నర్వ మండలం, యాంకి గ్రామం
( తెలంగాణ ఎక్స్ ప్రెస్) ప్రతినిధి
నర్వ మండలము యాంకి గ్రామంలోని బస్టాండ్ దగ్గర బిఎస్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాపించిన భగత్ సింగ్ విగ్రహం దగ్గర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
భగత్ సింగ్ ప్రాణ త్యాగం వల్లనే ఈరోజు మనం స్వతంత్ర స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నామని,
భగత్ సింగ్ ఆశయాలను యువత ప్రేరణగా తీసుకోవాలని,
భగత్ సింగ్ విగ్రహం ఉండడం మన ఊరికి అదృష్టంగా భావించాలని….ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకట్ రెడ్డి, శివకుమార్, రైచూర్ శ్రీనివాస్ మాట్లాడటం జరిగింది.
ఈ కార్యక్రమంలో….
మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, బోయ పాలెం బాల్రాజ్,రైచూర్ శ్రీనివాస్, శివకుమార్Brs , ధర్మారెడ్డి, రాముBrs,తప్పేటి ప్రతాప్,కోమటి వెనయ్య, జయప్రకాశ్ రెడ్డి, జేజ్జలి అంజన్న, ఆనంద్, కుర్మన్న తదితరులు పాల్గొని.. జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.