మిర్యాలగూడ డిసెంబర్ 10 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ లో గల అయ్యప్ప స్వామి దేవాలయం లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది.మంగళవారం నాటికి 21వ రోజుకు చేరుకుంది. పూజా కార్యక్రమoలో పులిమేడు ఆశ్రమ గురుస్వాములు దేశిడి శేఖర్ రెడ్డి గోదాల జానకి రామ్ రెడ్డి స్వాముల ఆధ్వర్యంలో స్వామి వారి పూజలో మిర్యాలగూడ ఫర్టిలైజర్స్ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు హాజరై భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించారు సుమారు 1500 మంది అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, ఆంజనేయ స్వాములు, అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహా అన్నప్రసాద కార్యక్రమానికి బత్తుల లక్ష్మారెడ్డి, ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్, ప్రముఖ రైస్ మిల్లర్ డాక్టర్ బండారు కుశలయ్య, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంట సంతోష్ రెడ్డి, నేతాజీ కూరగాయల మార్కెట్ సహకారంతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ముక్కాపాటి వెంకటేశ్వరరావు,25 వ వార్డ్ ఇంచార్జ్ గోదాల జానకి రామ్ రెడ్డి, గురుస్వాములు నాయుడు నాగరాజు బాలు సుబ్బారెడ్డి, మారుతి వెంకట్ రెడ్డి, లవ ప్రసాద్ నగేష్ మిత్ర నరసింహారావు హరీష్ నవీన్,మోహన్ రెడ్డి, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.
Category: