భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట
ఫిబ్రవరి 15(తెలంగాణ ఎక్ష్ప్రెస్స్ )
దమ్మపేట మండలం లో ముస్తిబండలో గల ఉడతా
నేని వెంకటరావు స్తూపం వద్ద సి పి ఎం పార్టీ దమ్మపేట మండలం సెక్రటరీ దొడ్డా లక్ష్మి నారాయణ జిల్లా నాయుకులు మోరంపూడి శ్రీనివాసరావు ముందుగా నివాళ్లు అర్పించారు వారి యొక్క గొప్ప తనం పొగిడినారు వెంకటరావు బ్రతికిన్నంత కాలం ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉందని కొనియాడారు పార్టీ కోసం పట్టుదలతో పనిచేసారు అని అన్నారు ఈ కార్యక్రమం లో సి పి ఎం పార్టీ గ్రామ సెక్రటరీ కొలికిపోగు శేషుబాబు పార్టీ సభ్యులు అరేకుట్ల రాంప్రసాద్ దాంట్ల అశోక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రావు గంగాధర్ రావు సి పి ఐ పార్టీ నాయకులు కూకలకుంట సత్యనారాయణ తెలుగు దేశం పార్టీ నాయకులు సందా సుబ్బారావు లు పాల్గున్నారు
తెలంగాణ
గ్రామాలలో మొదలైన భక్తుల సందడి…
వీణవంక, ఫిబ్రవరి 14( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని నిన్న 26 గ్రామాలలో సమ్మక్క- సారలమ్మ దేవతలకు ఎత్తు బెల్లాలను ఇవ్వడం మొదలయ్యింది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే , అంతర్జాతీయ జానపద, వనదేవతల, వన జాతరకు గ్రామాలలో గత రెండు వారాలుగా సందడి వాతావరణం నెలకొంటుంది. గ్రామాలలో సమ్మక్క – సార్లమ్మల భక్తి పరవశంతో భక్తులు నూతన వస్తువులు ధరించి, ఎత్తు బెల్లాలను తీసుకొచ్చి,గొర్రెపోతు, మేకపోతు, కోడి పిల్ల, యాటలతో, బెల్లం శక, తాటికల్లు, బ్రాండ్ విస్కీలతో ఆరగిస్తూ, కోరిన కోరికలను తీర్చే, వనదేవతల నమస్కరిస్తూ, బంధువుల మధ్య మొక్కు చెల్లిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా గడపడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని కరీంనగర్, వరంగల్ జిల్లాలలోని గ్రామ గ్రామాన వనదేవతల పండుగలను, మాఘ మాస పౌర్ణమి కి మూడు రోజులు ముందుగా అంగరంగ వైభవంగా జరుపుకోగా, స్వయంభుగా వెలసిన వనదేవతల ఇలవేల్పు అయిన మేడారంలో ఇసుక వేస్తే, రాలని జనంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా, భక్తి పారవశంతో, అద్భుత ఆవిష్కరణలతో, ప్రకృతి అందాల నడుమ, కోయ పూజారుల తో కమనీయమైన, మనోహరమైన హరివిల్లుల నడుమ , జానపదుల నృత్యాలు నడుమ, శివసత్తుల పూనకాలతో సమ్మక్క- సారలమ్మ ఆగమనంతో మేడారం భక్తులతో దద్దరిల్లుతుంది. అలాగే మన మండలంలోని వీణవంక, చల్లూరు, పోతిరెడ్డిపల్లి, గ్రామాలలో సమ్మక్క- సారలమ్మ జాతర కన్నుల పండుగ గా జరిగే ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక సాయిబాబా ఆలయంలో, బుధవారం వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయ ధర్మ కర్తలు మాజీ ఎమ్మెల్యే బి.జనార్ధన్ గౌడ్, షిరిడీలోని సాయి సంస్థాన్ శాశ్వత సభ్యులు సాయి ప్రకాష్ దేశ్ పాండే, ముత్యపు వీరేశలింగం గుప్త లు ఆలయ 20 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ఉదయం 6 గంటలకు ఆలయ పూజారి విజయ్ కుమార్ పంతులు అధ్వర్యంలో కాకడ హారతి, బాబా దివ్య మంగళ విగ్రహానికి పంచామృత స్నానం ను ఆలయ ధర్మ కర్తలచే మహా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి గణపతి పూజ, స్వస్తి పున్యహవాచనము , మాతృక పూజ ఋత్విక్ వర్ణం, నవగ్రహ వాస్తు మండలి, ముఖ్య కలశ స్థాపన , గణపతి హోమం, బలిహరణము, పూర్ణాహుతి, మహాదాశిర్వచనము తదితర పూజలను వేద పండితులు శివకుమార్ పంతులు, కృష్ణ పంతులు ధర్మ కర్త దంపతులు , సాయి ప్రకాష్ దేశ్ పాండే, నివేదిత దేశ్ పాండే, గోపాల్ రావు, విజయలక్ష్మి, దంపతులచే హోమ కార్యక్రమం ఘనంగా చేయించారు. మధ్యాహ్న హారతి ఇచ్చి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై బాబాను దర్శించుకుని, తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6 గంటలకు సాయిబాబా రథ యాత్ర ను, బాబా పాధుకల పల్లకి సేవ పట్టణం వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో చంద్రం గుప్త, సాయి సేవా మండలి సభ్యులు, భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని మౌలన్ ఖెడ్ గ్రామ శివారులోని వీరన్న కుచ్చపై గల వీరభద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ పూజలు, బుధవారం వసంత పంచమినీ పురస్కరించుకుని ఆలయ పూజారి పెద్ద సంగప్ప, వీర సంగప్ప, ఈశ్వరప్పలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నీల కంటేశ్వర ఆలయం నుంచి వీరభద్ర స్వామి ఉత్సవ విగ్రహాన్ని, శివ మాలాదారా స్వాములు ఊరేగింపు గా భాజా భజంత్రీలతో వీరన్న కుచ్చ వరకు తీసుకు వెళ్లి అక్కడ అభిషేకాలు, బిల్వార్చన, పుష్పార్చన , రుద్ర హోమం నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మాజీ ఎంపిపి, మాజీ వైస్ ఎంపిపి లు చెన్న లక్ష్మణ్, చెన్న సతీష్ లు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై వీరభద్ర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసా దాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివ మాలాధార స్వాములు, హన్మంతప్ప, గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు కాశీరాం, పూజారులు సందీప్ అప్ప, నీలకంఠం అప్ప , భక్తులు తదితరులు పాల్గొన్నారు. గురువారం తెల్లవారు జామున అగ్నిగుండాల కార్యక్రమంతో పాటు మధ్యాహ్నం అన్నదానం ఉంటుందని ఆలయ పూజారులు తెలిపారు.
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని మౌలన్ ఖెడ్ గ్రామ శివారులోని వీరన్న కుచ్చపై గల వీరభద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ పూజలు, బుధవారం వసంత పంచమినీ పురస్కరించుకుని ఆలయ పూజారి పెద్ద సంగప్ప, వీర సంగప్ప, ఈశ్వరప్పలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నీల కంటేశ్వర ఆలయం నుంచి వీరభద్ర స్వామి ఉత్సవ విగ్రహాన్ని, శివ మాలాదారా స్వాములు ఊరేగింపు గా భాజా భజంత్రీలతో వీరన్న కుచ్చ వరకు తీసుకు వెళ్లి అక్కడ అభిషేకాలు, బిల్వార్చన, పుష్పార్చన , రుద్ర హోమం నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మాజీ ఎంపిపి, మాజీ వైస్ ఎంపిపి లు చెన్న లక్ష్మణ్, చెన్న సతీష్ లు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై వీరభద్ర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసా దాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివ మాలాధార స్వాములు, హన్మంతప్ప, గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు కాశీరాం, పూజారులు సందీప్ అప్ప, నీలకంఠం అప్ప , భక్తులు తదితరులు పాల్గొన్నారు. గురువారం తెల్లవారు జామున అగ్నిగుండాల కార్యక్రమంతో పాటు మధ్యాహ్నం అన్నదానం ఉంటుందని ఆలయ పూజారులు తెలిపారు.
శ్రీ సరస్వతి శిశు మందిర్ వీణవంక
వీణవంక, ఫిబ్రవరి 14( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో బుధవారం వసంత పంచమి పర్వదినాన శ్రీ సరస్వతి మందిర్ విద్యాలయంలో 22 మంది పిల్లలకు సామూహిక విద్యాభ్యాసం చేయించడం జరిగింది. అనంతరం సరస్వతి మాత కటాక్షం కొరకు హోమం నిర్వహించడం జరిగింది. శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో నూతనంగా శిశు వాటికను ఏర్పాటు చేయగా, కోర్కోల్ గ్రామానికి చెందిన నార్ల వెంకటేశ్వర్లు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రబంధ కాలనీ అధ్యక్షులు జోజుల ప్రహ్లాద రావు, సమితి కార్యదర్శి అయిత రాంబాబు, ప్రబంధకారిణి సభ్యులు వెన్నంపల్లి నారాయణ, పూర్వ విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక హరి హర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో, బుధవారం 8 వ వార్షికోత్సవం, వసంత పంచమి వేడుకలను అయ్యప్ప సేవా సమితి కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శ్రీనివాస్ రావు పంతులు ఉదయం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ చేసి జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. మాలికపురోత్తమ మాతకు, సుబ్రహ్మణ్య స్వామికి భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ మామిడి అరవింద్ కుమార్ , బొందుగుల రాజేందర్ రావు, కాపర్తి శివశంకర్ దంపతులచే ఆలయ పూజారి ముత్యాల శ్రీనివాస్ రావు పంతులు చేయించారు. అనంతరం అయ్యప్ప స్వామికి అన్నప్రసాద నైవేద్యం సమర్పించి, పదునెట్టంబడి మెట్ల పడిని మాలాధారా స్వాములతో పాటు ఆలయ సేవాసమితి కమిటీ అధ్యక్షులు పద్మ శ్రీకాంత్ కలిసి వెలిగించారు. పడి పూజ అనంతరం భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, ఆలయ గౌరవ అధ్యక్షులు ముదిగొండ చంద్రం, ప్రధాన కార్యదర్శి వుక్కల్కర్ రాజేందర్ నాథ్, జాయింట్ కార్యదర్శి రాములు, మురళి, సతీష్, సుగునాకర్ , భూపాల్, మలాధార స్వాములు శివకుమార్ స్వామి, ఈశ్వర్ స్వామి, ఇద్దరు చిన్న కన్నె స్వాములు, తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పల్లకి సేవ నిర్వహించారు.
వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
ఆగమ శాస్త్ర , మయూరగిరి పీఠాధిపతులు నమలికొండ రమణాచార్యులు..
వీణవంక, ఫిబ్రవరి 14( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాల పల్లి గ్రామంలోని భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసినాయి. మయూరగిరి పీఠాధిపతులు శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో ..
తొమ్మిది రోజుల నుండి జరుగుతున్న ఉత్సవాలు అధ్యానోత్సవం, సహస్ర కలశాభిషేకం, పవిత్రోత్సవం, వసంతోత్సవం, శకటోత్సవం, రథోత్సవం, మహా పూర్ణాహుతి, ద్వాదశరాధన, సప్తా వర్ణములతో అద్భుతంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ఒక వేడుకగా జరిగినాయి, పలు గ్రామాల నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి భగవంతుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.. చిన్నజీయర్ స్వామి శిష్యులు, వివిధ ప్రాంతాల పండితులు గ్రామ పెద్దలు, ఆలయ అధ్యక్షులు మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు… దేవాలయ ప్రాంతమంతా మామిడాల పెళ్లి గ్రామం అంతా గోవింద నామస్మరణతో మారుమోగింది.

వసంత పంచమి రోజున లోకేశ్వరం ఫిబ్రవరి 14 తెలంగాణ ఎక్స్ ప్రెస్ లోకేశ్వరం మండలంలోని వివిధ గ్రామాలతోపాటు మన్మద్ గ్రామంలో జడ్పీఎస్ ఎస్ పాఠశాలలో 1995-1996 పూర్వ విద్యార్థులు సహకారంతో సరస్వతి దేవి విగ్రహా ప్రతిష్టాపన చేయడం జరిగింది, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ సరస్వతి దేవి పుట్టిన రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం మాకు ఎంతో గర్వకారణం మా పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల సహకారంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, ఎంపీపీ లలిత బోజన్న, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, మాజీ సర్పంచులు శేఖర్ రెడ్డి, ముత్త గౌడ్,లక్ష్మణ్ పటేల్,పిఎసిఎస్ డైరెక్టర్ బండి ప్రశాంత్, ఎంఈవో చంద్రకాంత్, ఉపాధ్యాయులు రాజారామ్ 1995-1996 పూర్వ విద్యార్థులు వీడిసి గ్రామస్తులు పాల్గొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యం అంటున్న బంధువులు..
జమ్మికుంటలో హాస్పిటల్ ఎదుట ఆందోళన…
జమ్మికుంట/ వీణవంక, ఫిబ్రవరి14( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళితే వీణవంక మండలం శ్రీరాముల పేట గ్రామానికి చెందిన మ్యాడగోని మానస( 24), రెండవ కాన్పు డెలివరీ కొరకు జమ్మికుంట పట్టణంలోని శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అడ్మిట్ కాగా , మంగళవారం అర్ధరాత్రి పండంటి జన్మ మగబాబుకు జన్మనిచ్చిందని, కానీ, మానస డెలివరీ అయిన తర్వాత సీరియస్ గా ఉందని హనుమకొండకు తరలించాలని డాక్టర్లు సూచించగా, వెను వెంటనే తరలించడం జరిగిందని, మార్గమధ్యంలో మానస మరణించడం జరిగిందని, మానస మృతికి కారణం మత్తు డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్లు రాణి, రాము లే కారణమని , మానస భర్త ప్రశాంత్ ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యులు మానస మృతదేహంతో జమ్మికుంట లోని శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు.
బోధన్ రూరల్,ఫిబ్రవరి14:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ మండల నూతన ఎంపీడీవో గా వెంకటేష్ జాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల ఎంపీడీవో గా పని చేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అందరి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.