బీబీపేట్ ఫిబ్రవరి 29 :- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) బీబీపేట్ మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనిలో ఎన్ .ఆర్. జి. ఎస్ పథకం కింద మంజూరైన పది లక్షల వ్యయంతో గురువారం సి. సి రోడ్ల నిర్మాణ పనులు స్థానిక మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సుతారి రమేష్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల సంక్షేమం ,అభివృద్ధి పనులే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు .అనేక సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం ,పార్టీ శ్రేణులు. ప్రజల అభీష్టం మేరకే పని చేస్తారని వివరించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భూమాగౌడ్ ,మాజీ ఉప సర్పంచ్ సాయినాథ్ ,కాంగ్రేస్ నాయకులు సలీమ్ ,అమర్ ,మహేష్ ,బాబా ఫాక్రోద్దీన్ ,ఎంపీటీసీ కొరివి నీరజ ,పరుషరాములు ,స్వామి ,తోట రమేష్ ,రవి తదితరులు పాల్గొన్నారు .
సి. సి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం
70