జోగిపేట్ డిసెంబర్ 05:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ నియోజకవర్గం లో జోగిపేట మున్సిపాలిటీ లోని బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్, ప్రభాకర్ గౌడ్, వివిధ మండల అధ్యక్షులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి సంవత్సరమైనా ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని రైతు పండుగ పేరు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచినందుకా ఈ సంబరాలు చేసుకుంటున్నారు అని వారు అన్నారు, రైతులకు ఇస్తామన్నా పదిహేను వేల రూపాయలు ఏమైందని వారు అన్నారు, రైతులకు పంట బోనస్ పేరుతో కనీసం వడ్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేని అసమర్ధ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు, ఆందోల్ నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే పేరు గొప్ప ఊరు ఊరు దిబ్బ అన్న చండాలంగా ఇక్కడ నుండి మంత్రిగా ప్రతినిత్యం వహిస్తున్న దామోదర్ రాజనర్సింహ గారు ఇక్కడ ప్రజలను పట్టించుకునే పరిస్థితు లో లేరని విషయం సుస్పటంగా కనిపిస్తుంది, ఇక్కడ సింగూర్ ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఇక్కడి రైతులకు సాగునీరు అందించలేని ఈ మంత్రి గారు ఇక్కడ రైతులను మోసం చేసిన మొదటి వ్యక్తి అని అన్నారు, సభా వేదిక వద్దకు వృద్ధురాలు విచ్చేసి పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాం అని చెప్పి ఉన్న రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలలకు ఒకసారి ఇస్తూ ఒక్క నెల రోజుల పెన్షన్ వారే తీసుకుంటున్నారు అని వాపోయారు, ఆటో డ్రైవర్లకు 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదని ఉచిత బస్సు వల్ల మా ఆటోలకు ఆదరణ లేక ఫైనాన్స్ వాళ్ళు మా ఆటోలు తీసుకొని పోతున్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు కౌన్సిలర్లు మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
శివ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే
రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు
బాన్సువాడ నియోజకవర్గం
కోటగిరి మండలం నవంబర్ 28 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం మాజీ జడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ దేశాయ్ గారు మరియు వారి కుమారుడు రాజు దేశాయ్ గార్లు నిన్న కారు ప్రమాదంలో మృతి చెందడంతో ఈరోజు శివరాజ్ దేశాయ్ స్వగ్రామం బస్వపూర్ కి వెళ్ళి పార్థివదేహాలకి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శపోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు , పోచారం సురేందర్ రెడ్డి
శివరాజ్ దేశాయ్ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న పోచారం
శివరాజ్ దేశాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు,అనంతరం శివరాజ్ దేశాయ్ అంతిమ యాత్రలో పాల్గొన్న పోచారం
నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పోచారం తో ఉన్నారు.

విలేకరులు కావలెను.* *అనుభవజ్ఞులైన జర్నలిస్టుల* *సారధ్యంలో వెలుబడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన ఏకైక పత్రిక* *(తెలంగాణ ఎక్స్ ప్రెస్) తెలుగు దినపత్రిక**తెలంగాణ రాష్ట్రం లో ఆసక్తిగల అభ్యర్థుల కై నిరీక్షణ.**అనుభవజ్ఞులకు ప్రాధాన్యం అలాగే నూతన అభ్యర్థుల కి అవకాశం కల్పించబడును.**ఈ క్రింది జిల్లాలకు బ్యూరో ప్రతినిధులు కావలెను**1. అదిలాబాద్ జిల్లా**2. నిర్మల్ జిల్లా**3.కొమరం భీమ్ జిల్లా**4.మంచిర్యాల జిల్లా**5.జగిత్యాల జిల్లా**6.నిజామాబాద్ జిల్లా**7.కామారెడ్డి జిల్లా**8.రాజన్న సిరిసిల్ల జిల్లా**9.పెద్దపల్లి జిల్లా**10.జయ శంకర్ జిల్లా**11.కరీంనగర్ జిల్లా**12.మెదక్ జిల్లా**13.సంగారెడ్డి జిల్లా**14.వికారాబాద్ జిల్లా**15.రంగారెడ్డి జిల్లా**16.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా**17.హైదరాబాద్ జిల్లా**18.యాదద్రి భోనగిరి జిల్లా**19.జనగాం జిల్లా**20.హన్మకొండ జిల్లా**21.ములుగు జిల్లా**22.వరంగల్ జిల్లా**23.మహబూబాబాద్ జిల్లా**24.ఖమ్మం జిల్లా**25.సూర్యాపేట జిల్లా**26.నల్లగొండ జిల్లా**27.నాగర్ కర్నూల్ జిల్లా**28.మహబూబ్‌నగర్ జిల్లా**29.నారాయన్పెట్ జిల్లా* *వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా* *తెలంగాణ ఎక్స్ ప్రెస్ తెలుగు దినపత్రిక హైదరాబాద్* **ఎడిటర్ &* *పబ్లిషర్* *చింతల .నీలకంఠం ముదిరాజ్* *సంప్రదించవలసిన* *నంబరు నంబర్* *9010002679* *డైరెక్టర్ చింతల ప్రణీత్* + *91 93814 35133**
8సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్
తుంగతుర్తి, నవంబర్ 26,( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. తుంగతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం తిరుమలగిరి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 21 మంది లబ్దిదారులకు రూ.9 లక్షల 11 వేల 500 ల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే సామెల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి ఇప్పటివరకు దాదాపు రూ.కోటి 80 లక్షల వరకు నిధులు విడుదల కావడంతో పాటు 5000 మందికి ఎల్ఓసి ఇవ్వడం జరిగిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ విషయంలో చాలా అలసత్వం ఉండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫండ్ విషయంలో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ఎవరైనా బాధితులు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, ఉపాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తప్పట్ల శంకర్, జిల్లా నాయకులు దాసరి శ్రీను,కొండ రాజు, కుంచాల ప్రవీణ్ రెడ్డి, కలకోట్ల మల్లేష్, రుద్ర రామచంద్రు, సగ్గం నరసయ్య, మంగళపల్లి నాగరాజు, మిరియాల నాగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, నవంబర్ 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 7 వ వార్డులో కాలనీ ప్రజల నీటి అవసరాలను తీర్చే బోరు మోటర్ , మంగళవారం ఉదయం చెడిపోయింది. కాలనీ వాసులు స్థానిక మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ దృష్టికి తీసుకువెళ్లి, బోరు మోటర్ చెడిపోయి నీటి సమస్య ఏర్పడుతోందని వివరించగా, వెంటనే స్పందించిన చైర్మన్ పాలక వర్గ సభ్యులతో కలిసి కాలనిలో బోరు వద్దకు వెళ్లి మోటార్ చెడిపోయింది అని నిర్ధారించుకుని, నూతన బోరు మోటార్ , స్టార్టర్ ను గంటల వ్యవధిలో తెప్పించి చెడిపోయిన బోరు మోటర్ స్థానంలో ఏర్పాటు చేయించారు. మోటారు బాగాలేదని గత పది రోజుల క్రితం చైర్మన్ కాలనిలో పర్యటించినప్పుడు కాలనీ వాసులు తెలపగా పూర్తిగా పని చెకుంటే కొత్త బోరు మోటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు కాలనీలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఇచ్చిన మాట ప్రకారం నూతన బోర్ మోటార్ ను ఏర్పాటు చేయడం పట్ల చైర్మన్ పద్మ శ్రీకాంత్, పాలక వర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎడ్ల కిషన్, కౌన్సిలర్ నీలకంఠం, నాయకులు నునుగొండ శ్రీనివాస్, మంచిర్యాల విద్యాసాగర్, గాదె తిరుపతి, సంగని పోచయ్య, వాటర్ వర్కర్ సిబ్బంది వెంకటి తదితరులు ఉన్నారు.
బైంసాలో ఇందిరమ్మ కాలనీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పర్యవేక్షించిన శ్రీ పొగు లేంటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 16/11/24
భైంసా పట్టణం లోని ఇందిరమ్మ
సందర్శించి ఇండ్ల నిర్మాణం పూర్తయిందా లేదా మరియు మౌలిక వసతులు ఏమి ఏమి కావాలి ఈ విషయంపై స్వయంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అక్కడ జరిగిన పనులను పర్యవేక్షించిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంతకుముందు బైంసా పట్టణంలోని ఐబి గెస్ట్ హౌస్ లో బైంసా టౌన్ లో మరియు ముధోల్ నియోజకవర్గం లోని గ్రామాలలో ఎన్ని ఇండ్లు మంజూరైనవి ఎన్ని కట్టారుఇంకా ఏమైనా పనులు చేయవలసి ఉందా వీటిపై గౌరవ మంత్రివర్యులు డీటెయిల్ గా తెలుసుకోవడం జరిగింది. దీనితోపాటు ఖరీఫ్ పంట సేకరణ గురించి రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. మరియు ప్రభుత్వ భూములలో ఎవరైనా పంట పండిస్తూ పట్టాలు లేని వారు ఎవరైనా ఉన్నారా అని దీనిపై కూడా డీటెయిల్ గా రిపోర్ట్ తయారు చేయాలని ప్రభుత్వాధికారులను ఆదేశించారు. సీసీఐ పత్తి ఖరీదు పై సీసీఐ వారు సరైన రేటు ఇస్తున్నారా లేదా అనే దానికి ఒకవేళ పత్తి సీసీఐ కి అమ్మకుండా ప్రైవేట్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో పత్తి అమ్మితే ప్రైవేట్ వ్యాపారులు సరైన తూకం చేస్తున్నారా సరైన రేటు ఇస్తున్నారా దానిపై కూడా తెలుసుకోవడం జరిగింది మరియు బైంసా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని గ్రామాలలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గాని మౌలిక వసతుల కొరకు కరెంటు నీటి సరఫరా డ్రైనేజ్ వీటి కొరకు త్వరలోనే నిధులు విడుదల చేపిస్తామని హామీ ఇచ్చారు మరియు రైతులకు ఎటువంటి కష్టం నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులదని మరియు ప్రభుత్వంది అని అన్నారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఈ సమస్యలపై నిగా పెట్టాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ మరియు ఆర్డీవో మరియు ఇతర ప్రభుత్వ అధికారులు హాజరైనారు.
మహబూబాబాద్, జూన్ 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ లో అధికారులు, సబ్ స్టేషన్ ఆపరేటర్ ల నిర్లక్ష్యం వలన విచ్చలవిడిగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని అక్కడి సబ్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకి ఒకసారి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఎపుడు వచ్చి ఎపుడు పోతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సబ్ స్టేషన్ ఆపరేటర్ లను సంప్రదించడానికి గత 5 నెలల నుండి కనీసం ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పోయిందన్నారు. విద్యుత్ కోత వల్ల త్రాగు నీటికి తీవ్ర సమస్య తల్లేతుందని త్రి ఫేస్ సరిగా ఉండకపోవడంతో కిలో మీటర్ దూరం నుంచి రెండు కిలో మీటర్ ల దూరం వెళ్లి త్రాగు నీటి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్కు తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్ట్‌ల వినతి
హైదరాబాద్, జూన్ 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)ఎలక్ట్రానిక్ మీడియా పెండింగ్ చెల్లింపుల ప్రక్రియ త్వరితంగా జరిగెల చూడాలని
తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఘోరీ నేతృత్వంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ ను మంగళవారం కలిసి వినతి పత్రం అందించారు. స్పందించిన అధ్యక్షుడు సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
ఉర్దూ పత్రికలు, పాత్రికేయుల బృందం ఖలీల్ అహ్మద్, ముహమ్మద్ అసద్ అలీ, ముహమ్మద్ అలీ హష్మత్ జహూరీలు తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ కు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ సూపరింటెండెంట్ వి.కృష్ణ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, జూన్ 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ అమెరికా పర్యటనలో వాషింగ్టన్ లో భాగంగా సియటల్ జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ కు ముఖ్యఅతిథిగా హాజరై నియోజకవర్గంలో అభివృద్ధికి పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేయాలని వారిని కోరారు. ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవంతంగా ముగుంచుకొని తిరిగి స్వదేశాగమనం కి రావటంతో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు నాగం సాయిబాబా , షేకవత్ అలీ, గఫర్, తదితరులు పాల్గొన్నారు..
జర్నలిస్ట్ ల రైల్వే పాస్ ల కోసం కేంద్రానికి నివేదిస్తాం …ఎన్ యు జె(ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్
హైదరాబాద్, జూన్ 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)దేశంలో జర్నలిస్ట్ రైల్వే పాస్ లు కోసం కేంద్రానికి నివేదిస్తాం అని
ఎన్ యు జె(ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ముస్కాన్ ఫంక్షన్ హాల్ లో టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(ఇండియా) కార్యదర్శి మాట్లాడుతూ..గత 3ఏళ్ల కాలంగా జర్నలిస్ట్ రైల్వే పాస్ లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసారని, మళ్ళీ ఈ పాస్ ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తా మన్నారు. రాష్ట్రంలో టీజేఏ సభ్యులు సభ్యత్వ రుసుము 100రూపాయలు విధిగా చెల్లించాలని కోరారు. టీజేఏ జర్నలిస్టులకు యూనియన్ గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. టీజేఏ తరపున మహాత్మ గాంధీ హౌసింగ్ సొసైటీ సమావేశం జరుపుకోవడం శుభారంభం అన్నారు. జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర, జిల్లా కమిటీలు ఎప్పటికప్పుడు స్పందించాలని కోరారు.
యూనియన్ నడపడానికి నిధుల సేకరణ అవసరం అని, దీనికోసం జర్నలిస్ట్ సమాచార్ మాసపత్రిక ప్రారంభిస్తున్నాం అని ఎన్ యు జె మాజీ చైర్మన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, టీజేఏ, జాప్ ఫౌండర్ అయిన ఉప్పల లక్ష్మణ్ అన్నారు. జర్నలిస్ట్ సమాచార మాస పత్రిక కు ప్రకటనల సేకరణ బాధ్యత ప్రతి జిల్లా యూనిట్ తీసుకోవాలన్నారు. టీజేఏ యూనియన్ కి సంబంధించిన వార్తలు, స్టోరీలు ఈ పత్రికకు ఇవ్వ వచ్చన్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లోని టీజేఏ రాష్ట్ర కార్యాలయాన్ని ఆధునికరించడం, రాష్ట్ర కార్యవర్గం తరచు కార్యాలయానికి రావాలని, ప్రతి నెల విధిగా సమావేశం నిర్వహించి, జర్నలిస్ట్ సమస్యలు, ఇతరత్రా జర్నలిస్ట్ సంబంధమైన చర్చలు జరిపి, తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు తయారు ప్రభుత్వానికి సమర్పించే నివేదికలు, వినతి పత్రాలు అందిస్తుండాలన్నారు. సభ్యత్వ రుసుము ప్రతి టీజేఏ సభ్యులు విధిగా చెల్లించి, తమ బాధ్యతలు నిర్వహించాలన్నారు. మహాత్మగాంధీ జర్నలిస్ట్ సొసైటీ ద్వారా టీజేఏ సభ్యులైన జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. అనంతరం టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు మాట్లాడుతూ..జర్నలిస్ట్ లకు కొత్త అక్రిడిటేషన్స్ వచ్చే వరకు పాత అక్రిడిటషన్ కార్డులు రినివల్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 30తో అక్రిడిటేషన్ లు, జర్నలిస్ట్ బస్ పాస్ ల గడువు ముగుస్తుందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉర్దూ భాషసంఘం సభ్యులుగా ఎన్నికైన సత్తార్ ను టీజేఏ సత్కరించింది. ఈ సమావేశంలో ఎన్ యు జె(ఐ)కార్యవర్గ సభ్యులు డాక్టర్. షేక్ హసీనా, దన్నారపు రాజలింగం, టీజేఏ ప్రతినిధులు మోహన్ యాదవ్, ఖాసీం, ఖాళీల్ అహ్మద్, మొహమ్మద్ గౌరీ, సంపత్ కుమార్, కుమార స్వామి, ముఖిమోద్దీన్, ఆరిఫ్ ఖాన్, యాదిల్, యాదగిరితో పాటు 200మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )పాత్రికేయ వృత్తిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుదేనని ఎన్ యు జె(ఐ)కార్యదర్శి రాజేందర్ నాథ్ అన్నారు. ఆదివారం రామోజీ మృతి పట్ల కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ సంతాపసభ ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభకు హాజరైన రాజేందర్ నాథ్ తో పాటు తో తోటి జర్నలిస్టులు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్బంగా ఎన్ యూ జె(ఐ)కార్యదర్శి మాట్లాడుతూ..రామోజీమృతి పిస్టుల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేశారు. ఈనాడు పత్రిక రాక ముందు పాత్రికేయ వృత్తి పట్టణాలకు, జిల్లా కేంజ్రాలకే పరిమితం అయ్యేది, రామోజీ రావు స్థాపించిన ఈనాడు పత్రికలో జిల్లా అనుబంధం తీసి, నియోజక వర్గ, మండల స్థాయి పాత్రికేయులు ఏర్పాటు చేసి, జర్నలిజం వృత్తిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారని, తరువాత అన్నీప్ పత్రికలు మండల స్థాయిలో రిపోర్టర్ లను పెట్టారన్నారు. ప్రతిభకు గుర్తింపు నిచ్చి, జర్నలిజంతో ఎన్నో ప్రజా సమస్యలకు చెక్ పెట్టారన్నారు. ప్రతి జర్నలిస్ట్ రామోజీ అడుగు జాడల్లో నడవాలన్నారు. ఈ సంతాప సభలో జిల్లా అక్రిడి టేషన్ కమిటీ గ్రామీణ ప్రాంత సభ్యుడు సోమయాజుల రాజ్ కుమార్ , సీనియర్ జర్నలిస్టు న్యాయవాది పద్మ పండరీ, సీనియర్ జర్నలిస్టులు శివ, సిద్దుగౌడ్, తుప్తేవర్ శివకుమార్, శ్రీనివాస్ రావు, మహేష్, ముత్తి రాములు, ప్రశాంత్ గౌడ్, పృథ్వి రాజ్, అమృత్ రావు, సంతోష్, పట్టేం ప్రసాద్, సంతోష్, ఆకుల వెంకట్, లక్మి నారాయణ, ఎలక్ట్రానిక్స్, అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
పాల్గొన్నారు.