మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ఫిబ్రవరి 23:(తెలంగాణ ఎక్స్ ప్రెస్):మల్లన్న దేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మల్లన్న దేవున్ని వేడుకున్నట్టు మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ మార్కెట్ గల్లీలో ఉన్నటువంటి మల్లన్న కళ్యాణోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జవహర్ నగర్ ప్రజలందరిపై ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని ప్రజలందరూ మల్లన్న దేవుని కరుణాకటాక్షాలు పొందాలని సూచించారు. అనంతరం మల్లన్న దేవుని కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య, జవహర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, నాయకులు ఆలూరు రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ జుట్టా శ్రీవాణి, ప్రధాన కార్యదర్శి రెడ్డి శెట్టి మహేష్ గుప్తా, తదితర బిఆర్ఎస్ శ్రేణులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.