ముధోల్:17ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని కొలి గల్లికి చెందిన కోరి సాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.దీంతో శనివారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలన్నా రు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, మాజీ ఉప సర్పంచ్ మోహన్ యాదవ్, నాయకు లు సాయినాథ్,ఫీరాజి, పోతన్న, శ్రీనివాస్ ,తదితరులున్నారు
తెలంగాణ
14 15 వార్డులలో అధ్వానంగా మారిన మురికి కాలువల పరిస్థితి పట్టించుకోని అధికారులు
బిచ్కుంద ఫిబ్రవరి 17 తెలంగాణ ఎక్స్ ప్రెస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 14 15 వ వార్డులలో డ్రైనేజీల వ్యవస్థ అస్త వేస్తంగా ఉందని గ్రామ సభలో తెలిపిన ఇప్పటివరకు వచ్చి చూసిన అధికారుల దాఖలాలు లేవు అంటూ గాని మాటలకే గ్రామ సభలు గా నిర్వహిస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడ్డారు అదేవిధంగా తమ వార్డులో కుక్కల బెడదతో ఇప్పటివరకు నలుగురిని కుక్కలు గాయపరచడంతో బాన్స్వాడ ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని వాటిపైన కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వాపోయారు డ్రైనేజీలు చెత్తాచెదారాలతో నిండిపోయి కాలనీలు కంపు కొడుతున్నాయని దానికి తోడు దోమల బెడదతో రోగ పాలు అవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఇకనైనా సంబంధిత ప్రత్యేక అధికారులు చరవ చూపి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు

కామారెడ్డి జిల్లా /బాన్సువాడ మండలం (తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఫిబ్రవరి 17
ఈరోజు బోర్లం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గోపన్ పల్లి సాయిలు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రథసారధి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బర్త్ డే సందర్బంగా బోర్లం గ్రామ గాంధీచౌక్ చెరస్తా లో ఘనంగా బర్త్ డే కేక్ కట్టింగ్ చేసి స్విట్స్ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమం లో బాన్స్ వాడ ఏఎంసి చైర్మన్ నెర్రె నర్సింలు మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ మంద శ్రీనివాస్ బోర్లం బి ఆర్ ఎస్ నాయకులు, రాజేశ్వర్ గౌడ్ సయ్యద్ జలీల్ మన్నె చిన్న సాయిలు మమ్మాయి కాశీరం గంగా హన్మాండ్లు మన్నె రమేష్నల్లోళ్ల సాయిలుపి జీవన్ డాక్టర్ సాయిలు బొంబాయి సులేమాన్ హన్మాండ్లు కాపర్తి శివరాజులు కే భరత్ ఏడే రవి సయ్యద్ అలీ ఇంద్రశేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు
కామారెడ్డి జిల్లా/ బాన్సువాడ నియోజకవర్గo (తెలంగాణ ఎక్స్) ప్రెస్ ఫిబ్రవరి17
బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలతో కలసి మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మరియు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి
ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ అదినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప నేత కేసిఆర్
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా గత 9 సంవత్సరాల పాలనలో తెలంగాణని దేశంలో అభివృద్ధి పథంలో నిలబెట్టారు,వారు గొప్ప పరిపాలన దక్షకుడు
ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది,ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుంది హామీలు నెరవేర్చడంలో విఫలం అవుతున్నారని, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేది కాదు అని తొందర్లోనే మళ్ళీ మన కెసిఆర్ రే ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు
టేక్మాల్ లో కెసిఆర్ జన్మదిన వేడుకలుకేసిఆర్ ఆయురారోగ్యంగా ఉండాలిబీఆర్ఎస్ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్
ఫిబ్రవరి 17తెలంగాణ ఎక్స్ ప్రెస్ టేక్మాల్ మండల కేంద్రంలో
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కమ్మరి సిద్దయ్య. బొబ్బిడి సుధాకర్. ఎంఏ సలీం. కొత్తపల్లి సాయిలు.మాణిక్యం.సాయి తో కలిసి బీఆర్ఎస్ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్ పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ అందరి సహకారంతో కెసిఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తీసుకొచ్చారు ఈ తెలంగాణను 10 సంవత్సరాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిరు రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతుబంధు.రైతు ప్రమాదవశత్తు మరణిస్తే రైతు బీమా 18 సంవత్సరాల నిండిన మహిళలకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ రూ.100116 రూపాయలను కానుకగా ఇచ్చినారు 57 సంవత్సరాల నుండి నా వృద్ధులకు వితంతువులకు 2016 రూపాయలను ఆసరాగా ఇచ్చినారు వికలాంగులకు 416 రూపాయలు ఇవ్వడం జరిగింది తెలంగాణలో మెరుగైన వైద్య సేవలు అందించినారు తెలంగాణలో ఇవే కాకుండా హైదరాబాద్ ఐటి అభివృద్ధి గ్రామాల అభివృద్ధి పట్టణాభివృద్ధి జరిగినాయి అన్నారు రాజకీయాల్లో గెలుపోవటములు సహజo అయినా
కేసీఆర్ గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఉండి తెలంగాణను మును ముందు అందరు సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి.సాయిబాబా. గోవించాలి.సత్యనారాయణ.
వీరేశం.సలావుద్దీన్.విష్ణు.నవీన్. వెంకటేష్ నాగరాజు కేశవులు సత్యం రమేష్.సంగయ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పాల్గొన్నారు
- తలకొండపల్లి మాజీ ఎంపీపీ సిఎల్. శ్రీనివాస్ యాదవ్
తలకొండపల్లి, ఫిబ్రవరి 17
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ. సిఎల్. శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు, సాధించిన రాష్ట్రాన్ని 10 ఏండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు వెల్జాల్ గ్రామపంచాయతీ ప్రాంగణంలో కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావ్ 70వ జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యంతో నిండునూరేళ్ళు జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ కో ఆప్షన్ మూజీబూర్ రహేమాన్, రైతు సంఘం అధ్యక్షుడు. నరేందర్ గౌడ్, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ నాయకులు యాదయ్య, విజయ్ కుమార్, శ్రీరామ్, శ్రీను, జంగయ్య,రమేష్ యాదవ్, మోహన్ లాల్, సుధాకర్, గోవర్ధన్ గౌడ్, శ్రీశైలం యాదవ్, వెంకటయ్య, గోద ఆంజనేయులు, అవినాష్ గౌడ్, శ్రీశైలం, విజయ్ యాదవ్, రాజు, జగన్, లింగం, రవి. వినోద్, కృష్ణయ్య, సాయి, కుమార్ తదితరులు పాల్గొన్నారు..

ఎల్లారెడ్డి లో ఘనంగా మాజీ సిఎం కేసీఆర్ 70 వ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 17,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో, శనివారం బి అర్ ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ సిఎం కేసీఆర్ 70 వ జన్మదిన వేడుకలను పట్టణ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఎరుకల సాయిలు, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్ , నాయకులతో కలిసి చైర్మన్ కేక్ కట్ చేసి ఒకరి కోకరు తినిపించు కున్నారు. మాజీ సిఎం కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురా రోగ్యాలతో ఉండాలని, భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని , రానున్న కాలంలో కేసీఆర్ నాయకత్వం లో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్టాప్ నర్స్ హారిక తో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ముజ్జు, కౌన్సిలర్ ఎరుకల సాయిలు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆధిమూలం సతీష్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శ్రావణ్ కుమార్ , ఇమ్రాన్ సాజిద్, బర్కత్, పాల్డే నారాయణ, నాగం రాజయ్య, అట్కరి బబ్లూ, అనిల్ నాయక్, హర్ష వర్ధన్, మాజీ సర్పంచ్ లు అబ్దుల్ అలీ మహ్మద్, రఘువీర్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.
ముధోల్:17ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తాం డ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వ హించే సమ్మక్క -సారలమ్మ జాతరకు గద్దెలు ముస్తాబైనట్లు దేవదాయ స్థాప కులు రేణుకమ్మ తెలిపారు. ఈ జాతరకు నియోజకవర్గ కేంద్రమైన ముధోల్, బాసర,తానూర్, కుంటాల, లోకేశ్వరం,కుబీర్, బైంసా, నిజామాబాద్ హైదరాబాద్ పట్టణాల నుండి కాకుండా మహారాష్ట్ర లోని ముంబై,ధర్మబాద్ ప్రాంతాల నుండి భారీగా సంఖ్యలో భక్తులు సమ్మక్క- సారాలమ్మలను దర్శించుకుంటారు. సమ్మక్క-సరలమ్మ లు కోరిన కోరికలు తీర్చి అమ్మవారిని భక్తుల నమ్మకం.

ఈనెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు సమ్మక్క -సారలమ్మ జాతర జరుగుతుందన్నారు.సమ్మక్క -సారలమ్మ గద్దెలను 21 తేదీన కనక వనం గద్దెపైకి వచ్చును, సరళమ్మ దేవత గద్దే పైకి వచ్చును. 22వ తేదీన శ్రీ సమ్మక్క గద్దె పైకి వచ్చును, 23వ తేదీన శుక్రవారం భక్తులు సమ్మక్క -సారలమ్మ దేవతలకు ఓడి బియ్యం నిలువెత్తు బంగారం , బోనాలు మేకలతో మొక్కులను సమర్పించబడును.చివరి రోజైన 24వ తేదీన శనివారం సమ్మక్క -సారలమ్మ తిరిగి వనప్రవేశంగా వెళతారు. దింతో ఈ జాతర నాలుగు రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతుందని నిర్వాహకురాలు తెలిపారు

జుక్కల్ ఫిబ్రవరి 17 తెలంగాణ ఎక్స్ ప్రెస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం కౌలాస్ లో వృషభలింగ శివాచార్య సంస్థాన్ మఠం లో వసంత పంచమి ,రథసప్తమి ఉత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. వృషభలింగ శివాచార్య మఠాధిపతి బసవలింగ శివాచార్య మహారాజు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు కార్యక్రమాలు కనుల పండుగగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవం, అగ్నిగుండం కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి . మహాదేవ్ మందిర్ దగ్గర నిర్వహించిన అగ్నిగుండంలో భక్తులు కనకనమండే నిప్పురవ్వల పై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. మఠం సంస్థానం నుండి మాధవ్ మందిర్ వరకు రథాన్ని లాగుతూ భక్తులు ఊరేగింపు నిర్వహించారు. భజనలు కీర్తనలు నృత్యాలతో కన్నడ మరాఠీ తెలుగు సాంప్రదాయ పాటలతో శివసత్తుల వేషధారణతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అగ్నిగుండం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి వందల సంఖ్యలో భక్తులు అగ్నిగుండంలో నడిచి భక్తిని చాటుకున్నారు కనుక మండే నిప్పురవ్వలపై నడిస్తే తమ పాపాలు తోలగుతాయని నమ్మకం భక్తుల్లో ఉంది. అందుకని భక్తులు పోటీపడి అగ్నిగుండంలో నడిచారు శనివారం రాత్రి మఠం లో నిర్వహించిన సమావేశంలో మఠాధిపతులు బసవలింగ శివాచార్య మహారాజ్, మల్లికార్జున స్వామి మహారాజ్, శంకర లింగ శివాచార్య మహారాజ్, లు ప్రవచనం చేస్తూ ధర్మరక్షణకు అందరూ సహకరిస్తేనే భారతదేశంలో సంప్రదాయాలు, ఆచారాలు ముందుకు కొనసాగుతాయని అన్నారు, భక్తులు దూరలవాట్లకు దూరంగా ఉంటూ మనుషుల్లో ప్రేమ భావాలు, మానవతా దృక్పథం పెంచుకుంటేనే ధర్మరక్షణ సాధ్యమవుతుందని ప్రవచనంలో పేర్కొన్నారు. రాత్రి కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాల భజన మండలి సాంప్రదాయ భజనలు చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంగారం స్థానిక నాయకులు మండల వైస్ ఎంపీపీ ఉమాకాంత్ దేశాయి సర్పంచ్ హనుమాన్లు నాయకులు అనిత సింగ్, శంకర్ పటేల్, పటేల్ పండిత్ రావు, మల్లికార్జున్, బస్వరాజ్, హనుమ గౌడ్ ,బాబు,సంగప్ప,వీరేశ్ పటేల్,విఠల్ పటేల్, పాకాలి వెంకటేష్,గంగారెడ్డి,బోడ సాయిలు,మూడు రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- 44 కార్మిక చట్టాలను 4 భాగాలుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తూ సమ్మెలు చేసుకునే హక్కులను నిర్వీర్యం చేయడం ఆందోళనకరం..సిఐటియు జిల్లా కో కన్వీనర్ పి.ఆంజనేయులు,సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు భరత్ కుమార్ మాగనూరు,ఫిబ్రవరి 16:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ):
మాగనూర్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా హై స్కూల్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదిగా పురవీధుల గుండ ర్యాలీ నిర్వహించి అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కో కన్వీనర్ పి ఆంజనేయులు,సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు భరత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో భాగంగా పురవీధుల గుండా వివిధ రంగాల కార్మికులు అంగన్వాడి,ఆశా,మధ్యాహ్నం భోజనము వర్కర్స్ వి వో ఏ గ్రామపంచాయతీ,వి వో ఏ లకు కనీస వేతనం 26,000/- ఇవ్వాలని,ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని,పిఎఫ్,ఈఎస్ఐ ఉద్యోగ భద్రత,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి,కేంద్రంలోని ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ సామాన్య ప్రజల కార్మిక కర్షక హక్కులపై దాడి చేస్తుందన్నారు.మాటల్లో జాతీయత ఆచరణలో విదేశీ జపం చేస్తుంది దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేస్తుందన్నారు.44 కార్మిక చట్టాలను నాలుగు భాగాలుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తూ సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కులను కాలరాస్తూ మరోపక్క కార్పొరేటు మతతత్వ విధానాలను అమలు చేస్తూ కార్మికుల కర్షకుల దేశ ప్రజల జీవితాలతో ఆటలాడుతూ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.కార్మికులు కర్షకులు రైతులు దేశ ప్రజలందరూ గమనించి మతోన్మాదం బిజెపి విధానాలను ఎండగట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉద్యోగులు శివకుమారి,తులసి,సునీత,రాగసుధ,మంజుల,మధ్యాహ్న భోజన కార్మికులు జి.ప్రమీల,శంకరమ్మ,లక్ష్మీ దేవమ్మ, బాబు,ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు శాంతమ్మ,గౌరమ్మ,అనురాధ,కృష్ణవేణి,సత్యమ్మ,గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు అశోక్,కార్యదర్శి నాగేష్,వెంకటప్ప,గుడేబల్లూర్ శీను,సంగమ్మ,మారెమ్మ,వివో ఎ ల సంఘం నాయకులు ఎం.రవి బాబు,సిపిఎం పార్టీ నాయకులు జి.నరేష్, బి.నర్సింలు,ఎస్.అంజనేయులు, వాకిటి వెంకటయ్య,భాస్కర్,రాఘవేంద్ర,ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కె.నరసింహ సాకేత్ తదితరులు పాల్గొనడం జరిగింది