Epaper
కాంగ్రెస్ అసమ్మతి నేతల కౌంటర్…..
బిచ్కుంద నవంబర్ 23 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా
బిచ్కుంద మండల కేంద్రంలోని మాజీ జెడ్పిటిసి ఇంట్లో కాంగ్రెస్ అసమ్మతి నేతలు సమావేశమై నిన్న ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు మీడియా ముఖంగా కౌంటర్ ఇచ్చినారు. మాజీ ఎంపిటిసి సురేష్ మాట్లాడుతూ…
నిన్న మన ఎమ్మెల్యే గారు మార్కెట్ కమిటీ లో ఇచ్చిన ప్రెస్ మీట్ గురించి విషయంలోకి వెళ్తే బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ నాయడైన పై గురించి పై మీరు చేసిన ఆరోపణలు అధికార అహంకారంతో ఊగిపోతున్న మీరు నోటికి ఏది వస్తది మాట్లాడటం సరికాదు… చిన్న వ్యాపారుల దగ్గర తీసుకున్నారన్న విషయం మీరు చూశారా.! మీకు ఎవరైనా చెప్పారా మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా.! వసూలు పర్వంలో మీరు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారనే విషయం మాకంటే మీకే బాగా తెలుసు ఎమ్మెల్యే గారు…! జుక్కల్ నియోజకవర్గంలో వివిధ శాఖలకు ఉద్యోగులకు మీరు సూచించిన విషయాలు వారిని వచ్చి కలమన్న విషయాలు ఎందుకో మీకు తెలియాలి ఎమ్మెల్యే గారు….! మా నాయకుడి పై ఆరోపణలు చేసే స్థాయిలో మీరు లేరు కేవలం 13 రోజుల్లో మిమ్మల్ని అసెంబ్లీకి పంపిన విషయంలో మా నాయకుడి కృషి ఎంత ఉందో మాకంటే మీకే బాగా తెలుసు ఎమ్మెల్యే గారు…!
చరిత్రల గురించి తెలుసుకోవాలంటే మీ చరిత్ర విషయంలో హైదరాబాద్ పరిధిలో సైబరాబాద్ రాజేంద్రనగర్ ఎల్బీనగర్ సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో జరిగిన విషయాల గురించి ఒకసారి గుర్తు తెచ్చుకొండి ఎమ్మెల్యే గారు…! మా నాయకుడి గురించి చెప్పాలంటే 1972లో కరువు ఏర్పడినప్పుడు( మక్కల కరువు )బిచ్కుంద గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత మా నాయకుడి పూర్వీకులది..
ఇంకో విషయంలోకి వెళ్తే జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర ఒక వాచ్మెన్ ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు మీరు ఇలాంటి ఆరోపనాలు చేసే ముందు ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత మీకు ఎక్కడ ఏ ఉద్యోగం దొరుకుతుందో ఆలోచించుకోండి లేదంటే మా నాయకుడు ఇంటిముందు వాచ్మెన్ ఉద్యోగం నేను ఇప్పిస్తాను ఎమ్మెల్యే గారు…!
కాంగ్రెస్ నాయకులను వివిధ జంతువులతో పోల్చిన మీరు ఒక కాంగ్రెస్ కార్యకర్త అన్న విషయం మర్చిపోయారు.. ఎమ్మెల్యే గారు…!
గ్రూప్లో విషయంలోకి వస్తే నియోజకవర్గానికి మీరు వచ్చినప్పుడు చేసిన గ్రూప్ రాజకీయాలు కాదా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం.. ఎమ్మెల్యే గారు…!
మండల స్థాయి నాయకుల గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడే ముందు జాగ్రత్త వేయించి మాట్లాడండి.. ఎందుకంటే ఈ స్థాయిలో ఉన్నారంటే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబం విషయం మర్చిపోతున్నారు మీరు తగిన సమయంలో ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెబుతారు.. ఇట్టి కార్యక్రమంలో ఆవారా సురేష్ తో పాటు, పుల్లెల వెంకట్, కమల్ కిషోర్, జి మొగులయ్య, పాషా సెట్, పోతుల అశోక్, పప్పు సెట్, వీరేందర్, గంపల గంగాధర్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు