మంచిర్యాల, ఫిబ్రవరి 17, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలంలో బిఆరెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను, శనివారం తాండూర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ2001 నుంచి 2009 వరకు రాష్ట్ర సకల జనుల సమ్మెలు, ఎంతోమంది యువకులు అమరులైన, ఉద్యమ నేత కేసీఆర్ పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 2014 సంవత్సరంలో నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాలన కొనసాగించారన్నారు. రాబోయే ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆరోగ్యాలతో జీవించి దేశ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి బాణయ్య, ఎంపీపీ ప్రణయ్ కుమార్, సింగిల్ విండో చైర్మన్ దత్తుమూర్తి, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
బోనకల్ , ఫిబ్రవరి 17 (తెలంగాణ ఎక్స్ప్రెస్) : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70వ పుట్టిన రోజు సందర్భంగా మండల కేంద్రంలో గల శాంతి నిలయంలో గల మానసిక బాలికలకు శనివారం ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ… కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేశారని ,రాష్ట్రాన్ని సాధించడంతోపాటు రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసిఆర్ కే దక్కిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కెసిఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని కమల్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు మల్లికార్జున రావు, పిఏ నాగేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, వేమూరి ప్రసాదు, పారా ప్రసాదు, బంధం నాగేశ్వరరావు, కాకాని శీను, తన్నీరు పుల్లారావు , ఇటికల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సినీ, మూవీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రాథోడ్ ను సన్మానించిన జడ్పీ చైర్మన్
బోనకల్, ఫిబ్రవరి 17 (తెలంగాణ ఎక్స్ప్రెస్) :బోనకల్ మండల కేంద్రానికి చెందిన గిరిజన బిడ్డ బానోత్ శ్రీనివాస్ రాథోడ్ తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా ఘన విజయం సాధించడంతో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం రాథోడ్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు.
ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ… బోనకల్లు ప్రాంతానికి చెందిన శ్రీనివాస రాథోడ్, హైదరాబాద్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టిస్టుగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి మూవీ, టీవీ ఎన్నికల్లో గత మూడుసార్లుగా పోటీ చేసి గెలుస్తూ ఓటమి ఎరుగని లీడర్ లా సినీ ఇండస్ట్రీలో ఉండటం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. బోనకల్ ప్రాంతంలో టాలెంట్ ఉన్న యువకులకు రాథోడ్ తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో.. బిఆర్ఎస్ పార్టీ బోనకల్ మండల అధ్యక్షుడు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి బానోతు కొండ, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మాజీ రైతు కన్వీనర్ వేమూరి ప్రసాదు, ఆ పార్టీ నాయకులు పార ప్రసాద్ , బంధం నాగేశ్వరరావు, నాగరాజు, తన్నీరు పుల్లయ్య, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ జయంతిని సెలవు దినం గా ప్రకటించడం బంజారాలందరకి దక్కిన గౌరవం: బీపీ నాయక్
బోనకల్ ఫిబ్రవరి 17(తెలంగాణ ఎక్స్ప్రెస్): బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలో ప్రజా ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటుచేసిన సేవాలాల్ జయంతి ఉత్సవాలు భోగ్ బండార్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత బీపీ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మార్వో అనిశెట్టి పున్నమ్ చందర్, ఆర్ ఐ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ సైదా నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ కడగండ్ల మధుబాబు, వైస్ ఎంపీపీ గుగులోత్ రమేష్, మాజీ జడ్పిటిసి బానోతు కొండ, బిజెపి నేత గుగులోత్ నాగేశ్వరరావు,గిరిజన సంఘ నేతలు గుగులోత్ పంత్, గుగులోత్ కిషోర్ లు పాల్గొన్నారు. మొదటిగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం గిరిజనుల ఆచారం ప్రకారం భోగ్ బండార్ నిర్వహించి ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా బీపీ నాయక్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం వారు చూపించిన మార్గం ఆదర్శనీయమని, సేవాలాల్ జయంతి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడం హర్షనీయమని, బంజారాహిల్స్ లో బంజారా భవన్, ట్యాంకు బండి పై సేవాలాల్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని, గిరిజన సమస్యల పరిష్కారానికి స్పెషల్ లోకయుక్త కోర్టును ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను కట్టుబాట్లను కాపాడే విధంగా ప్రణాళికలు చేయాలని, గిరిజన ఆలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాల సంఖ్యను పెంచాలని, ఐక్యతతో గిరిజన సమాజం మరింత అభ్యున్నతి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, భానోత్ శ్రీను,గుగులోతు రామకృష్ణ, రూప్లా నాయక్, భూక్య సైదులు, బానోత్ శ్రీనివాస రాథోడ్, కోటేశ్వరరావు,గుగులోత్ శ్రీను, భూక్య రమేష్ నాయక్, బాదావత్ సూర్య, వేణు, భూక్య గోపి, ఠాగూర్ వెంకటేశ్వర్లు, గుగులోతు గోపి, దుర్గా, త్రివేణి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17(తెలంగాణ ఎక్సప్రెస్ )
60 ఏళ్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను 14 ఏళ్ళల్లో నెరవేర్చిన ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత,జన హృదయ నేత , తెలంగాణ రాష్ట్ర ప్రధాత,బంగారు తెలంగాణ నిర్మాత,కారణ జన్ముడు,భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70 వ జన్మదినం సందర్భంగా వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నివాసంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి , కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్,ఉప్పలపాటి శ్రీకాంత్ , మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికి ఆదర్శంగా నిలిచింది అని. తెలంగాణ మోడల్ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిపిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని .కెసిఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాం అని, తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,బంగారు తెలంగాణరథసారథి,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, అపరభగీరథుడు , జనహృదయ నేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు , ప్రజప్రతినిధులు ,బీఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు,పార్టీ శ్రేణులు మరియు నా తరుపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని , కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని , సుఖ సంతోషాలతో , నిండు నూరేళ్ల జీవించాలని మనసారా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ,ప్రాణాలకు తెగించి, కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించిన గొప్ప యోధుడు మన అధినేత కేసీఆర్ అని అన్నారు.తన ప్రాణాలు సైతం అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని, కెసిఆర్ లేకుంటే నేడు తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని, అంతేకాకుండా కేవలం పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కూడా కేసీఆర్ కే చెల్లుతుందని.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్న నినాదంతో ముందుకు వెళుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి నేడు తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి ని నలువైపులా చాటి చెప్పిన ధీరుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. బడుగు బలహీన వర్గాలకు అండగా అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి, మన తెలంగాణ రాష్ట్రాన్ని మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత ఒక కేసీఆర్ కే దక్కుతుంది అని. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చివరి వరకు అందేలా వ్యవస్థను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా , రెండు సార్లు ముఖ్య మంత్రి పదవి చేపట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలలో చిరునవ్వులు , వెలుగును నింపిన మహానుభావుడు అని దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి తెలంగాణ ను బంగారు తెలంగాణ దిశలో అడుగులు వేయించిన కేసీఆర్ కి ప్రత్యేక కృతఘ్నతలు తెలియ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు,శ్రేయభిలాషులు,అభిమానులు,మహిళ నాయకులు, కార్యకర్తలు,మహిళ సోదరీమణులు పార్టీ శ్రేణులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
వీణవంక, ఫిబ్రవరి 17( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శివాలయ ధ్వజ స్థంభ ప్రతిష్టా మహోత్సవ పూజ కార్యక్రమాలలో శనివారం హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ పాల్గొని,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూలమాలవేసి శాలువా కప్పి, ఘనంగా సత్కరిస్తూ, మహా శివుడి, గణనాధుని, అనుగ్రహ ప్రాప్తి ఉండాలని, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు
పిడి యాక్ట్ తప్పదని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్
మంచిర్యాల, ఫిబ్రవరి 17, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): రామగుండం సిపి ఎం శ్రీనివాసులు ఐపిఎస్ ఆదేశాల మేరకు, నకిలీ విత్తనాల విక్రమ్ సరఫరాపై పోలీస్ ప్రత్యేక నిఘా ఉంటుందని, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు. శనివారం నేన్నెల్, భీమిని పోలీస్ స్టేషన్ ను, సందర్శించి, నకిలీ విత్తనాలు సరఫరా చేయకూడదని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, స్టేషన్ లో ఉన్న పలు రికార్డులను బెల్లంపల్లి ఏసిపి తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు సరపర చేసే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పిడిఎఫ్ చేయడం జరుగుతుందని అన్నారు. బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫ్జాలోద్దీన్ లతో కలిసి నెన్నెల్, భీమిని పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించి 5ఎస్ అమలు తీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ను, పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను, తనిఖీ చేసి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయిన కేసుల, పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని సీఐ, ఎస్ఐ లకి సూచించారు. ఈ సందర్భంగా ఏసీపీ సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నందు 5ఎస్ ఫంక్షన్ వర్టీకల్స్ అమలు అయ్యేటట్లు చూసుకోవాలని, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో వర్టికల్స్ వారిగా వారి విధులు అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి కేసులు నమోదు అవుతున్నాయో ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని అధికారులకు సిబ్బంది కి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్నాయని, తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. గుడుంబా, గంజాయి, నకిలీ విత్తనాల తయారీ అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. సిబ్బంది అందరూ బాధ్యతయుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని,పోలీస్ కి మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ అన్ని పోలీస్ స్టేషన్ లపరిధిలో నకిలీ విత్తనాల విక్రయం మరియు అక్రమ రవాణా చేస్తూ రైతులను మోసగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పీడీ యాక్ట్ పెడతామని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ గారు హెచ్చరించారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, సరఫరా చేసిన పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ లో నకిలీ విత్తనాల సరఫరా, ఉత్పత్తి, ఎవరైన వ్యాపారులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే ప్రజలు కూడా పోలీసు వారికి సహకరిస్తూ, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు తమ గ్రామాలలో జరిగినట్లయితే అట్టి సమాచారం కూడా స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సీఐ శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫ్జాలోద్దీన్, భీమిని ఎస్ఐ ప్రశాంత్, నేన్నల్ ఎస్ఐ శ్యామ్ పటేల్,ఉన్నారు.
బోధన్ రూరల్,ఫిబ్రవరి17:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) సాలురా మండల నూతన తహాసిల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రమేష్ ను ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్య క్రమంలో సొసైటీ చైర్మన్ అల్లే జనార్ధన్, ఐడిసిఎంఎస్ డైరెక్టర్ రాజా గౌడ్,గ్రామ పెద్దలు కే.జి.గంగారాం,డిస్కో సాయిలు,కండేల సంజీవ్,బుయ్యన్ సురేష్,శివరాజ్,రమేష్,రాజు,మోహన్ తది తరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 17( తెలంగాణ ఎక్స్ ప్రెస్)టేక్మాల్ మండల కేంద్రంలో
ఎంపీ బిబి పాటిల్ ద్వారా ఇచ్చిన రెండు హైమాస్ట్ లైట్లను టేక్మాల్ దర్గా పీఠాధిపతి హాజ్రాత్ సయ్యద్ అహ్మద్ నూరుల్లా హుసేని ఖాద్రి గారు ప్రారంభం చేశారు
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా మైనారిటీ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం డబ్ల్యూ ఎస్ అధ్యక్షులు ఎం ఏ సలీమ్, టేక్మాల్ మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు భక్తుల వీరప్ప, సీనియర్ నాయకులు చింత రవి,నాయకోటి భాస్కర్,మాజీ ఎంపీటీసీ సిద్దయ్య, నాయకులు గోవిందాచారి,సత్యం,తాజా మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు సలావుద్దీన్, సయ్యద్ వసీమ్, నాయకులు అలీమ్, జమీరు తదితరులు పాల్గొన్నారు
సమ్మక్క-సారలమ్మ ప్రాంగణాన్ని సందర్శించి, జాతర పోస్టర్ ఆవిష్కరించిన వొడితల ప్రణవ్
వీణవంక, ఫిబ్రవరి 17( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంచల్లూరు( ఇప్పలపల్లె ) గ్రామంలోసమ్మక్క-సారలమ్మ జాతర జరిగే ప్రాంగణాన్ని సందర్శించి,ఏర్పాట్లను పరిశీలించి, జాతర యొక్క పోస్టర్ ను ఆవిష్కరించిన, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పాలకవర్గం చూసుకోవాలని ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని రాకుండా
భక్తులకు అవగాహన కల్పించాలని పాల్కవర్గానికి సూచించారు.. సందర్భంగా
ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
వీణవంక, ఫిబ్రవరి 17( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంచల్లూరు( ఇప్పలపల్లె ) గ్రామంలోసమ్మక్క-సారలమ్మ జాతర జరిగే ప్రాంగణాన్ని సందర్శించి,ఏర్పాట్లను పరిశీలించి, జాతర యొక్క పోస్టర్ ను ఆవిష్కరించిన, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పాలకవర్గం చూసుకోవాలని ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని రాకుండా
భక్తులకు అవగాహన కల్పించాలని పాల్కవర్గానికి సూచించారు.. సందర్భంగా
ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.