ముధోల్:07మార్చ్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ స రస్వతి శిశు మందిర్ పాఠశాలలో గు రువారం ముందస్తుగా మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నా రు. ఈ సందర్భంగా విద్యార్థులు పర మశివుని ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి శివలింగానికి పూజలను చేశారు. అ నంతరం విద్యార్థులు వేసిన శివుని వే ష ధారణ పలువురిని ఆకట్టుకు న్నాయి. దీంతో పాఠశాల ఆవరణలో ఓం నమశ్శివాయ అంటు నామస్మ రణతో మార్మోగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆచార్యులు శివరాత్రి పండుగ విశిష్టతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ప్రధానాచార్యులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు
తెలంగాణ
దమ్మపేట మార్చి 7(తెలంగాణ ఎక్సప్రెస్ }
ఈ రోజు దమ్మపేట మండలం అంకం పాలెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో HM తోలేం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టే లేదు మహిళా సాధికార సాధన విద్య ద్వారానే సాధ్యం అని మహిళా విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస రావు రమణ శ్యామల వెంకట రమణ రామకృష్ణ వీరభద్రo శ్రీను కృష్ణ ప్రసాద్ రత్న అనూష నాగేంద్ర లత దేవి రమాదేవి అనుజ్ఞ జ్యోతి రజని సత్యవతి సురేష్ కృష్ణ చరణ్ తదితరులు పాల్గొన్నారు… HM తొలెం వెంకటేశ్వర్లు AGHS ANKAMPALEM

ఎల్లారెడ్డి, మార్చి 7,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక నీలకంటేశ్వరాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. ఆలయం పూజారి పెద్ద సంగప్ప, వీర సంగప్ప, ఈశ్వ రప్పలు ఆలయ గోడలపై గత సంవత్సరం హైద్రాబాద్ లో నివసిస్తున్న ప్రముఖ పెంటర్, సీనియర్ జర్నలిస్ట్, సూర్య దిన పత్రిక సబ్ ఎడిటర్ బ్యూరో చీఫ్ గా విధులు నిర్వహిస్తున్న విద్య వెంకట్ ను పెద్ద సంగప్ప కుమారుడు వార్డు కౌన్సిలర్ నీలకంఠం పిలిపించి సుందరంగా జ్యోతిర్లింగ చిత్రాలను సుందరంగా వేయించడంతో నీలకంటేశ్వరాలయం కొత్త అందాలు సంతరించుకుని పూర్వవైభవం ఉట్టి పడేలా చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా ముస్తాబైంది. శుక్రవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 11.25 కు బిందర్ నుండి ఆలయం వరకు స్వామి వారి ఊరేగింపు, పల్లకి సేవ, 12.45 కు అభిజిత్ లగ్న పుష్కరంశమున పార్వతి పరమేశ్వరుల సామూహిక కళ్యాణ మహోత్సవం ఉంటుందని, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపారాధన, రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహారుధ్రాభిషేకం, డో లాహరణం, మరుసటి రోజు శనివారం ఉదయం 6.45 కు అగ్ని గుండాల కార్యక్రమం, 12.25 కు అన్నప్రసాదం, సాయంత్రం 4 గంటలకు ఎడ్ల బండ్ల ప్రదర్శన ఉంటుందని ఆలయ పూజారి వీర సంగప్ప తెలిపారు. ఈ సారి ఆలయం ముందు భాగంలో ప్రత్యేకంగా రేకుల షెడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయం ఆవరణలో షామియానాలు, బారికెడ్లను ఏర్పాటు చేసినట్లు పూజారి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి, మహాశివుని ఆశీర్వాదం పొందాలని ఆలయ పూజారులు కోరారు.
తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ప్రతినిధి
వెల్గటూర్ 07
వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి మాజీ జెడ్పీటీసీ బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు దొరిశెట్టి వెంకటయ్య లక్ష రూపాయల విరాళం అందజేశారు.ఆలయ అభివృద్ధికి అందరూ ముందుకు రావాలని వారు కొరారు.ఈ సంద్భరంగా ఆలయ కమిటీ వారిని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ ,నాయకులు జూపాక కుమార్,బందెల ఉదయ్,పెద్దురి భరత్,రంగు తిరుపతి,గుమ్ముల సతీష్, దొరిశెట్టి మల్లేశం, నక్క సురేష్, బుసర్తి గంగారాం,సంకోజు నరేష్, గుమ్ముల తిరుమలేష్, మెరుగు ప్రవీణ్,కొప్పుల ప్రవీణ్ పాల్గొన్నారు
మార్చ్ 7( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నర్వ మండల కేంద్రంలోని నర్వ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిరూపించారు హెచ్ఎం మల్లేష్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా మరి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు కలెక్టర్. గా నికిత. డీఈవోగా నవీన ఎం ఈ ఓ గా లక్ష్మి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలుగా రిహానా బేగం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా జ్యోతి వ్యవహరించారు అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు మెమోటోలను బహుమతులను అందజేశారు
8 వ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం….రెండు కేంద్రాల్లో కలిపి 10 మంది గైర్హాజరు
- పరీక్ష కేంద్రాల సీఎస్ డీఓ లు
ఎల్లారెడ్డి, మార్చి 7, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల “ఎ” , ఆదర్శ కళాశాల “బి” పరీక్ష కేంద్రాల్లో, గురువారం నాడు 8 వ రోజు ఇంటర్ ద్వితీయ సంవత్సర పార్ట్ 3, మాథ్స్ 2 బి, జువాలోజి 2, హిస్టరీ 2, (వొకేషనల్) ( సెట్ “సి” ) పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓ లు సి హెచ్. హేమచందర్, పి.సాయిబాబా, స్వప్న, పద్మ లు తెలిపారు. “ఏ” కేంద్రంలో 172 మందికి 168 మంది హాజరు కాగా 04 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 31 మందికి గాను అందరూ హాజరయ్యారు. “బి” కేంద్రంలో 187 మందికి గాను 184 మంది పరీక్షకు హాజరు కాగా 03 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెండు కేంద్రాల్లో కలిపి 07 మంది విద్యార్థులు గైహాజరైనట్లు సీఎస్, డీఓ లు తెలిపారు. పరీక్షలను ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా , ఒక్కో విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రం లోనికి పంపించి, పక డ్బందీగా పరీక్ష నిర్వహించడం జరిగిందని సిఎస్, డి ఓ లు తెలిపారు. ఎండలు ముదురుతున్న దృష్ట్యా పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బంది సైతం అందుబాటులో ఉన్నారని సి ఎస్, డీ ఓ లు తెలిపారు.
చేగుంట మార్చి 7 తెలంగాణ ఎక్స్ ప్రెస్
చేగుంట మండలంలోని పోతాన్పల్లి గ్రామంలో గురువారం రోజున గ్రామం పోతాన్ పల్లి , మండలం మసాయి పేట , జిల్లా మెదక్ , నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడము జరిగినది. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు,చెవి,ముక్కు,గొంతు,వరిబీజము, బీజకుట్టు,గడ్డలు,కనతులు, థైరాయిడ్ గడ్డలు,గర్భ సంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో ,పంచాయతీ సెక్రటరీ మౌనిక , గ్రామ ప్రజలు పాల్గొనడము జరిగింది. ఈ వైద్య శిబిరంలో 122 మందికి షుగర్, బీపీ, టెస్టులు చేయడం జరిగినది,ఆపరేషన్ అవసరము ఉన్న వాళ్ళ 52 మందిని రిపర్ రాయడం జరిగింది.వీరిని మెడిసిటీ హాస్పిటల్ కు తరలించి ఉచిత ఆపరేషన్లు చేయడం జరుగుతుంది.
ఈ వైద్య శిభిర కార్యక్రమంలో డాక్టర్లు వినయ్ ,సుచిత్ర ,కావ్య , కృష్ణ మార్కెటింగ్ ఇంచార్జి కుమారస్వామి, నాగార్జున,సత్యనారాయణ, సౌమ్య లు పాల్గొనడం జరిగింది.
బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమీక్షంలో గాంధీభవన్లో బీర్కూరు మండల ప్రజలు ఉన్నారు 2500 మంది
కామారెడ్డి జిల్లా/ బీర్కూర్ మండల్ మార్చి 7 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
.బాన్సువాడ నియోజవర్గంలోని బీర్కూరు మండలాన్ని చెందిన బి ఆర్ ఎస్ నాయకులు అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఈ ముఖ్య నాయకులందరూ హైదరాబాద్ తరలి వెళ్లారు గాంధీభవన్లో కానీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు బాన్సువాడలో ఉనికి కూలిపోతున్న పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబం రోజురోజుకి అయోమయంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పోచారం పడ్డారు.
కన్నాల రైతు వేదిక లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం
- రైతు నేస్తం, రైతు వేదిక వీడియో కాన్సరెన్సింగ్ అనుసంధానం కార్యక్రమం జిల్లా కలెక్టర్ ప్రారంభం
మంచిర్యాల, మార్చి 07, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కన్నాల రైతు వేదిక లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ నాయక్ ఐఏఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బుధవారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో రైతు నేస్తం, రైతు వేదిక వీడియో కాన్ఫరెన్సింగ్ అనుసంధానం, కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు టిపిసిసి ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, ఎంపీపీ శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్, వ్యవసాయ అధికారులు, స్వాగతం పలికారు. అనంతరం కన్నాల రైతు వేదికలో నూతనంగా ఏర్పాటు చేసిన టెలివిజన్ ని జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన రైతులందరికీ చూపించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి వారంలో రెండు రోజులు రైతులకు రైతు వేదికలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, దీని ద్వారా రైతులకు, శాస్త్రవేత్తలకు, వ్యవసాయ అధికారులకు సమన్వయ లోపం లేకుండా వారికి వచ్చే కష్టనష్టాలను వ్యవసాయ పంట యొక్క దిగుబడికి సూచనలను సులువుగా నేర్చుకోవడానికి వీలవుతుందన్నారు. రైతులందరికి పంట దిగుబడి పెరుగుతుందని, అదేవిధంగా అతి తొందరలో రైతులందరికీ పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా పంట వేసే ప్రతి రైతుకు పంట బీమా చేపిస్తే, పంట నష్టపోతే వర్షం, పురుగు, నీటి వరద ద్వారా ఎటువంటి కారణాల చేతనైనా, పంట నష్టపోయినట్లైతే దానికి పూర్తి నష్ట పర్యాయం పంట బీమా ద్వారా రైతులకు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు నష్టపోకుండా అధైర్య పడకుండా ఉంటుందని, అందరూ వినియోగించుకోవాలని, రైతులు ఆనందాంగా ఉంటేనే రాష్ట్రం ఆనందంగా ఉంటుందని తెలిపారు. రైతుల యొక్క ఆత్మహత్యలన్నిటినీ పూర్తిగా నియమించడమే కాకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసుకోవడానికి దోహదపడుతుందని తెలియజేస్తూ, ముందు ముందు రైతులందరికీ అనేక రకాల సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ లో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు, బెల్లంపల్లి మండల రైతులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించడం జరిగింది.
మంచిర్యాల, మార్చి 07, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బుధవారం మాదారం గ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కి మాదారం స్థానిక ప్రజలు, నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ల నుండి సింగరేణి క్వార్టర్లలో నివాసం ఉంటున్న ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ని కోరారు. మాదారం ఊరు శివారు ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ లో వెలికి తీసే మట్టిని, గ్రామ సమీపంలో పోయకుండా చూసి ఊరును ఊరిలో నివాసం ఉంటున్న ప్రజలను కాపాడాలని కోరారు. అదే విధంగా “మాకు ఓసి వద్దు, సొంత ఇంటి కళే ముద్దు” అనే నినాదాన్ని తెలియజేస్తూ ఊరిలో నివిస్తున్న వారందరికీ న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి మాదారం గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని తెలియజేశారు.