ఎల్లారెడ్డి, డిసెంబర్ 16,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ట్రాన్స్ కో లో ఎలక్ట్రిక్ పనులు చేసే కాంట్రాక్టర్ తన గోదాములో నిలువ ఉంచిన ఎలక్ట్రిక్ వస్తువులు చోరీకి గురైనట్లు సదరు కాంట్రాక్టర్ ఫిర్యాదు చేసినట్లు, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్, సోమవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఎండి ఫరూక్ అహ్మద్ ట్రాన్స్ కో డిపార్ట్మెంట్లో (స్థంబాలు , ట్రాన్స్ ఫార్మర్ ల బిగింపు) ప్రయివేటు కాంట్రాక్టర్ పనులు చేసేవాడని, ఇట్టి పనులకు సంబంధించిన వస్తువులను అతని ఇంటిముందు ఉన్న గోదాములో ఎప్పటి మాదిరిగా ఉంచగా, శనివారం రాత్రి అందాజ 08.00 గంటలకు అతను ముగించుకుని గోదాంకు తాళం వేసి ఇంట్లోకి వెళ్లి భోజనం చేసి పడుకున్నాడు. సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు గోదాం దగ్గరకు వెళ్లి చూడగా తాళం పగలగొట్టబడి తలుపులు తెరిచి ఉన్నవి. అతను లోపలికి వెళ్లి చూడగా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దాదాపు 50,000 రూపాయల విలువ గల వస్తువులు చొరీకి గురైనట్లు గ్రహించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ వివరించారు.
