ఎల్లారెడ్డి, మార్చి 6:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ(కెజిబివి) మహిళ విద్యాలయంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళ వర్కర్ లకు ఎంఈఓ దేవిసింగ్ తన సొంత ఖర్చులతో చీరలు బహుకరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ..ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సెలవు కావడంతో, మహిళలను గౌరవించాలన్న ఉద్దేశ్యంతో వర్కర్ లకు ముందుగానే చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలను గౌరవించాలని వారికి ఇచ్చే గౌరవ సత్కారం ఇది అన్నారు. తమను గౌరవించి తమకు చీరలు బహుకరించిన ఎంఈఓకు మహిళ వర్కర్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి అమ్మర్సింగ్, ఎస్ఓ. సరోజన ఉపాధ్యాయులు భాస్కర్, సంతోష్, రమణ పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి…- ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్
ఎల్లారెడ్డి, మార్చి 6,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ సూచించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ” సైబర్ జాగృక్త దివాస్ ” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మత్కడుతూ…తల్లి తండ్రులు తమ పిల్లల పట్ల ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలని, కళాశాలకు వెళ్లి నేరుగా ఇంటికి వస్తున్నాడా లేక ఇంకా ఏమైనా పనులు చేస్తున్నాడా అనే విషయాన్ని గమనించాలని అన్నారు. నేడు ప్రతి విద్యార్థి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వాడటం జరుగుతోందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందవచ్చు అనే సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటిపి మోసాలు, ఫ్రాడ్ కొరియర్ సర్వీస్, సోషల్ మీడియా, తదితర వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆతర్వాత ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గూగుల్ లో కస్టమర్ కేర్ నెంబర్ సెర్చ్ చేసినపుడు సైబర్ క్రైమ్ కి గురి అయ్యి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు అని తెలిపారు. తాను చదువుకునే రోజుల్లో కేవలం ఫేస్ బుక్ మాత్రం చూసే వాడిని అని అన్నారు. నేడు యువత మొబై ఎల్ ఫోన్ లు వాడి,సైబర్ నేరాల బారిన పడుతున్నారని తెలిపారు. అనంతరం ఎస్ఐ బొజ్జ మహేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఫోన్ లో ఉపయోగించే ఇంస్టాగ్రామ్, పేస్ బుక్, వాట్స్ అప్, ట్విట్టర్ అకౌంట్ ల ద్వారా సైబర్ క్రైమ్ కి గురి అవుతున్నారని తెలిపారు. ఒకొక్కరు నాలుగు అకౌంట్ లు మెంటైన్ చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని తెలిపారు. ఆతర్వాత సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 నంబర్ కు డయల్ చేయాలని తెలిపే వాల్ పోస్టర్లను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జయప్రకాశ్ అంకం , బుద్దె అరుణ్ కుమార్, జాతీయ సేవ సమితి అధికారులు కృష్ణ ప్రసాద్ , గోదావరి, విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు.
మేడ్చల్, ఫిబ్రవరి 29, (తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
మేడ్చల్ సి బి ఎస్ ఈ గుండ్ల పోచంపల్లి శాఖ శ్రీచైతన్య పాఠశాలలో ” గురువారం స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్” లో భాగంగా “ఫ్యామిలీ ఫెస్ట్” ను ఘనంగా నిర్వహించినట్లు విద్యా సంస్థల డైరెక్టర్ సీమా తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసి, వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సీమ మాట్లాడుతూ తల్లి తండ్రుల పాదాలను పూజించి పాద పూజ చేసి గౌరవించడం హైందవ సంస్కృతి లోని సనాతన ధర్మం అని గుర్తు చేశారు. తల్లి తండ్రులు మాట్లాడుతూ, పాద పూజ ద్వారా విద్యార్థుల్లో నైతికత, మానవతా విలువలు అంతరించి పోకుండా ఉపయోగ పడతాయని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తల్లి తండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని విద్యార్థులచే భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎ జి ఎం జీ.వి.రమణా రావు, ప్రిన్సిపాల్ ఎ. రాజేష్ రెడ్డి, కోఆర్డినేటర్స్ శ్రీ రవి కుమార్, జైపాల్ రెడ్డి , డీన్స్ సోమేష్ , అఖిల్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందినీ, తల్లిదండ్రలను, విద్యార్థిని, విద్యార్థులనూ విద్యాసంస్థల డైరెక్టర్ సీమ ప్రత్యేకంగా అభినందించారు.
Bibi Patil joins BJP.. MP who will say goodbye to BRS.. Modi is likely to join the Assembly on March 5 in Sangareddy.
Zaheerabad, february 28:-(telangana express beuro)Many surveys have concluded that the Kamal Dal is going to win the seat of Delhi for the third time in Sangareddy district. Many senior leaders have left the car and are looking towards Kamalam as many surveys have shown that the opposition alliance parties are lacking in unity and lack of power. Vishwa is making efforts to join the party with better chances of winning. It is reliable information that Zaheerabad MP Bibi Patil’s discussions with Delhi leaders of Kamal Dal have come to a conclusion. Another reason for Bibi Patil’s entry into the state is his good relations with business, politics and central ministers. In BRS
It is reported that the chances of winning the seat are not good because Kamalam is eyeing it. In 2014, the majority was more than 46,000, but in 2019, they won with a narrow majority of just over 6,000. If the Zaheerabad MP seat is decided by BJP..? It is reported that everything is ready to tie the lotus scarf in the presence of Prime Minister Modi in an open meeting to be held in Sangareddy on March 5. But there is a fierce competition in BJP for Zaheerabad MP seat. After getting the MP seat. BJP leaders are working hard to achieve victory. It has become interesting as there is fierce competition in BJP for Zaheerabad MP seat like never before. Finally, we have to wait and see how the voters will react.
హైదరాబాద్, ఫిబ్రవరి 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంటు సభ్యునిగా (రాజ్యసభ)కు ఎన్నికయిన సంధర్బంగా సోమవారం హైదరాబాద్ లోని ఇమ్లిబాన్ వాకర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ రమేష్ యాదవ్, సెక్రటరీ అంజనాలు, తెలంగాణ జర్నలిస్ట్ అసిసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు ఖలీల్ అహ్మద్, ఎం. ఆర్. గౌరీ, మైసయ్య, హస్మాత్ జోరీ, మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్బంగా పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్ట్ ల సమస్యలను వారు అనిల్ కుమార్ దృష్టికి తీసుకపోగా, జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తామన్నారు.
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో శనివారం రాత్రి శివ మాలధారణ చేసిన స్వాములు సామూహిక పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజారి సంగాయప్ప శివలింగానికి అభిషేకాలు చేయించారు. అందమైన పడిలో శివపార్వతులకు పడిపూజ నిర్వహించారు. రాత్రి పడి వెలిగించి పూజ పూర్తి చేశారు. అనంతరం భక్తులకు శాస్త్ర ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ శాస్త్ర ప్రసాదాన్ని 10వ వార్డు కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్ వితరణ చేశారు. ఈ పూజకు అల్పాహార దాతగా నిలిచిన పద్మ శ్రీకాంత్ కు శివ స్వాములు శాలువతో సత్కరించారు. పూజకు హాజరైన భక్తులు శివపార్వతుల దర్శనం చేసుకొని, తీర్థ, అల్పాహారం ప్రసాదాలు స్వీకరించి వెళ్లారు.
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో శనివారం రాత్రి శివ మాలధారణ చేసిన స్వాములు సామూహిక పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజారి సంగాయప్ప శివలింగానికి అభిషేకాలు చేయించారు. అందమైన పడిలో శివపార్వతులకు పడిపూజ నిర్వహించారు. రాత్రి పడి వెలిగించి పూజ పూర్తి చేశారు. అనంతరం భక్తులకు శాస్త్ర ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ శాస్త్ర ప్రసాదాన్ని 10వ వార్డు కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్ ఏర్పాటు చేశారు. దాతగా నిలిచిన శ్రీకాంత్ ను శివ స్వాములు శాలువా కప్పి సత్కరించారు. పూజకు హాజరైన భక్తులు స్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లారు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ నూతన సభ్యుడిగా ఎంఏ సత్తార్….. దక్షిణ భారతదేశం నుండి ఏ కైక సభ్యుడి నియామకం
హైదరాబాద్ , ఫిబ్రవరి 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని న్యూఢిల్లీలో గల నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ విభాగం నూతన సభ్యుడిగా హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ నియమితులయ్యారు. దక్షిణ భారతదేశము నుండి ఏకైక సభ్యుడిగా ఆయన నియామకం జరిగింది. కౌన్సిల్ నూతన కార్యవర్గంలో దక్షిణ భారతదేశము నుండి ఉర్దూ కమ్యూనిటీకి చెందిన అబ్దుల్ సత్తార్ ను సభ్యుడిగా నియమిస్తూ కేంద్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దక్కన్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కు ఆయన ఉపాధ్యక్షుడిగా వ్యవహరించడంతో పాటు, దేశ్ కా సహారా ఉర్దూ పత్రిక సంపాదకులుగా ఆయన పనిచేస్తున్నారు. తనను ఉర్దూ కౌన్సిల్ సభ్యుడిగా నియమించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉన్న విశ్వాసంతో ఈ జాతీయస్థాయి హోదాను ప్రసాదించడంపై, దాని విలువల్ని కాపాడుతూ, జాతీయస్థాయిలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
పత్రిక ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశాం. జిల్లా ఎస్పీ కేకేఏన్. అన్బురాజన్
అనంతపురం, ఫిబ్రవరి 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశామని, దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం అని
జిల్లా ఎస్పీ కేకేఏన్ అన్బురాజన్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తాం అన్నారు.
పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద వెంటనే చర్యలు తీసుకున్నాం అన్నారు.
ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేశాం అని తెలిపోయారు.
పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత…వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తాం అన్నారు.
విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా… బెదిరించినా వెంటనే మాకు సమాచారం చేరవేయండి… ముందస్తు చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ వెల్లడించారు. జర్నలిస్ట్ పై దాడి జరిగిన సంఘటనపై స్పందించిన ఎస్పీ
చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తాం అన్నారు.
పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద వెంటనే చర్యలు తీసుకున్నాం అన్నారు.
ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేశాం అని తెలిపోయారు.
పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత…వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తాం అన్నారు.
విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా… బెదిరించినా వెంటనే మాకు సమాచారం చేరవేయండి… ముందస్తు చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ వెల్లడించారు.
ఎస్పీని అభినందించిన ఎన్ యు జె(ఇండియా
)అనంతపురం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేసిన సంఘటనపై స్పందించిన ఎస్పీ కేకేఏన్ అన్బురాజన్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (ఎన్ యు జె ఇండియా) అభినందిస్తుందని ఎన్ యు జె(ఐ) కార్యదర్శి రాజేందర్ నాథ్ అభినందించారు. జర్నలిస్ట్ లకు పోలీసుల రక్షణ ఉంటుందని చెప్పిన ఎస్పీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకోసారి జర్నలిస్ట్ ల పై దాడులు జరక్కుండా, దాడి చేసిన వారికి కఠినశిక్షలు పడేలా చూడాలన్నారు.
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి
-మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్
ముధోల్:20ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి చేస్తానని ముధోల్ మాజీ ఎమ్మెల్యే నా రాయణరావు పటేల్ అన్నారు. మంగ ళవారం మండల కేంద్రమైన ముధోల్ లోని కొత్త బస్టాండ్ రోడ్డు నిర్మాణ పను లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముధోల్ వీడిసి అధ్యక్షులు నారాయ ణ శాలువాతో ఘనంగా సన్మానిం చారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తుల మద్దతు ఇస్తే గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడు పాటుప డతానని పేర్కొన్నారు. పార్టీలకతీ తంగా గ్రామాల అభివృద్ధి సాధ్యమవు తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వీడీసీ ప్రధాన కార్యదర్శి సాయినా థ్ ,నాయకులు జీవన్, సంగోళ్ల పోత న్న, తదితరులున్నారు