల్లడి. నర్సాపూర్ సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని ప్రజా ప్రతినిదులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు చెందిన అధికారులు తమకు జాతీయ జెండాలు అవసరం అయితే పోస్ట్ ఆఫీస్ సమాచారం ఇస్తే అందించగలదని చెప్పారు. 9553356173 నెంబర్ కు పోన్ చేయగలరు.

శంకరపట్నం,ఆగస్టు 11( తెలంగాణ ఎక్స్ ప్రెస్) శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఆసరి ఐలయ్య, రెడ్డి రాజయ్య కరీంనగర్ వైపు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కుక్కల రాజయ్య బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కుక్కల రాజయ్య, ఐలయ్య లకు తీవ్ర గాయాలు కాగా రెడ్డి రాజయ్యకు స్వల్ప స్వల్ప గాయాలు అయ్యాయి, స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎన్ టి సతీష్ రెడ్డి పైలెట్ ఖలీల్ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
నాలుగు మండలాల్లో 300 మందికి లక్ష చెక్కుల పంపిణీ చేసిన
- మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
మక్తల్. ఆగస్టు .11:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) :- పట్టణ కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో మక్తల్. నర్వ.కృష్ణ.మాగనూరు.మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొదటి విడతగా 300 మందికి బీసీ బందు కుల వృత్తులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ జాబితాలో ఆర్థికంగా వెనుకబడిన కులాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ బి ఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వనజ .ప్రజ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

చదువుకుంటూనే ఉజ్వల భవిష్యత్తు
విద్యార్థులు చక్కగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలి,,
కృష్ణ.ఆగస్టు 11:– (తెలంగాణ ఎక్స్ ప్రెస్) కృష్ణ మండలం కున్సి గ్రామం లో ప్రతి ఒక్కరూ చదువుకుంటూనే భవిష్యత్తు బాగుంటుంది సర్పంచ్ అన్నారు. శుక్రవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. సమయం వృధా చేయకుండా బాగా చదువుకొని ఎదిగి గ్రామానికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు,తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రాధాన్య ఉపాధ్యాయులు, సురేందర్ ,ఉపాధ్యాయులు
గ్రామ సర్పంచ్ శంక్రమ్మఅంజినెయులు,మరియు ఎంపీటీసీ రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్ ఆగస్టు11 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల నూతన తహసీల్దారుగా దూలం మంజుల ఈరోజు బాధ్యతలు చేపట్టడం జరిగింది అంతకు ముందు వరంగల్ జిల్లా నల్లవెల్లి తహసీల్దారుగా పని చేసిన ఆమెను
బదిలీపై సైదాపూర్ మండలానికి తహసిల్దారుగా రావడం జరిగింది. ఈరోజు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ మంజులను కార్యాలయ సిబ్బంది స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు అనంతరం తాసిల్దార్ మంజుల మాట్లాడుతూ మండల ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మంచిర్యాల, ఆగస్టు 02, గతెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లె గ్రామంలో మండల పశు వైద్యం పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సోమవారం మండలంలోని చింతల పల్లె గ్రామ పంచాయితీ లో ఆవులు, గేదెలు, దూడలకు ఉచితంగా నట్టల నివారణ మందులు, గాలి కుంటు టీకాలు, ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు వైద్య శిబిరం నిర్వహించి, అన్ని పశువులలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున ముందస్తుగా అన్ని గ్రామాల్లో పశు సంవర్ధక శాఖ ద్వారా ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని పశువులను పెంచుకునే వారు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో పశువులకు వ్యాధి చోకిన, ప్రమాదం జరిగిన కూడా వైద్య అధికారికి ఫోన్ చేయగా అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ రాజన్న, మండల పశు వైద్య పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ శిరీష, సిబ్బంది రెహమాన్, కిషన్, సంజీవ్, సాగర్, వినోద్, ఆదిత్య, గోపాల మిత్ర లు రాజన్న, రమేష్, తదితరులు పాల్గోన్నారు.


మంచిర్యాల, జులై 27, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎడతెరిపిలేని వానల వల్ల పై నుండి వరద తాకిడి ఎక్కువ కావడంతో కడెం ప్రమాద స్థాయిలో చేరుకుంది. గురువారం ఉదయం నుండి కడెం గేట్ల ఆయకట్టు పై నుండి నీరు అతివేగంతో ప్రవహిస్తుంది. దీంతో కడెం ప్రాజెక్టు ప్రమాద స్థాయిలో ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కుల ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల నీరు కడెం డ్యామ్ లో నిలువ ఉన్నది. కడెం ప్రాజెక్టుకు పూర్తి 18 గేట్లు ఉండగా 14 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నాలుగు గేట్లు మొరాయించడం జరుగుతుందని వాటి ద్వారా పూర్తి నీరు బయట వదిలేలా చూస్తామని ప్రాజెక్ట్ ఇంజనీర్లు తెలిపారు. కడెం ప్రాజెక్టు ద్వారా దివగువకు నీరు వదలగా నది పరివాహక ప్రాంతాలు జనాలను సురక్షిత ప్రాంతాలకు మండల అధికారులు తరలించడం జరుగుతుంది. దీంతో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని నది పరివాహ ప్రాంతాలైన కలమడుగు, ధర్మారం, బాదం పెళ్లి, చింతగూడ, తపాలాపూర్, రోటి గూడ, తిమ్మాపూర్, గ్రామాల జనాలను ఆ గ్రామ కార్యదర్శులు సర్పంచులు ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్ మాట్లాడుతూ ఎగువ నుండి నీరు కడెం ప్రాజెక్టులోకి వరద రావడం వలన దిగువకు 18 గేట్ల ద్వారా నీటిని వదలడం జరుగుతుందని, నది పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో స్థానిక నాయకులు కార్యకర్తలు సహకరించాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కడెం ప్రాజెక్టు వద్ద ఉండి పూర్తి వివరాలు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తెలియ పరచడం జరుగుతుంది.