తిరుమలగిరి ఏప్రిల్ 16:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో మండల కేంద్రంలో, గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రఘువీర్ రెడ్డి అని అన్నారు
ఎస్పి గారి ఆదేశాల మేరకు, Addl SP & DSP సూర్యాపేట గార్ల పర్యవేక్షణలో తిరుమలగిరి PS పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం, ప్రజలకు అవగాహన కలిగే విధంగా మెరుగైన భద్రత లక్ష్యంగా మండల పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పారామిలిటరీ సిబ్బంది, స్థానిక పోలీసుల అధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం అని అన్నారు. వారితోపాటు తిరుమలగిరి ఎస్ఐ కె .సత్యనారాయణ మరియు పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
గంభీరావుపేట ఏప్రిల్ 15(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
నర్మాల ఎంపీ యూ పీ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తప్పిన పెను ప్రమాదం. పూర్తి వివరాల్లోకి వెళితే గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ఎంపీయుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి బోరు మోటరు కి సంబందించిన షాటర్ సర్క్యూట్ పేలడంతో షాటర్ నుంచి మంటలు లేవడం జరిగింది మరియు షాటర్ పూర్తిగా కాలి పోవడం జరిగింది.అదే సమయంలో అక్కడ ఉన్న గొర్రె కిషోర్ వెంటనే విద్యుత్ లైన్ మెయిన్ శ్రీ శైలం కి ఫోన్ చేయడం తో వెంటనే లైన్ మెయిన్ సంఘటన స్థలానికి చేరు కొని ఏమి ప్రమాదం జరగకుండా మంటలు ఆర్పడం జరిగింది.సాయంత్రం వేళ లో షాటర్ పేలడంతో ఎవరికీ ఏమి ప్రమాదం జరగలేదు.లైన్ మెయిన్ విద్యుత్ తీగలకు విద్యుత్ రాకుండా చేయడంతో ఎవరికీ ఏమి ప్రమాదం జరగలేదని సంఘటన స్థలం లో ఉన్న వారు తెలిపారు.
వెంటనే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ కి గ్రామస్తుడు ఐన కిషోర్ ఫోన్ చేసి ఉదయం పాఠశాలలో విద్యార్థులకు మంచినీటి కోసం నూతన షాటర్ ఫిట్ చెయ్యాలని విద్యార్థులకు ఏమి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు.
టేక్మాల్, ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో వెలిసినటువంటి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీ రామచరణ్ గుట్టపై వెలసినటువంటి సీతారాముల 40వ కళ్యాణం మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆత్మానంద ఆశ్రమ ఆలయ కమిటీ సభ్యులు సోమవారం రోజున మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు స్వగృహం నా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు గ్రామ రామాచలం భక్త బృందం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే సీతారాముల ఉత్సవాలను, పురస్కరించుకో ని ఆహ్వాన పత్రికను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి దామోదర్ కు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మానంద ఆశ్రమ రామచలం భక్త బృందం సభ్యులు నర్సింలు యోగేందర్ అబ్రహం లచ్చ గౌడ్ నరసింహులు రమేష్ పలువురు ఉన్నారు.
అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం .
సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు,02 ఆటో ,05 కార్ లు స్వాధీనం.
డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి
గంభీరావుపేట ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పీ చంద్ర శేఖర్ మట్లాడుతు ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే జిల్లా ఎస్పీ ఉద్దేశ్యం తోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలల చే విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎలాంటి పేపర్లు లేని, సరైన నంబర్ ప్లేట్స్ లేని 32 ద్విచక్ర వాహనాలు,02 ఆటో లు ,05 కార్ లు సీజ్ చేయడం జరిగిందని ,సబంధించిన వాహన దారులకు సరైన పాత్రలు చూపించి వాహనాలు తీసుకవేళ్ళవచ్చు అన్నారు.
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు.ఒక లీటర్ గుడుంబా,40 లీటర్ల వాష్ అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన కోమణి పై కేసు నమోదు చేసి గుడుంబా, వాష్ సీజ్ చేయడం జరిగింది.గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.
గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో,నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమం తరుచుగా నిర్వహిస్తామని,చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అయిన గాంజా, గుడుంబా రవాణా మరియు విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు ,
జిల్లా గార్డ్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల ఎస్సీ స్టడీ సర్కిల్ పరిశీలన
గంభీరావుపేట (సిరిసిల్ల)ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ విద్యార్థులు ఎస్సీ స్టడీ సర్కిల్ ను సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ ను కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ లో విద్యార్థులకు కల్పించిన వసతి, బోజన సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం స్టడీ సర్కిల్ లోని విద్యార్థులతో మాట్లాడారు. ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ విద్యార్థులు స్టడీ సర్కిల్ లోని సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పక్కా ప్రణాళికతో అభ్యసించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల ఎస్సీ స్టడీ సర్కిల్ లో మొత్తం 100 మంది అభ్యర్థులు ఉన్నారు.55 మంది యువకులు, 45 మంది యువతులు ఉన్నారు. ఇక్కడ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ కోసం రూ. 2500/- యువకులకు ప్రతి నెలా రూ. 100, యువతులకు ప్రతి నెలా రూ. 150 మైంటనేన్స్ కోసం ఇస్తామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్ తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు స్టడీ సర్కిల్ లో సంప్రదించాలని సూచించారు.ఈ సందర్బంగా సూపరింటెండెంట్ మొహమ్మద్ అజాం తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడ్ తండా కు చెందిన సేవాలాల్ దీక్ష స్వాములు , సోమవారం తాండాలోని సేవాఘడ్ జగదంబ దేవి, సేవాలాల్ ఆలయం నుండి, వాహనాల్లో మహారాష్ట్ర లోని పౌరాదేవీ ఆలయానికి (పౌరాఘడ్ ) బయలు దేరారు. ఈ సందర్బంగా సేవాలాల్ దీక్ష స్వాములకు, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఉపాధ్యక్షులు గణేష్ నాయక్ , గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, సేవాఘడ్ ఆలయ అభివృద్ధి కమిటీ వారికి పూలమాలలతో సత్కారం చేసి, పూజ కార్యక్రమంలో పాల్గొని దీక్ష స్వాములకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ దీక్ష స్వాములు, తాండా వాసులు తదితరులు ఉన్నారు.
దీర్ఘ కాలిక రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి….ప్రభుత్వం రైతులపంట రుణాలు ఏక కాలంలో మాఫీ చేయాలని తీర్మానం… ఎల్లారెడ్డి సొసైటి ఛైర్మన్ ఏగుల నర్సింలు
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి సొసైటీలో సభ్యత్వం కలిగి ఉన్న రైతులు దీర్ఘ కాలిక రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని , సొసైటి ఛైర్మన్ ఏగుల నర్సింలు సూచించారు. సోమవారం స్థానిక సొసైటి కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన పాలక వర్గ సమావేశం జరిగింది. ముందుగా సొసైటి కార్యదర్శి విశ్వనాథం ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను సభ్యులకు చదివి వినిపించారు. ఆ తర్వాత చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే సొసైటి పరిధిలో 14 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 6827.60 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వరుస క్రమంలో కొనుగోలు చేయడం జరుగుతోందని, కేంద్రాల వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. సొసైటీలో సభ్యత్వం కలిగి ఉండి సహకార బ్యాంక్ ద్వారా రైతులు తీసుకున్న రుణాలను సక్రమంగా వాయిదాల ప్రకారం చెల్లించి సొసైటి అభివృద్ధికి సహకరించి, తిరిగి నూతన దీర్ఘ కాలిక రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. సొసైటి పరిధిలోని గండిమాసాని పేట్ వద్ద షట్టర్ల నిర్మాణం కోసం, లింగారెడ్డి పేట్ సొసైటి కార్యాలయం భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కోసం, అలాగే అర్హులైన రైతులకు దీర్ఘ కాలిక రుణాల ను ఇచ్చేందుకు, సర్కార్ రైతుల పంట రుణాలు ఏక కాలంలో రుణ మాఫీ చేయాలని పాలక వర్గ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చైర్మన్ తెలిపారు. ఈ సమావేశంలో సొసైటి చైర్మన్ ఏగుల నర్సింలు, వైస్ చైర్మన్ మత్తమాల ప్రశాంత్ గౌడ్, పాలక వర్గ సభ్యులు మర్రి సూర్య ప్రకాష్, ఎం.పౌలయ్య, వై.బాలరాజు, లంబాడి లక్ష్మణ్, సి హెచ్ .పోచమ్మ, ఎం.సత్యవ్వ, చెన్నంగారి సుఖేందర్ రెడ్డి, నాగం గోపి కృష్ణ, పాల్దె నారాయణ, ఎన్.నర్సింలు, సొసైటి కార్యదర్శి విశ్వనాథం, సిబ్బంది మల్లేష్, సాయిబాబు, సత్యనారాయణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట , ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నాగిరెడ్డిపేట
మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామపంచాయతీ రికార్డులను సోమవారం
ఇన్చార్జి ఎంపిఓ ప్రకాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం సందర్భంగా గ్రామంలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, గ్రామ ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎండ తగ్గేవరకు ఇంటి నుండి బయటకు రాకూడదని, ఎండ సమయం కాకముందు తమ పనులను ముగించుకొని ఇంట్లోనే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు.
పిట్లం,ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) మండల పరిధిలోని గద్దగుండు తాండకు చెందిన తాండవాసులు సోమవారం బిజెపి ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో బిజెపిలోకి చేరినట్లు మండల అధ్యక్షుడు అభినయ్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ..దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో మరొక మారు 400పై ఎంపీ స్థానాలతో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని,బీసీ,ఎస్సీ,ఎస్టీలకు బీజేపీ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని,గిరిజన మహిళను భారతదేశ రాష్ట్రపతిగా గొప్ప అగ్రస్థానంలో నిలుపడం కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం బంజారా గిరిజనుల ఆరాధ్య దైవమైన పౌరదేవి ఆలయ అభివృద్ధికి క్రృషి చేసి ఆత్మ గౌరవం నిలబెట్టేల రాబోయే కాలంలో అందరికీ సమాన న్యాయం బీజేపీ తోనే సాధ్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాము,జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు అశోక్ రాజ్, పట్టణ అధ్యక్షుడు శివ కుమార్,
నాయకులు బెజుగం నర్సింలు,జగదీష్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి శోభాయాత్రను విజయవంతం చేయండి… వీరహనుమాన్ శోభాయాత్ర గోడప్రతుల ఆవిష్కరానా
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ):
ఈ నెల 23 న మంగళవారం నాడు హనుమాన్ జయంతి ని పురస్కరించుకుని, ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న వీరహనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని విహెచ్పి, భజరంగ్ దళ్ సదస్యులు కోరారు. సోమవారం స్థానిక శ్రీ శ్రీ శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయం వద్ద హనుమాన్ జయంతి శోభాయాత్ర కార్యక్రమాల వివరాలతో కూడిన గొడప్రతులను వారు ఆవిష్క రించారు. ఈ సందర్భంగా విహెచ్పి మండల అధ్యక్షులు నవీన్ చారి, భజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ వినోద్ లు మాట్లాడుతూ, హనుమాన్ జయంతి 23 న మంగళవారం సాయంత్రం 4.00 గంటలకు పప్పు హనుమాన్ మందిరం (సాతెల్లి బేస్ ) నుంచి శోభా యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. యువకులు హనుమాన్ భక్తులు ఈ శోభాయాత్ర లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదే రోజు మధ్యాహ్నం ఆన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఈ గోడ ప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల వి హెచ్ పి అధ్యక్షులు నవీన్ చారి, భజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ వినోద్, పట్టెం కిషన్ , భజరంగ్ దళ్ సంయోజక్ తులసి దాస్, భరత్, లోహిత్, రాహుల్, రాజు, బాలు, వంశీ, మంచిర్యాల విద్యాసాగర్, మత్తమాల ప్రశాంత్ గౌడ్, కుశల కంటి మహేష్, సాయిప్రసాద్, బాల్ రాజు , నరేష్ , గణేష్, అనిల్ నాయక్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.