హైదరాబాద్, ఏప్రిల్ 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)మాజీ మంత్రి హరీష్ రావు పదేళ్లు రాష్ట్ర మంత్రిగా ఉండి రైతులకు చేసింది ఏముందని మాజీ మంత్రి హరీష్ రావుపై
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎంపీ ఎన్నికలలో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ ర్యాలీ అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు మాట్లాడుతూ..మాజీ మంత్రి హరీష్ రావు సై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను చూసి ఓర్వలేక ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకొక్కటిగా నెరవేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ స్థానికూడని, బీజేపీ అభ్యర్థి బీబీ.పాటిల్ బిజినెస్ పాటిల్ అని అన్నారు. అవసరాన్ని బట్టి కారెక్కి 10ఏళ్ళు ఎంపీ గా పదవీని అనుభవించి , కారు దిగి బీజేపీలో చేరడాన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిగా గెలిస్తే, తను, ఎంపీ కలిసి జహీరాబాద్ నియోజక వర్గం అంత అభివృద్ధి చేయోచ్చు అన్నారు. మీడియాతో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన వారిలో జహీరాబాద్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ , బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
కామారెడ్డి, ఏప్రిల్ 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ కుడుముల సత్యనారాయణపై బుధవారం 10మంది వార్డు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాస పత్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కు అందచేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ లో 12మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా, మెజార్టీ సభ్యులు అవిశ్వాస పత్రంలో సంతకం చేశారు. అవిశ్వాసం పెట్టిన సభ్యులు, శిబిరానికి తరలినట్లు సమాచారం.
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఎల్లారెడ్డి మండలంలోని అల్మాజీపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. పోచమ్మ తల్లి బోనాల సంధర్బంగా ఆలయం వద్ద ఈ కుస్తీపోటీలు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ప్రతినిధి సుభాష్ రెడ్డి వనిత రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కుస్తీపోటీల్లో విజేతలుగా నిలిచిన నిజాంసాగర్ మండలం అచ్చంపేట కు చెందిన మైపాల్ కు సిల్వర్ కడియం బహుకరించారు. ద్వితీయ బహుమతిని సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ కు చెందిన మహబూబ్ సాధించారు. ఈ పోటీలను గ్రామస్తులు ఆసక్తికరంగా తిలకించారు. ప్రతి ఏడాది ఇదే విధంగా సాంప్రదాయ పద్దతితో ప్రశాంత వాతావరణంలో కుస్తీ పోటీలు జరుగుతాయని సుభాష్ రెడ్డి తెలిపారు.
సిబ్బంది ఎల్ సి తీసుకున్న తర్వాతే పోల్స్ ఎక్కాలి…ఎర్త్ రాడ్ వినియోగం తప్పనిసరి…..విద్యుత్ ఎస్ఈ రమేష్ బాబు
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 19,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ మరమ్మత్తు పనులను విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఎల్ సి తీసుకున్న తర్వాతే పోల్స్ ఎక్కాలి అని, విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్ బాబు సూచించారు. శుక్రవారం ఎల్లారెడ్డి విద్యుత్ ఆపరేషన్స్ పరిధిలోని ఎల్లారెడ్డి, లింగం పేట్, గాంధారి, నాగిరెడ్డి పేట్ 4 మండలాల విద్యుత్ సిబ్బందితో, ఎన్ పి డీ సి ఎల్ సీ ఏం డి ఆదేశాల మేరకు లింగంపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఈ మాట్లాడుతూ, గృహ, గృహేతర విద్యుత్ వినియోగ దారులకు నాణ్యమైన విద్యుత్తు ను అందజేయడం జరుగుతుంది అని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంలో సిబ్బంది అప్రమత్తత ఎంతో అవసరం అని, ప్రమాదం జరగకుండా విద్యుత్ మరమ్మత్తుల పనులు చేసే విషయంలో ముందుగా, సిబ్బంది సబ్ స్టేషన్ నుంచి ఎల్ సీ తీసుకున్న తర్వాతే పోల్స్ ఎక్కి మరమ్మత్తు పనులు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎర్త్ రాడ్ తో గ్రౌండ్ ఎర్త్ తప్పనిసరిగా చేయాలి అని, లైన్ పోల్ క్రాసింగ్ పనులు చేసే సమయంలో ఎర్త్ రాడ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. పనులు చేసే సమయంలో అజాగ్రత్త వహిస్తే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించారు. విద్యుత్ డి టీ ఆర్ (ట్రాన్స్ ఫార్మర్) లను ఎప్పటి కప్పుడు మరమ్మత్తులు చేసి , అవసరమైతే ఆయిలింగ్ చేసి, విద్యుత్ వినియోగ దారులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని ఆదేశించారు. అక్రమంగా విద్యుత్ చౌర్యం జరగ కుండా విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆతర్వాత విద్యుత్ టెక్నికల్ డి ఈ ఈ వెంకట రాంబాబు విద్యుత్ సిబ్బందికి విద్యుత్ సరఫరాలో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే విషయాన్ని వివరించారు. ప్రతి ఒక్క విద్యుత్ సిబ్బంది తమ ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని, పని చేసి, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. అనంతరం ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహిస్తామని సిబ్బంది చే ప్రతిజ్ఞ చేయించారు. ఈ విద్యుత్ సిబ్బంది అవగాహన సదస్సులో ఎస్ ఈ రమేష్ బాబు, డి ఈ ఈ (టెక్నికల్) వెంకట రంగయ్య, ఎల్లారెడ్డి డివిజనల్ ఆపరేషన్స్ డి ఈ ఈ గణేష్, ఏడీ ఈ సుదర్శన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, డీ ఈ ఈ ఆపరేషన్స్ పరిది లోని ఎల్లారెడ్డి ఎఈ సత్యనారాయణగౌడ్, లింగంపేట్, గాంధారి, సర్వాపూర్, నాగిరెడ్డి పేట్, శెట్పల్లి సంగారెడ్డి విద్యుత్ ఏ ఈ లు, ఫోర్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మెన్ లు, జె ఎల్ ఏం లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
“ఐ ఎన్ టి ఎస్ ఓ” ఒలింపియాడ్ పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరీ…
మేడ్చల్, ఏప్రిల్ 19,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
దేశ వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలింపియాడ్ (ఐ ఎన్ టి ఎస్ ఓ) పరీక్ష ఫైనల్ స్టేజ్ ఫలితాల్లో, మేడ్చల్ పరిధిలోని గుండ్ల పోచంపల్లి లో గల శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు విజయ భేరి మోగించారు అని పాఠశాల ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐ ఎన్ టి ఎస్ ఓ 2023 – 24 విద్యాసంవత్సరంకు గాను జరిగిన పరీక్షల తుది ఫలితాల్లో పాఠశాల నుంచి 287 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ – మె రిట్ సర్టిఫికెట్స్ సాధించారని అన్నారు. జి. క్రిశాంగ్ , ఏ.హర్ష వర్ధన్ లు ట్యాబ్ లను మొదటి బహుమతులుగా గెలుచు కున్నారని, ఏ.వర్షిత్, పీ.శ్రీ చరణ్, ద్వితీయ బహుమతులు, జి.మణితేజరెడ్డి, ఎం.రుత్విక్, ఎం.సుజయ్, ఏ .సాయి అక్షిత్ రెడ్డి లు 4వ బహుమతులను, ఎం. వర్షిత్ పటేల్, ఎన్.జ్ఞానేశ్వర్, పీ.గౌతం లు 5వ బహుమతులను గెలుచు కున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. తమ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు ఇది చక్కని నిదర్శనం అని ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి కొనియాడారు. చక్కని ప్రతిభ కనబరిచే విధంగా విద్యా ర్థులను సంసిద్దులను చేసినందుకు గాను చైతన్య విద్యా సంస్థల కొంపల్లి జోన్ ఏ జి ఎం జీవి రమణ రావు, జోన్ కో ఆర్డినేటర్ జైపాల్ రెడ్డి , డీన్ సోమేశ్వర్ రావు, అఖిల్ విద్యార్థులను వారి తల్లి తండ్రులను, ఉపాద్యాయ బృందంను ప్రత్యేకంగా అభినందించారు.
వ్యాపారంలో కాంట్రాక్టు అయిపోయినట్టు బీఆర్ఎస్ పార్టీ తో కాంట్రాక్టు అయిపోగానే బీజేపీ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న బీబీ పాటిల్… బీబీ పాటిల్ పై ఫైర్ అయిన ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 18:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )వ్యాపారంలో కాంట్రాక్టు అయిపోయినట్టు బీఆర్ఎస్ పార్టీ తో కాంట్రాక్టు అయిపోగానే బీజేపీతో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఎంపీ.బీబీ పాటిల్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు ఆరోపిస్తూ.. బీబీ పాటిల్ పై ఫైర్ అయ్యారు. గురువారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..బీబీ పాటిల్ వ్యక్తిగత స్వార్థం కోసం మూడోసారి ఎంపీగా పోటీ చేస్తున్నాడన్నారు. పది ఏళ్లుగా ఎంపీగా పని చేసి కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ , బాన్సువాడ, నారాయణఖేడ్ సెగ్మెంట్ లకు ఎంపీగా ఏం చేసారని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచి ఏ నదైన ఏ ఒక్క గ్రామంలోనైనా తిరిగి ఒక్క కుటుంబాన్ని అయినా ఆదుకున్నాడా అన్నారు. 2021లో పాత్రికేయ మిత్రులపైన బీబీ పాటిల్ పరువు నష్టం కేసు వేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ.. అప్పుడు నేను పాత్రికేయ మిత్రులకు అండగా ఉన్నానన్నారు. మాస్టర్ ప్లాన్ లో రైతులను మోసం చేసాడని, నిరుద్యోగులను నియోజకవర్గ యువకులకు ఒక్క ఉద్యోగం ఇప్పించకుండా క్యాబ్ డ్రైవర్లుగా, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ గా చేసాడనంబరు. ఒక్క ఉద్యోగం ఇవ్వలే, ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక్క రోడ్డు వెయ్యలేదు చివరికి వచ్చిన నిధులను కూడా వాపస్ పంపిన ఘనత మన ఎంపీ దన్నారు. దయచేసి రైతులు, యువకులు అందరూ ఆలోచించండి, బీజేపీకి ఓటు వేస్తె మూలకున్న కొయ్యను తీస్కొని మన మెడకు ఉరి వేసుకున్నట్టే అన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి అద్భుతమైన అభివృద్ధిని చేసుకుందాం అన్నారు.
ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి సెగ్మెంట్లో హస్తం పార్టీకి భారీ మెజార్టీ కోసం వ్యూహంతో ఎమ్యెల్యే మదన్ మోహన్….ఎల్లారెడ్డి కాంగ్రెస్లో భారీ వలసలు…
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 16:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అగ్రనాయకుడు ప్రచారానికి రానున్న తనదైన రాజకీయ చతురత ప్రదర్శించి ఎల్లారెడ్డి బీఆర్ఎస్ కంచుకోటకు బద్దలు కొట్టి ఎల్లారెడ్డి సెగ్మెంట్ ను హస్తగతం చేసిన రాజకీయ చతురుడు ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు. జహీరాబాద్ ఎంపీ ఎన్నికల్లో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, రాజకీయ అనుభవాన్ని రంగరించుకున్నారు. పట్టుదల, నమ్మకం, విశ్వాసంతో ప్రజల నాడి పట్టేసి మొట్టమొదటి సారి ఎల్లారెడ్డి ఎమ్యెల్యే అయ్యారు. తను ఓడిన చోటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి జహీరాబాద్ సీటు దక్కేలా తనదైన శైలిలో ఎంపీ ఎన్నికల ప్రచార వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిదిలో ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో హస్తం పార్టీకి ఊహించని మెజార్టీ తేవాలని మండలాలు, గ్రామ స్థాయి పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారు ఎన్నికల్లో ప్రజలవద్దకు వెళ్లి నిర్వహించాల్సిన ప్రచార సరళి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం. రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం రాష్ట్ర అభివృద్ధికి ఎలా ముందుకు సాగుతున్నారు, రాబోయే రోజుల్లో ప్రభుత్వ కృషిని ప్రతి గడపకు ఎలా చేర్చాలి, ప్రత్యర్థుల వ్యూహాన్ని ఎలా చిత్తు చేయాలి, అన్న విషయాలపై ఆయనే స్వయంగా ముఖ్య కార్యకర్తలతో వ్యక్తిగత సమావేశాలు నిర్వహిస్తూ, దశ దిశ నిర్ణఇస్తూ వస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ కు భారీ మెజార్టీ సాధించిన సెగ్మెంట్ గా ఎల్లారెడ్డి నిలిచిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాన్సువాడ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అయిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్యెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా పోటా పోటీగా నియోజక వర్గాల్లో ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సాధన కోసం పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో ప్రత్యర్థులకు మదన్ మోహన్ వ్యూహం ఎంటన్నది అవగతం కావడం లేదు. ప్రత్యర్థులపై మీడియా, సోషల్ మీడియా ద్వారా అస్త్రాలు సంధిస్తున్న, కౌంటర్ లు ఇవ్వడంలో ప్రత్యర్థులు విఫలం అవుతున్నారని ఓ వర్గం అంటున్న, ప్రత్యర్థుల వ్యూహం మరో రకంగా వుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డి జిల్లాలోనే బీఆర్ఎస్ గండికోటకు గండికొట్టి కాంగ్రెస్లోకి భారీ వలసలు రప్పించడంలో తన రాజకీయ చతురతను ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో చాటుతున్నారు ఎమ్యెల్యే మదన్ మోహన్. ఎవ్వరు ఊహించని రీతిలో బీఆర్ఎస్, బీజేపీల నుండి వలసలు రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా లక్షకు పైగా ఓట్లు రాబట్టేందుకు ఆయన అన్ని శక్తులు వొడ్డుతున్నారు. రాష్ట్రలో అధికారంలోకి వచ్చాక
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. ఈ సెగ్మెంట్ లో ఓటర్లు మొదటి నుండి కాంగ్రెస్ ను ఆదరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి జాజాల సురేందర్ గెలిచి , బీఆర్ఎస్ లోకి వెళ్లడంతో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సురేందర్ ను సెగ్మెంట్ ప్రజలు, పార్టీ మారడం జీర్ణించుకోలేక ఓడించారు. గ్రామ స్థాయిలో నీటి ఎద్దడి తీర్చిడంలో, సీసీ రోడ్ల నిర్మాణంలో, తక్షణ సహాయల్లో గ్రామాల్లో మదన్ మోహన్ కు ఆదరణ పెరిగింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉన్న ఆయన పలుకుబడి వల్ల ఇప్పటికైతే భారీ స్థాయిలో నిధులు సమకూర్చుతూ.. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ అభిమానాన్ని ఆయన సాధించారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి సెగ్మెంట్లో లో మదన్ మోహన్ రావు రాకతో 80వేలపై చిలుకు ఓట్లతో కాంగ్రెస్ విజయం సాధించడం. 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుండి ఎంపీగా పోటీచేసి స్వల్ప మెజారిటీతో ఓడినా మదన్ మోహన్ రావు కి మంచి పట్టు వుండడం కాంగ్రెస్ ఈ సారి ఎంపీ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో భారీ మెజార్టీ సాధిస్తే, మంత్రి వర్గంలో బెర్త్ కన్ఫామ్ అన్న వాదనలున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రచార పర్వరంలో ఎవరి స్టైల్ లో వారు దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో అదృష్టం అనేది ఎవర్ని వరిస్తుందనేది వేచి చూడాల్సిందే.
బోనకల్, ఏప్రిల్ 15:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ): డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జన్మదిన వేడుకల సందర్భంగా చింతపల్లి మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన జై భీమ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బోనకల్ మండల కేంద్రంలో గల శాంతి నిలయంలో మానసిక బాలికల అంగవైకల్యం గల విద్యార్థులుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జై భీమ్ యూత్ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ… అంబేద్కర్ జయంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమం చేయడం,వారితో కలిసి భోజనం చేయడం మనసుకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. అటు విద్యార్థుల పర్యవేక్షకురాలైన సిస్టర్ అల్ఫీ మేడం ను యూత్ సభ్యులు మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు రాబోయే కాలంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ అధ్యక్షులు రమేష్, శాంతి నిలయం నిర్వాహకురాలు సిస్టర్ అల్ఫీ, యూత్ కార్యదర్శి, ట్రెజరర్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
మేడ్చల్, ఏప్రిల్ 15:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మేడ్చల్ జిల్లా శామీర్ పెట్ లోని లియోనియా లో
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయు) ఆధ్వర్యంలో ఆదివారం నుంచి లియోనియా రిసార్ట్ లో జాతీయస్థాయి వైస్ ఛాన్స్లర్ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఏఐయు అధ్యక్షుడు జీడి శర్మ తెలిపారు. స్వాతంత్రం అనంతరం ఇప్పటివరకు ఉన్నత విద్యలో సాధించిన అభివృద్ధి భవిష్యత్తులో సాధించాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించనున్న ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు సాగే కార్యక్రమానికి సంబంధించిన ప్రాస్పెక్టర్ ను ఉపాధ్యక్షులు వినయ్ కుమార్ పాఠక్, సెక్రటరీ పంకజ్ మిట్టల్, ఇక్ఫాయ్ యూనివర్సిటీ వీసి ఎల్ ఎస్ గణేష్, మాజీ వైస్ ఛాన్స్లర్ మహేందర్ రెడ్డి లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ వందేళ్ళ భారత స్వతంత్ర వేడుకలకల్లా వికసిప్ భారత్ ను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా విద్యా విధానంలో రావాల్సిన మార్పులపై సమగ్రంగా చర్చించనున్నట్లు చెప్పారు. దేశ అభివృద్ధి మొత్తం విద్యుత్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇప్పటికే అద్భుత ప్రగతిని సాధించిన దేశం ఆయా రంగాలలో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలపై వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. మూడు రోజులు సాగే ఈ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన వివిధ యూనివర్సిటీల కు చెందిన 500 కు పైగా వైస్ ఛాన్స్లర్లు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమాలలో భాగంగా ఏఐయు హ్యాండ్ బుక్ తో పాటు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ త్రు షన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు.
మంచిర్యాల, ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్): వడ్డీవ్యాపారులు ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్–1 ఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. కొంత మంది వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. డబ్బు చెల్లించని వారి నుంచి బలవంతంగా ఇల్లు, పొలాల పత్రాలను తీసుకుంటున్నట్టుగా ఫిర్యాదులు అందడంతో ఆదివారం రంగనాథ్ స్పందించారు. మల్టీజోన్ ఒకటే జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, సంస్థల ప్రాంగణాల్లో జిల్లాల ఎస్పీలు సోదాలు చేపట్టారు. ఈ మేరకు ఐజీ కార్యాలయం నుండి ప్రకటన వెలువరించింది. దాడుల్లో వడ్డీ వ్యాపారుల ఇండ్లు, సంస్థల నుంచి పెద్ద మొత్తంలో నగదు బంగారం, విలువైన డాక్యుమెంట్లు, చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కోర్టుల్లో అందజేయడంతో పాటు డబ్బును ఇన్ కంట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 3 రోజులుగా దాడులు చేపట్టామని వెల్లడించారు.