మహబూబాబాద్, ఏప్రిల్ 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) మహబూబాబాద్ జిల్లా నెల్లికూదుర్ మండలం కాచికల్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్. మురళీ నాయక్ తన సొంత నిధులతో రెండు బోర్ వెల్ వేయించారు. ఈ మేరకు సోమవారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఇట్టె దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుగులోత్ శ్రీను లు బోర్ బెల్ పనులకు పూజ చేసి ప్రారంభించారు. రెండు బోర్ లలో కూడా పుష్కలంగా నీరు పడడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
శ్రమదాన కార్యక్రమంలో యువత భాగస్వాములు కావడం అభినందనీయం… జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్
కామారెడ్డి, ఏప్రిల్ 6:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) నాగన్న బావిలో పూడికతీత పనులకు శ్రమదానం చేయడానికి యువత ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న బావిలో శనివారం ఉదయం మండల స్థాయి అధికారులు, ఉపాధి, ఐకెపి సిబ్బందితో కలిసి రెండు గంటల పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూడికతీత పనులకు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పురాతన కట్టడాలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. బావిలో పూడిక తీయడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని చెప్పారు. నాగన్న బావిని పర్యటక కేంద్రాన్ని మార్చడానికి కృషి చేస్తానని తెలిపారు. మండల స్థాయి అధికారులు, యువకులు ఉత్సావంగా స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సమీపంలో మొక్కలు నాటారు. ఎంపీడీవో నరేష్, తాసిల్దార్ నరేందర్, ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, ఏపీవో అన్నపూర్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉపాధి హామీ, రెవెన్యూ అధికారులు, యువకులు పాల్గొన్నారు.
కామారెడ్డి, ఏప్రిల్ 3:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగమైన సామాజిక తనిఖీలు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సామాజిక తనిఖీ గ్రామస్థాయిలో ప్రజల, ఉపాధి హామీ కూలీల, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహించాలి. జరిగిన పనులకు సంబంధించి బహిరంగ సభ చర్చ జరపవలసి ఉంటుంది కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం అనేది లేకుండానే తనిఖీలు ఏ విధంగా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సామాజిక తనిఖీ బృందం వారు గ్రామాలలోకి వెళ్లి తనిఖీ చేస్తున్నప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విభిన్న పార్టీల వారు చేసిన పనులపై విమర్శలు చేయడానికి అవకాశం ఉంది. దీనిపై నిర్ణయాధికారులు వాస్తవంగా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏ విధంగా న్యాయం చేయగలరు. గతంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడు సామాజిక తనిఖీలు నిర్వహించ లేదు, కానీ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత దోమకొండ, మాచారెడ్డి, బీర్కూరు మండలాలలో గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీల, ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండానే ప్రజల సమక్షంలో నిర్వహించవలసిన గ్రామ సభలు, పంచాయతీ కార్యాలయంలో ఎవరి ప్రమేయం లేకుండా నిర్వహించి, మండలంలో జరిగే చివరి సామాజిక తనిఖీ ప్రజావేదిక కేవలం అధికారులు మాత్రమే మండల కార్యాలయంలో ఎవరి ప్రమేయం లేకుండా నిర్వహించడం తో సామాజిక తనిఖీల లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుందని, చేసిన పనులకు సంబంధించిన అవకతవకలు ఏ విధంగా బహిర్గతం అవుతాయని పనిచేసిన కూలీలు వాపోతున్నారు. వాస్తవంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టే ఏ పనులైనా గ్రామసభ తీర్మానం, మండల పరిషత్ తీర్మానం , జిల్లా పరిషత్ ఆమోదం గ్రామసభ తీర్మానం, మండల పరిషత్ తీర్మానం , జిల్లా పరిషత్ ఆమోదంతోనే పనులను నిర్వహిస్తారు. అలాంటప్పుడు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయకుండా తనిఖీలు ఏ విధంగా నిర్వహిస్తారని ప్రజా ప్రతినిధులు సైతం ప్రశ్నిస్తున్నారు.. దేశంలో ఎంతో కఠినంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నప్పటికీ ఇంటింటికి వెళ్లి సామాజిక తనిఖీలు నిర్వహించడం వలన గ్రామాలలో రాజకీయ పార్టీలపై ప్రభావాన్ని చూపనున్నాయి. ఇకనైనా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇకనుంచి జరిగే సామాజిక తనిఖీలను నిర్వహించ కుండా ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.
50 కోట్ల నిధులు ల్యాప్స్ చేసిన ఎంపి బిబి పాటిల్…ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
50 కోట్ల రూపాయల నిధులు ల్యాప్స్ చేసిన ఘనత జహీరాబాద్ ఎంపి బీబీ.పాటిల్ దే అని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, జహీరాబాద్ ఎంపీగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థి బీబీ పాటిల్ కాదని, బై బై పాటిల్ అని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాలు నియోజక వర్గాన్ని పాలించి పది ఊర్లు తిరగలేదని, పది ఇండ్లు ఇవ్వలేదు, పది బోర్లు వెయ్యలేదు, పది మందిని ఆదుకోలేనీ ఎంపి నేడు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కారు స్పీడ్ లో ఉన్నప్పుడు కార్ ఎక్కి కారు బోల్తా కొట్టింది అని , కారు దిగి మళ్ళీ పువ్వు మీద కూసున్నవు , నువ్వు ఎక్కడ కూసున్న నీకు ఓట్లు మాత్రం రావన్నారు. ఎంపీకి సొంత వ్యాపారం మీద ఉన్న ఆసక్తి ప్రజల అభివృద్ది పట్ల లేదని విమర్శించారు. గాంధారి మండలాన్ని దత్తత తీసుకుంటా అన్నావ్, గాంధారి మండలానికి చేసిందేమిటి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి సురేష్ శెట్కార్ కు ఓటేసి భారీ మెజార్టీ తో గెలిపించి, బిజినెస్ బీబీ పాటిల్ ని ఇంటికి సాగనంపాలని నియోజక వర్గ ప్రజలకు పిలుపు నిచ్చారు.
కామారెడ్డి, ఏప్రిల్ 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని మంగళవారం ప్రెస్ క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా శివరాం రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పాండురంగ శర్మ, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా వీరప్ప, కొప్పుల గంగాధర్, మేకల సాయిలు, కోశాధికారిగా గాండ్ల శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ గా ఆనంద్, సలహాదారుగా శివకుమార్ ను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పాండురంగ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 1:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి కొత్త హన్మాండ్లు క్రాసింగ్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి చిలుక సత్యనారాయణ మృతి చెందగా, కుమారుడు మధు గాయపడినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. సోమవారం ఉదయం ఎస్ఐ. మాట్లాడుతూ. బైక్ పై తండ్రి కొడుకులు వెళ్తుండగా, బైక్ అదుపు తప్పి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎల్లారెడ్డి, మార్చి 28:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ హైస్కూల్ లోని ప్రైమరీ సెక్షన్లో ఎల్ కె జీ చదువుతున్న ఉక్కల్ కర్ శివాన్ష్ ఇటీవల భారీ స్థాయిలో నిర్వహించిన సైన్సుఫేర్ లో ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. గురువారం సైన్స్ ఫేర్ విజేతలకు పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ బహుమతులు అందచేశారు. పాఠశాల సిబ్బంది శివాన్ష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవదాన్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు.
న్యూఢిల్లీ, మార్చి 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సోమవారం 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు. కవితకు తీహార్ జైలుకు పంపనున్న అధికారులు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 1న విచారణ కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యూడిషల్ రిమాండ్ చేసిన కోర్టు.ఇది మనీ లాటరింగు కేసు కాదు ..అని పొలిటికల్ ల్యాండ్ రింగ్ కేసు అంటూ ఎమ్మెల్సీ కవిత కోర్టు ఆవరణలో మీడియాతో వెల్లడించారు .తాను కడిగిన ముత్యాల బయటకు వస్తానని కోర్టు హాల్లో వస్తుండగా వెల్లడించారు . కోర్టు హాల్లో కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు .కుమారునికి పరీక్షల షెడ్యూల్ విడుదల అయినందువలన, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. జై తెలంగాణ….జై కేసీఆర్ అంటూ కోర్టులకు వచ్చే ముందు ఎమ్మెల్సీ కవిత నినాదాలు చేశారు..
ఎల్లారెడ్డి, మార్చి 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణిపేట్ గ్రామంలో సోమవారం ప్రజలు హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిల్లలు, యువకులు, వృద్ఫులు, మహిళలు హోలీని ఎంజాయ్ చేశారు. గ్రామ యువకుడు గుండ అరవింద్ మాట్లాడుతూ, తమ తాతల కాలం నుండి కల్యాణిలో హోళీ ఆడుతున్నారని, హోలికి ముందు రోజు కామదహనం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రేమాను రాగలకు హోళీ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉదయం నుండి 12గంటలవరకు రంగులు చల్లుకుంటూ ప్రతి ఏటా హోళీ ఎంజాయ్ చేస్తాం అన్నారు.
రెండు కేంద్రాల్లో కలిపి 11 మంది గైర్హాజరు…
హుషారుగా కేరింతలు కొడుతూ ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు…
– రెండు పరీక్ష కేంద్రాల సీఎస్ డీఓ లు
ఎల్లారెడ్డి, మార్చి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల “ఎ” , ఆదర్శ కళాశాల “బి” పరీక్ష కేంద్రాల్లో, ఫిబ్రవరి 29 వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ పరీక్షలు, గురువారం నాడు 12 వ రోజు ద్వితీయ సంవత్సర పార్ట్ 3, కెమిస్ట్రీ2, కామర్స్ 2, (వొకేషనల్) ( సెట్ “బి” ) పరీక్ష ప్రశాంతంగా ముగిశాయని “ఎ “, “బి” పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓ లు సి హెచ్. హే మాచందర్, పి.సాయిబాబా, స్వప్న , పద్మ లు తెలిపారు. ” ఏ ” కేంద్రంలో 236 మందికి 231 మంది హాజరు కాగా 05 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. వొకేషనల్ 22 మందికి గాను 18 మంది పరీక్షకు హాజరు కాగా , 04 గురు గైర్హాజరు అయ్యారు. “బి” కేంద్రంలో 216 మంది విద్యార్థులకు గాను 214 మంది హాజ కాగా ఇద్దరు విద్యార్థులు పరీక్షకు గైర్హాజయ్యారు. రెండు కేంద్రాల్లో కలిపి 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సీఎస్, డీఓ లు తెలిపారు. పరీక్షలను ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా, ఒక్కో విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రం లోనికి పంపించి, పక డ్బందీగా పరీక్ష నిర్వహించడం జరిగిందని సిఎస్, డి ఓ లు తెలిపారు. రెండు కేంద్రాల వద్ద పరీక్ష ముగిసేంత వరకు మత్తమాల పి హెచ్ సి ఆరోగ్య సిబ్బంది అవసరమైన ప్రాథమిక చికిత్సల మందులతో అందుబాటులో ఉన్నారు. ద్వితీయ సంవత్సర (వొకేషనల్ పరీక్ష మినహాయించి) పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ, హుషారుగా ఒకరికొకరు పరీక్షలు ఎలా రాసావు అనే విషయాలు చర్చించుకుంటూ ఇంటికి వెళ్ళారు.