*మల్లంపేట్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చండి సార్*
నిజాంపేట్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ప్రాంగణంలో ఒంటరి పోరాటనికి దిగినా – యంబరి ఆంజనేయులు , *బాచుపల్లి నుండి మల్లంపేట మాస్టర్ ప్లాన్ రోడ్ ను తక్షణమే పునరుద్ధరించండి.*
*మల్లంపేట్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చండి సార్*
నిజాంపేట్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ప్రాంగణంలో ఒంటరి పోరాటనికి దిగినా – యంబరి ఆంజనేయులు ,
తెలంగాణ ఎక్స్ ప్రెస్ కుత్బుల్లాపూర్ ప్రతినిధి డిసెంబర్ 11
బాచుపల్లి నుంచి మల్లంపేట వారికి ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు సర్వేనెంబర్ 39, 38, 54 మరియు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు నందు అక్రమణాలు తీసేసి తక్షణమే రోడ్డును పునరుద్ధరించాలని హెచ్ఎండిఏ అధికారుల కు 13-11-2024 న నిజాంపేట కమిషనర్ 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిన నిజాంపేట కమిషనర్ చర్యలు తీసుకోకపోవడం పై మల్లంపేట వాసులు యాంబరి ఆంజనేయులు నిజాంపేట్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది. రేపటిలోపు చర్యలు తీసుకోకుంటే ఎల్లుండి నిజాంపేట్ కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని ఎంబరి ఆంజనేయులు, పిసరీ కృష్ణారెడ్డి, ఆకుల సతీష్ హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని మల్లంపేట నుండి బాచుపల్లి వరకు కి తక్షణమే రెవెన్యూ రోడ్డుని మరియు మాస్టర్ ప్లాన్ రోడ్ ని పునరుద్ధరించడం వల్ల ప్రతినిత్యం మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుండి బాచుపల్లి వరకు ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, అధికారులు ప్రజాప్రతినిధులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు అని, లేకుంటే ప్రజాగ్రహాలు చూస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, ఈశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, శ్రీధర్, శ్రీకాంత్ ,లక్ష్మణ్, షోరూం సాయి, మణిదీప్, తదితరులు పాల్గొన్నారు