హైదరాబాద్, మార్చి 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో) హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం తెలంగాణ మీడియా ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణా జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీజేఏ), తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మెన్ స్పంసించి మీకు నా పూర్తి సహాయ సహకారాలు వుంటాయని హామీ ఇచ్చారు. టీజేఏ రాష్ట్ర అద్యక్షుడు కె.వి. రమణారావు, ఉపాధ్యక్షుడు ఖాసిం, ఖలీల్ అహమ్మద్, ఘోరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ యాదయ్య, మొహమ్మద్ అసద్ అలి, రజియుద్దిన్, హఫిజ్వలి, అహమ్మద్,
తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్ట్, జనరల్ సెక్రటరీ ఎం.ఆర్.ఘోరీ పాల్గొన్నారు.
తెలంగాణ
హైదరాబాద్, మార్చి 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో) హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం తెలంగాణ మీడియా ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణా జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీజేఏ), తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మెన్ స్పంసించి మీకు నా పూర్తి సహాయ సహకారాలు వుంటాయని హామీ ఇచ్చారు. టీజేఏ రాష్ట్ర అద్యక్షుడు కె.వి. రమణారావు, ఉపాధ్యక్షుడు ఖాసిం, ఖలీల్ అహమ్మద్, ఘోరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ యాదయ్య, మొహమ్మద్ అసద్ అలి, రజియుద్దిన్, హఫిజ్వలి, అహమ్మద్,
తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్ట్, జనరల్ సెక్రటరీ ఎం.ఆర్.ఘోరీ
తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, మార్చి 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మాణం పూర్తికావచ్చిన టీఆర్టిసి బస్ స్టాండ్ ప్రారంభానికి ముందే ఆటో స్టాండ్ గా మారింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటి నిధులతో నిర్మించిన బస్ స్టాండ్ పూర్తి కావడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులుతప్పడం లేదు. కొత్త బస్ స్టాండ్ ప్రారంబానికి ముందే ఆటో స్టాండ్ గా మారిపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పాత బస్ స్టాండ్ ఆవరణ అంత ఆటోలతో నిండిపోయేది. కొత్త బస్ స్టాండ్ ప్రారంభానికి ముందే ఆటో స్టాండ్ గా మారడం పాతారోజుల్ని తలపిస్తుంది.
- హైదరాబాద్. మార్చి 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)) పెద్ద సంఖ్యలో చిన్న ఉర్దూ వార్తాపత్రికల సంపాదకులు గురువారం తెలంగాణ ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పి. శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాస గృహంలో హుస్సేనీ ఇక్బాల్ పర్యవేక్షణలో , డెక్కన్ సమాచార్ దినపత్రిక ఎడిటర్ వారిని కలిశారు. మంత్రికి పూలమాల వేసి, పుష్పగుచ్ఛం అందించారు. చిన్న వార్తాపత్రికల సమస్యలపై ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. పత్రికల బిల్లులు ఆర్థిక శాఖలో చాలా నెలలుగా పెండింగ్లో ఉన్నాయని, దీని వల్ల పత్రికలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు. చిన్న వార్తాపత్రికల బిల్లులను వీలైనంత త్వరగా క్లియర్ చేసేలా వెంటనే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని కోరాలని ఆయన తన పీఏను ఆదేశించారు. మెమోరాండంలో చిన్న ఉర్దూ పత్రికల జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించుకోవడానికి భూమిని అందించడంపై కూడా రాసినట్లు ఆయన ధృవీకరించారు. మంత్రిని కలిసిన వారిలో ఖలీల్ అహ్మద్, యూసుఫ్ ఖాద్రీ, మీర్ హష్మత్ అలీ జోహ్రీ, సయ్యద్ అబ్దుల్ సమద్, అతిక్ అజర్, సయ్యద్ కర్రార్ అలీ ఖాన్ అబ్ది, సయ్యద్ ముహమ్మద్ హుస్సేనీ, సయ్యద్ ముహమ్మద్ హుస్సేనీ, సయ్యద్ కరీముల్లా హుస్సేనీ, ముహమ్మద్ అబ్దుల్ గఫూర్, నసీరుద్దీన్, నసీరుద్దీన్, ఎఫ్. అలీఖాన్, సయ్యద్ నసీరుద్దీన్ అస్లాం, మొహత్షామ్ ఖాన్, ముహమ్మద్ సుఫ్యాన్, ఫజల్ అహ్మద్, ఇక్బాల్ అలీ ఖాన్, ముహమ్మద్ సిద్దిక్, మీర్జా జియా ఎఫెండి, జహంగీర్ పాషా సయ్యద్ ముఖిముద్దీన్ తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి, మార్చి 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, ఎల్లారెడ్డి డిఎస్పీ ఎ. శ్రీనివాసులు సూచించారు. గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందు గానే ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గౌండ్ల హారికను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా వివక్షతకు గురవుతూనే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సి.రవీంద్ర నాయక్, ఎస్ ఐ. బొజ్జ మహేష్, పోలీసులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు వున్నారు.
హైదరాబాద్, మార్చి 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)మహా శివరాత్రి కానుకగా గురువారం అర్థరాత్రి నుంచి తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న “సౌండ్ పార్టీ” మూవీ ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. గతేడాది నవంబర్ 24న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూత్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది. తాజాగా ఓటీటీలోనూరీ సౌండ్ చేయడానికి ఈ సినిమా సిద్ధమయింది. తెలుగు బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా ఆహా లోకి సౌండ్ పార్టీ చిత్రం వచ్చేసింది. మహాశివరాత్రి కానుకగా నేటి అర్ధరాత్రి నుంచి సౌండ్ పార్టీ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
హైదరాబాద్, మార్చి 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)మహా శివరాత్రి కానుకగా గురువారం అర్థరాత్రి నుంచి తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో స్ట్రీమింగ్ కానున్న సౌండ్ పార్టీ మూవీ. ఈ చిత్ర రచన – దర్శకత్వం సంజయ్ శేరి.
ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. గతేడాది నవంబర్ 24న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూత్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది. తాజాగా ఓటీటీలోనూ రీ సౌండ్ చేయడానికి ఈ సినిమా సిద్ధమయింది. తెలుగు బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా ఆహా లోకి సౌండ్ పార్టీ చిత్రం వచ్చేసింది. మహాశివరాత్రి కానుకగా నేటి అర్ధరాత్రి నుంచి సౌండ్ పార్టీ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
కామారెడ్డి జిల్లా /బాన్సువాడ మండల్ మార్చ్ 7 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
వర్ని మండలం జాకోర సొసైటీ పరిధిలో సంఘ సభ్యులకు రుణమాఫీ అయిన రైతులకు 19 మందికి 1758000,వెలా రూపాయిలు సొసైటీ చైర్మన్ బర్దావల్ దశరథ్ బ్యాంకు మేనేజర్ అవినాష్ చేతుల మీదుగా అందజేయడం అయినది ఈ కార్యక్రమంలో
వర్ని మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సురేష్ బాబా , ఎస్ఎన్ పురం మాజీ సొసైటీ చైర్మన్ నేమాని వీర్రాజు ,డైరెక్టర్లు నా రెడ్ల చిన్న సాయిలు, బంజ గంగారం , సొసైటీ సెక్రటరీ రామకృష్ణయ్య , సొసైటీ పరిధిలోని రైతులు వర్ని మండల యూత్ నాయకులు పృద్వి , చింటూ ,బాన్సువాడ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జి బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్ పాల్గొనడం జరిగింది
మంచిర్యాల, మార్చి 07, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం ధర్మారం గ్రామపంచాయతీ పరిధి గోండుగూడెం నుంచి గోదావరి వెళ్లే రహదారి మరమ్మత్తులు నాసిరకంగా జరుగుతున్నాయని, రోడ్డుపై కంకర పోస్తూ, అక్కడక్కడ మట్టిపోస్తూ, కాంట్రాక్టర్ చేతులు దులుపు కుంటున్నాడని, ఎటువంటి రోలర్ తొక్కించడం గాని, నీరు పోయడం జరుగుత లేదని, గురువారం మంచిర్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కే అశోక్, జన్నారం మండల ప్రధాన కార్యదర్శులు ఎస్కే అబ్దుల్లా ఆరోపించారు. ఈ సందర్భంగా మహశివరాత్రి పునస్కరించుకొని రోడ్డు పుష్కరాలకు వేళ్లే భక్తులు కాకుండా ప్రతిరోజు గ్రామ ప్రజలు గోదావరి రోడ్డు కు ప్రజా రవాణా ఉంటుందని, రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం చేయకూడదని, అధికారులు పర్యవేక్షించి రోడ్డు నిర్మాణం సరిగ్గా జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. గోదావరికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు సరిగ్గా జరగనియెడల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని, వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం కార్యదర్శులు హెచ్చరించారు.
ఎల్లారెడ్డి, మార్చి 7,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామ శివారులోని పందిరిగుండు పరమేశ్వరుని ఆలయం వద్ద , శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని, శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేద పండితులు నరేష్ పంతులు అధ్వర్యంలో పూజా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివలింగానికి నమక , చమకాలతో, జలాభిషేకం, పుష్పార్చన, తదితర పూజలను , అభిషేకాలు చేస్తున్నట్లు, గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం రుద్రారం గ్రామ హనుమాన్ ఆలయం నుంచి గ్రామ శివారులోని పందిరి గుండు పరమేశుని ఆలయం వరకు మహాదేవుని పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రాత్రి 9.00 గంటల నుంచి అర్థ రాత్రి లింగోద్భవ కాలం వరకు గ్రామానికి చెందిన భక్తులతో భజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శనివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం వరకు భక్తుల కోసం ఆన్న ప్రసాదం కార్యక్రమం చేపడుతున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.