:- ఆర్థిక సహాయాన్ని అందజేసిన దయా హృదయులు నర్వ మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దళిత నాయకుడు దండు అయ్యప్ప,లంకాల్ శ్రీకాంత్ రెడ్డి,లక్కర్ దొడ్డి నరేష్
- మే31( తెలంగాణ ఎక్స ప్రెస్) నర్వ మండల కేంద్రంలోని ఏపీజీవీ బ్యాంకు ఎదురుగా లంకాల్ గ్రామ నివాసి అగు చాకలి అనిల్ కుమార్ గత ఆరు నెలల క్రితం గుడిసెను నిర్మించుకొని దాంట్లో టీ కొట్టు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు అనుకోకుండా మధ్యరాత్రిలో ఈదురు గాలుల వల్ల గుడిసెలో షార్ట్ సర్క్యూట్ అయినందున గుడిసె మొత్తం దగ్దమైనందున చాకలి అనిల్ కుమార్ చాలా ఆవేదన లోనైనందున మండల కేంద్రంలోని దయా హృదయులు నర్వ మండల బి ఆర్ ఎస్ పార్టీ దళిత నాయకుడు దండు అయ్యప్ప తన వంతుగా 10,000/- రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేసి ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారు.అదేవిధంగా నర్వ మండల పరిధిలోని లంకాల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి 10,000/- రూపాయలను తన వంతు ఆర్థిక సహాయంగా అందజేశారు.మండల కేంద్రానికి చెందిన కిరాణా షాప్ యజమాని కోమటి నరేష్ తనవంతు ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలను అందజేశారు.*