Home తాజా వార్తలు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 5న నిరసన ర్యాలీ కి పిలుపు

హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 5న నిరసన ర్యాలీ కి పిలుపు

by Telangana Express

నారాయణపేట జిల్లా, ప్రతినిధి, డిసెంబర్ 3 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈ నెల ఐదవ తేదీన గురువారం నాడు ఉదయం 10:30 గంటలకు సుభాష్ రోడ్ లో గల అవధూత మఠం నుండి బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన ర్యాలీకి పెద్ద ఎత్తున హిందూ, బంధువులు యువతి, యువకులు, ముఖ్యంగా హిందూ వ్యాపారస్తులు రెండు గంటల పాటు తమ దుకాణాలను బందు చేసి ర్యాలీలో పాల్గొనాలని, తరలిరావాలని పిలుపునిచ్చిన హిందూ ఐక్యవేదిక. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న నిరంతర దాడులపై అదే కోణంలో ఇస్కాన్ సంస్థను నిషేధించే యోచనలో బంగ్లాదేశ్ పాలకులు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అట్టి ప్రయత్నాలను అరికట్టే అవసరం ఎంతైనా ఉందని హిందూ ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ రాంబాబు అన్నారు. బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ సంస్థ లోని స్వాములను అక్కడ అరెస్టులు చేయడాన్ని ఖండించారు. ఇస్కాన్ సంస్థ కులమతాలకతీతంగా, ప్రాంతీయ ప్రాంతాలకతీతంగా, మనావలికి సేవలు చేస్తున్నప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం కుతంత్రాలు ప న్ని నిషేధించాలని చూస్తుందని అన్నారు. ఇట్టి సంస్థలను కాపాడుకునే బాధ్యత హిందూ ధార్మిక సంస్థలపై ఉందని అన్నారు. హిందువుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కావున హిందూ బంధువులు ఇట్టి నిరసన ర్యాలీకి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిస్తూ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ రాంబాబు, విశ్వహిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్, అఖిలభారత అయ్యప్ప ప్రచార సమితి అధ్యక్షుడు కాకర్ల భీమయ్య, ఆర్ఎస్ఎస్ సంచాలక్ మదన్మోహన్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు శివరాజ్ పాల్గొన్నారు.

You may also like

Leave a Comment