మిర్యాలగూడ పట్టణం లో నీ ఆదిత్య పాఠశాల లో విద్యార్థుల స్వపరిపాలనా దినోత్సవo వైభవంగా, వినూత్నంగా, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సుమారు 120 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా, హోమ్ మినిస్టర్ గా ఎస్. కే. కరిష్మా, విద్యాశాఖ మంత్రిగా జి.గీతిక, ప్రాధమిక విద్యాశాఖ మంత్రిగా పి. హర్షిత, సెకండరీ విద్యాశాఖ మంత్రిగా తణ్మయి కుమార్. టెక్నికల్ విద్యాశాఖ మంత్రిగా పి. అపూర్వ, హెల్త్ మినిస్టర్‌గా ఆర్. దుర్గ, రెవెన్యూ మినిస్టర్ ఎస్. అర్జున్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గా పి. నవ్య, జాయింట్ కలెక్టర్ గా కే. జనని రెడ్డి , అడిషనల్ కలెక్టర్ గా జూబి తరుణ్ణం, ఎంమ్మెల్యే గా రిషి చరణ్,డి. ఈ. ఓ గా పి. కవిత,ఎం. పి. డి. ఓ గా. పి. కవిత, ఎం.ఆర్.ఓ గా జి. విఘ్నేశ్వర్ ఎం.ఈ.ఓ.గా
డి. మహిత, కరెస్పాండంట్ గా పి. అఖిలండీశ్వరి, డైరెక్టర్స్ గా, సి. ఎహెచ్. స్ఫూర్తి, ఆఫ్రా అనుమ్, యశస్వి,ప్రిన్సిపాల్ గా. ఎస్. కే సుహానా,వైస్ ప్రిన్సిపాల్ గా, జి. రిషిత ఉన్నతాధికారులుగా పాత్రలను ధరించి, సృజనాత్మకంగా, వినూత్నంగా, స్వపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులుగా పాత్రలను పోషించిన విద్యార్థులు ప్రతిభావంతంగా భోధించి అందరిని ఆకట్టుకున్నారు.ఉన్నతా ధికారులుగా పాత్రలను పోషించిన విద్యార్థిని, విద్యార్థులు ఆ పాత్రలకు తగ్గట్టుగా హుందాగా, అధికారుల భాద్యతల ను, అధికారాన్ని అవగాహన చేసుకొని వాటిని పోషించారు. పాఠశాల మొత్తం ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా విద్యార్థుల చే క్రమశిక్షణ తో, వేడుక గా,ఉత్సాహoగా, నిర్వహించారు.కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులు తమ అనుభవాలను వివరిస్తూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని, అత్యంత సవాళ్ళతో కూడుకున్నదనీ, ఉద్యోగుల, ఉపాధ్యాయుల విధులు, భాద్యత లు, కష్ట, నష్టాలను అవగాహనచేసుకోవడానికి, రేపటి పౌరులుగా, సమాజం లో వివిధ బాధ్యతలు నిర్వహించడానికీ, ఈ కార్యక్రమం దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కరెస్పిండెంట్ మారుతి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అద్భుతం గా నిర్వహించిన విద్యార్థుల ను అభినందించారు. ఈ కార్యక్రమం వలన విద్యార్థుల కు, ప్రత్యక్ష అనుభవం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకునేలా, విద్యార్థుల ను అన్నీ రంగాల్లో, తర్ఫిదు అయ్యేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఉపాద్యాయు ల పాత్రలు పోషించిన విద్యార్థుల ఒకటి, రెండు పిరియడ్స్ భోదించడమే కష్టం గా భావించారు మరియు టీచర్స్ ప్రతీ రోజు 6-7 పిరియడ్స్ భోదించడానికి ఎంత కష్టపడతారో తెలిసిందని, ఆఫీసియల్స్ పాత్రల లో ఉన్న వారికి, వారి డ్యూటీ లు మరియు కార్యక్రమాలు ఏమిటి, ఆ ఉద్యోగం లో వున్న భాద్యత లు తెలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ బంటు నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ కట్టా అనిత, ఉపాద్యాయిని, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
జాతర చైర్మన్ పాడి రామకృష్ణారెడ్డి,
యుఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ రెడ్డి..
వీణవంక, ఫిబ్రవరి 14( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఫిబ్రవరి 21, 22,23 తేదీలలో జరిగే సమ్మక్క- సారలమ్మ జాతర పోస్టర్ ను బుధవారం సమ్మక్క- సారమ్మ జాతర కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. జాతర నిర్వహణ ఏర్పాట్లను చైర్మన్ పాడి రామకృష్ణారెడ్డి, యుఫ్ టి వి సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి ఆధ్వర్యంలో చురుకుగా. జరుగుతున్నాయి. వీణవంక సమ్మక్క- సారలమ్మ జాతర ఏర్పాట్లను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. కోరిన కోరికలు తీర్చే వీణవంక సమ్మక్క- సారలమ్మ జాతర,మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన వీణవంక సమ్మక్క -సారలమ్మ జాతర ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని,భక్తులు మహారాష్ట్ర, అదిలాబాద్,సిద్దిపేట, హుస్నాబాద్, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, మంచిర్యాల్, పెద్దపల్లి, చుట్టుపక్కల మండలాలు అయిన హుజురాబాద్, ఇల్లంతకుంట, మానకొండూర్, కేశవపట్నం, సైదాపూర్, ఎల్కతుర్తి గ్రామాల నుండి భక్తులు రావడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి ఆటంకం కల్గకుండా, విద్యుత్, వైద్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, వెహికల్స్ పార్కింగ్ కొరకు జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ప్రాంగణం కేటాయించబడుతుందని, ప్రక్కనే జంపన్న వాగుకు కల్వల ప్రాజెక్టు నుండి నీరు విడుదల ఉంటుందని, భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు చేపడుతున్నామని, జాతర పర్యవేక్షణ నిఘా నేత్రాల పర్యవేక్షణ ఉంటుందని, పోలీసుల రక్షణలో ఉంటుందని, వీణవంక గ్రామస్తుల అండదండతో, జాతర తొలి రోజు సారలమ్మ గద్దెకు వచ్చుట, రెండవ రోజు సమ్మక్క గద్దెకు, గోవిందరాజులు వద్దకు వచ్చుట, మూడవరోజు భక్తులు మొక్కులు చెల్లించుకొనుట అద్భుత ఘట్టాలు, ప్రతిరోజు గ్రామస్తుల సమన్వయంతో గొల్ల కురుమల ఒగ్గుడోలు బృందాలచే, మాల సోదరుల కళా ప్రదర్శనతో, సమ్మక్క- సారలమ్మ ఆగమనంలో శివసత్తుల పూనకాలతో ,వీణవంక గ్రామస్తులు అంగరంగ వైభవాల మధ్య జాతర నిర్వహణ జరుగుతుందని అన్నారు.

చేగుంట ఫిబ్రవరి 14 తెలంగాణ ఎక్స్ ప్రెస్
చేగుంట నూతన బాధ్యతలు స్వీకరించిన చేగుంట ఎంపిడిఓ చిన్నరెడ్డి ని శాలువ తో సన్మానంచిన చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ హనుమంతరావు,సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం,జూనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్,నవీన్ ,రవి,ఎల్లం,సురేష్,శ్రీను, నరేష్ తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలోని 1 వ అంగన్వాడి కేంద్రంలో, బుధవారం వసంత పంచమి ( సరస్వతి మాత అమ్మవారి పుట్టిన రోజు) పురస్కరించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసం , అన్న ప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం.సరిత చిన్నారులచే అక్షరభ్యాసం, ఆన్న ప్రాసన చేయించారు. ఆ తర్వాత సిడిపిఓ మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేసే బాలా మృతం, గుడ్లు పంపిణీ చేయాలని, పోషక లోపం కలిగిన చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించి, వారి ఎత్తు, బరువు లో మార్పు వచ్చే విధంగా కృషి చేయాలని, నెల నెల వారి ప్రగతిని పోషణ అప్ లో నమోదు చేయాలని సూచించారు. గర్భిణీ వైబాలింతలకు ఒక్క పూట సంపూర్ణ పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల హాజరు, రికార్డుల నిర్వహణ, అంగన్వాడి టీచర్ దుర్గ పని తీరును సిడిపిఓ అభినందించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపీఓ ఎం. సరిత, సూపర్వైజర్లు హారతి, స్వరూప రాణి, ఈశ్వరిబాయి, అంగన్వాడి టీచర్ ఈ వి.దుర్గ, ప్రమీల, ఆయా లక్ష్మి, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రసాద్, గ్రామ అంగన్వాడి కేంద్రం లోని తల్లుల కమిటీ, తల్లులు , ఇతర మహిళా సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగినది.
- మోడీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై జరుగుతున్న ఫిబ్రవరి 16 న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బందును విజయవంతం చేయాలి
- భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు పిలుపు
మంచిర్యాల, ఫిబ్రవరి 14, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): కేంద్ర బిజెపి విధానాలను ప్రతికడిద్దామని మోడీ ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేకత విధానాలపై జరుగుతున్న ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బందును విజయవంతం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాల భవన నిర్మాణ రంగాల సమావేశం కాలేజీ రోడ్డు చౌరస్తాలో ఐ ఎఫ్ టి యు మీటింగ్ నిర్వహించారు. ఈసమావేశానికి భారత కార్మిక సంఘాల (ఐఎఫ్టియు) మంచిర్యాల జిల్లా కార్యదర్శి ముఖ్యఅతిథిగా హాజరై జాడి దేవరాజ్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది. అయినా రైతాంగ, కార్మికవర్గ, ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. భారత్ వెలిగిపోతుంది. అచ్చా దిన్ హాయిగా, విశ్వ గురు, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చిన ఏమి ఒరగలేదు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారు. ప్రస్తుతం ఉద్యోగ కల్పన పడిపోయింది. నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. శ్రామికుల నిజవేతనాలు 20 శాతం తగ్గిపోయాయి. మోడీ ప్రభుత్వం దేశాన్ని దేశ సంపదను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పిన ఘనత మోడీ ప్రభుత్వానిది. వ్యతిరేకంగా డిమాండ్స్ పై
కనీస వేతనం 26,000 వేలుగా నిర్ణయించాలి.
4 లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి. కాల పరిమితి ముగిసిన అన్ని షెడ్యూల్డ్ పరిశ్రమలకు వెంటనే జిఓలను సవరించాలి. 2021లో విడుదల చేసిన 5 కనీస వేతనాలకు గెజిట్ చేసి అమలు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం, ప్రైవేట్ పరం చేయడం ఆపాలి. కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఉద్యోగ, కార్మికుల్ని పర్మినెంట్ చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలి. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి. ఈ స్కీమ్‌ను పట్టణాలకు విస్తరించాలి. పని దినాలు పెంచి, రోజు కూలీ 600/- ఇవ్వాలి. కేంద్ర స్కీంలకు బడ్జెట్ తగ్గించొద్దు, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వేతనాలు చెల్లించాలి.
అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశపెట్టాలి. అన్ని రకాల ఆహార వస్తువులపై జిఎస్టి ఉపసంహిరించాలి. నూతన విద్యా విధానం 2022 చట్టాన్ని రద్దు చేయాలి. ఈ డిమాండ్ల పైన ఫిబ్రవరి 16న జరుగుతున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్ బంద్ లో రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గం ఈ బందులో పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు గా పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చదువుల దేవయ్య, భీమయ్య, లక్ష్మణ్, పోచన్న, తదితరులు పాల్గొన్నారు.
బోధన్ రూరల్,ఫిబ్రవరి14:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) సాలూరా మండలం హన్సా గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పల్లె గంగారాం,ఉపాధ్యక్షులు కచ్చ కాయల సాయినాథ్, కార్యదర్శి పల్లె శంకర్,బి. హనుమాన్లు, కే. రవి, డి.రాములు, సభ్యులు పాల్గొన్నారు.
బిచ్కుంద ఫిబ్రవరి 14:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని నూతనంగా వచ్చిన ఎస్ఐ మోహన్ రెడ్డిని రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జుక్కల్ యువజన కాంగ్రెస్ ఇన్చార్జి కే విజయభాస్కర్ రెడ్డి, శాలువాతో సన్మానం చేశారు వారితోపాటు మైనార్టీ సీనియర్ నాయకుడు పాషా సెట్, సర్పంచ్ జీవన్, కాళోజీ విట్టల్ రావు, మునీర్, నారాయణ , సాయిలు, నిహాల్ మసూద్, యువరాజ్ ,రాజు, జ్ఞానేశ్వర్ , తదితరులు పాల్గొన్నారు
బ్రిటిష్ వారి ఎదురు నిలిచిన యోధుడు….
వారి సంక్షేమానికి ఎన్నో సేవలు
జిల్లా వ్యాప్తంగా ఘనంగా 285 వ సేవాలాల్ జయంతి వేడుకలు….
జిల్లాలో అధికారికంగా వేడుకలు ఏర్పాటు చేసిన అధికారులు…..
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 14, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆలోచనల్లో, వారి జీవనవిధానంలో పలు మార్పులు తీసుకువచ్చిన మహానుభావుడు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్. మేరామాయడి సేవకుడిగా ఆమె షరతులు విధించి సాధించుకున్న మహా భక్తుడు. దేశంలో బంజారాల ఆదర్శమూర్తి సేవలాల్ మహారాజ్ వ్యవసాయం, సాంఘిక సమానత్వం కావాలంటూ ఆర్థికంగా బలపడాలంటూ బంజారాలకు బోధించారు. సేవాలాల్ మహారాజ్ జగదంబ భవాని సేవకుడిగా ఆమెకు సేవలందించి, మాతా కృపను సాధించుకున్న మహా భక్తుడు సేవలాల్ మహారాజ్. ఆయన జీవితంలో జగదాంబ మాత సేవలు అందించడంతో పాటు బంజారా జాతి అభ్యున్నతి కోసం కృషి చేశారు. బ్రిటిష్ వారు బంజారాలకు చేస్తున్న హింసలను ఎదురించి పోరాడి బంజారా జాతికి పునరుజ్జీవన చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఫిబ్రవరి 15 న ఆయన జన్మదిన సందర్భంగా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. భారతదేశంలో ఆనాటి కాలం నుండి ఎన్నో మతాలు కులాలు జాతులు సంగమ స్థానం ఉన్న గిరిజన జాతులతో విభిన్నమైంది. ప్రత్యేక వేషధారణ సాంప్రదాయాలతో అడవి పరిసరాల ప్రాంతాల్లో ప్రకృతి ఒడిలో తండాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ భారతదేశంలో సుమారు 15 కోట్ల మందికి ఆయన ఆరాధ్య దైవం గురువు. గురువారం సేవావలాల్ మహారాజ్ 285 వ జయంతి సందర్భంగా జిల్లాలో బంజారులు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి తండాలోని ప్రతి ఆలయాల్లో భోగ్ బండార్ నిర్వహించి పాయసంతో నైవేద్యం సమర్పించి గిరిజన మహిళలు చిన్నారులు, పెద్దలు ఆటపాటలతో నృత్యం చేస్తారు. సకల సంపదలు ఇవ్వాలని సేవాలాల్ మహారాజ్ , జగదంబ భవానీ అమ్మవారిని కోరుకుంటారు.

సేవలాల్ మహారాజ్ జీవిత ప్రస్థానం….!
సేవాలాల్ మహారాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీలోని రంజీనాయక్ ముగ్గురు కుమారుల్లో ఒకరు బీమా నాయక్ ఆయనకు ధర్మనిబాయి, అనే ధర్మపత్ని ఉంది. రాంజీ నాయక్ తండలోని 1739 ఫిబ్రవరి 15న సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ భీమానాయక్ ధర్మిణిబాయి దంపతులకు జన్మించాడు. కర్ణాటక రాష్ట్రం నుండి భావన్ బరాడా నుండి భీమానాయక్ ఎద్దుల బండి పై గుత్తి బళ్లారి ప్రాంతాలకు చేరుకుని ఆప్రాంతంలో రాంజీ నాయక్ పేరుమీద తండాను స్థాపించి స్థిరపడ్డారు. వీరికి అప్పటి కాలంలో సుమారు 3,755 ఆవులు అందులో 6,400 ఎద్దులు, సండియా, గరాసియా, దూరం గుర్రాలున్నాయి. అయితే వీరికి సంతానం మాత్రం కలగలేదు. అయితే బంజారాల ఆరాధ్యదైవమైన సాతి(7) భవానిలో తుల్జా, మాత్రాల్, హింగాళ, కంకలీ, మేరమ్మ, సిప్త, ధర్మానిబాయి కళ్లలో కనిపించింది. మీకు సంతానం కలుగజేస్తాను. పుట్టిన మొదటి బిడ్డకు 12 ఏళ్లు వచ్చినా తర్వాత అతనికి భగవత్ సేవకుడిగా పనిచేయాలని చెప్పింది. అందుకు భీమానాయక్ దంపతులు సంతోషించి నప్పటికీ మొదట సంతానాన్ని భగవాన్ కు ఇచ్చేయల్సి వచ్చినందుకు భాద పడతాడు. రాంజీనాయక్ తండాలో భీమానాయక్ ధర్మినిబాయికు దంపతులు 15 -2-1739 న సేవాలాల్ జన్మించాడు. అనంతరం హప్ప, బాద్దు, బాణ అనే సంతానం కలిగారు .

జగదాంబ మాతకు షరతులు….!
సేవాలాల్ మహారాజ్ జగదంబ మాతాకి కొన్ని షరతులు పెట్టి తాను బాధగా ఉంటానని అని మాట ఇస్తాడు. సేవాలాల్ తమ ఆశావాదిగా ఉంటూ మద్యం సేవించనని ఆమె బాటలో సేవకుడిగా మారుతాడు. దీంతో జగదాంబమాత అనుగ్రహించి అతని తమ్ముని పునరుద్ధరింప చేస్తూ సంపదను తిరిగి. సంవత్సరానికి కోకసారి కడావ్, చూర్మో, బియ్యం, పిండితో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తామని జీవహింసను చేయబోమని తాను నోటి మాటలో ప్రతి మాట అమలు కావాలని సేవాలాల్ మహారాజ్ ను అనుగ్రహిస్తుంది.

సేవాలాల్ మహారాజ్ పుట్టుకతోనే జ్ఞాని…!
జగదాంబమాత అనుగ్రహముతో సేవాలాల్ పుట్టుకతోనే మహాజ్ఞానిగా ఉంటాడు. అతని చిన్నతనంలోనే సకల విద్యను ప్రదర్శించాడు. పశువులను కాసేవాడు ఉదయాన్నే లేచి తండా సమీపంలో గల కాళో కుండ్ స్నానానికి వెళ్లేవాడు. సూర్య నమస్కారాలు చేసి తన దినకార్యము ప్రారంభించే వాడు, బంజారులకు ఎవరికి కష్టం వచ్చినా వారి సమస్యలను పరిష్కరించేవాడు. మెరియామాయాడి నీకు రక్తసమర్పణం చేయడం కానీ మద్యాన్ని నైవేద్యంగా ఇవ్వడం కానీ చేయలేదు. భగత్ మారేందుకు సేవాలాల్ నిరాకరించడంతో మెరియామాయాడి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇచ్చిన మాటకు తప్పదు అని కోపంతో మేరీమ్మయాడి సేవాలాల్ కుటుంబానికి ఇబ్బందుల పాలు చేయాలని తలుచు కుంటుంది. సేవాలాల్ చిన్న తమ్ముడు బాణాను ఆంబోతును గుర్రాలను సుమారు 3,755 ఆవులను పూర్తిగా నాశనం చేస్తుంది. చివరికి సేవాలాల్ కు ఒక పూట భోజనం కూడా కరువుతుంది. దింతో మేరమాయాడిని శాంతింప చేసేందుకు భీమానాయక్ దంపతులు ప్రత్యేక వంటలు వండి నైవేద్యం సమర్పిస్తారు.
బ్రిటిష్ యుద్ధం సంస్కరణలపై సేవాలాల్ తిరుగుబాటు..!
ఆనాటి కాలంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించే సమయంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు యావత్తు బంజారాలకు ఆశని పాతంగా మారాయి. ఈ యుద్ధానికి ప్రతిఘటించి గోర్ బంజారాలకు బ్రిటిష్ వారు విప్లవకారులుగా, సంఘ ద్రోహులుగా ముద్ర వేశారు. ఆ పరిస్థితిలో బంజారా జాతిని కాపాడుకోవాలని సేవాలాల్ కంకణం కట్టుకున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు చరిత్రలో తెలిపారు. హైదరాబాద్ నగరంలో మహాగంజ్ అనే ప్రాంతం సేవలాల్ పేరుతోనే వ్యవహరిస్తోంది.

1806 లో సేవాలాల్ మహారాజ్ ఆత్మను వదిలాడు…!
సేవాలాల్ మహారాజ్ తన చివరి దశలో యావత్మల్ జిల్లా డిగ్రస్ తాలూకాలోని రూయిఘడ్ అని తండాలో నివసించాడు. మేరీమ్మయాడి కటాక్షంతో తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశాడు. సేవాలాల్ 1806 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని టేరార్ లోని నేటి అకోల జిల్లాకు డిగ్రాడ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో పౌరగాడ్ అనే ప్రాంతంలో తన పార్ధివ దేహాన్ని వదిలాడు. ఆయన కుటుంబీకులు రెండు మందిరాలను ఒకపక్క జగదాంబమాత మరోపక్క సేవాలాల్ మహారాజ్ మందిరం నిర్మించారు. పౌర గౌడ్ ప్రాంతాన్ని 1870 లో పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 15న అనంతపూర్ జిల్లా గుత్తి బళ్లారి మండలంలోని భీమానాయక్ తండాలో సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. మందిరం వద్ద ఆవరణలో బోగ్ బండార్ నిర్వహిస్తారు.
అధికారికంగా నేడు సేవాలాల్ జయంతి ఉత్సవాలు..!
గత కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం బంజారులు మాత్రమే జరుపుకునేవారు. గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేవాలాల్ జయంతిని బంజారాల సంస్కృతిని సాంప్రదాయాలు ప్రకారం నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేడు జరిగే సేవలాల్ 285వ జయంతిని నిర్వహించేందుకు నియోజకవర్గాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 1 లక్ష, 80వేల రూపాయలు మంజూరయ్యాయి. ప్రతి తండాలో సేవాలాల్ జయంతిని నిర్వహించనున్నారు.
సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం నిర్వహించడం శుభపరిమాణం
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం శుభపరిమాణం. ఫిబ్రవరి 15వ తేదీన సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించాలి. ప్రభుత్వం జిల్లాకు లక్షల నిధులు కేటాయించింది దీని ద్వారా తండా, తండాలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
- ( సభావాట్ సంగ్రామ్ నాయక్ ఎంఏ, ఎంకాం ఎల్లారెడ్డి)
సేవలను ఆదర్శంగా తీసుకోవాలి
బంజరులందరూ సాంస్కృతిని కాపాడుకుంటూ సేవాలాల్ మహారాజును ఆదర్శంగా తీసుకోవాలి. జాతి అభివృద్ధి కోసం పోరాటం చేసిన ఘనుడు సేవాలాల్ మహారాజ్. ప్రతి తండాలో భోగ్ బండార్ కార్యక్రమాలను తండా తండాను గుర్తించేలా కార్యక్రమాలు చేపట్టాలి.
- (డాక్టర్ రాంసింగ్ నాయక్, కామారెడ్డి జిల్లా మెడికల్ కళాశాల ప్రొఫెసర్)
సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి
బంజారాల ఆరాధ్యదేవుడు సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం ఐచ్చిక సెలవు కాకుండా సాధారణ సెలవు గా ప్రకటించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బంజారాల మనోభావాలను గుర్తించి సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరం. ఈసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో ప్రత్యేక ధన్యవాదాలు.
- ( కనిరం నాయక్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు)
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 13:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి కి కొత్తగా వచ్చిన సిఐ. రవీందర్ నాయక్ , అలాగే ఎస్ఐ బొజ్జ మహేష్ లను మంగళవారం ఎల్లారెడ్డి టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎస్సి మోర్చా ఎర్రమన్ను కుచ్చ ఒకటో వార్డు నాయకుడు అల్లం పండరి, బీజేపీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్బంగా శాలువా కప్పి ఇద్దర్ని సత్కరించారు. ప్రజలకు న్యాయం చేసే దిశగా పని చేస్తే తమ పూర్తి సహకారం ఉంటుందని వారన్నారు.
బోధన్ రూరల్,ఫిబ్రవరి13:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) జిల్లా సీఆర్పీల సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను బోధన్ ఎంఈఓ నాగనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు విజయ్, బోధన్ మండల సిఆర్పిలు బాబు, శివానందం ,రేఖ, స్వర్ణలత,యూసుఫ్, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ నాగేష్, కంప్యూటర్ ఆపరేటర్ మానస, తదితరులు పాల్గొన్నారు.