మిర్యాలగూడ ఫిబ్రవరి 4 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణం వైదేహి టౌన్షిప్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణ కమిటీ సమావేశంలో భాస్కర్ రావు,మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, ఉద్యమ నాయకులు అన్నబిమోజు నాగార్జున చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్, తెలంగాణ విద్యార్ధి విభాగ ప్రధాన కార్యదర్శి ఏం.డి షోయబ్ లు ప్రసంగించారు.

అంతకుముందు ఇటీవలే మృతి చెందిన మిర్యాలగూడ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కుర్ర విష్ణు ను స్మరించుకొని 2 నిమిషాలపాటు మౌనం పాటించారు..ఈ సందర్భంగా నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ ఈనెల 5 న మిర్యాలగూడ పట్టణంలోని టిఎన్ఆర్ గార్డెన్లో జరగనున్న మిర్యాలగూడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల, ప్రజాప్రతినిధుల సమావేశం విజయవంతం చేయాలని ఆయన కోరారు.నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిదులుగా మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, పాల్గొననున్నారని తెలిపారు, ఈ సమావేశానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు..

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మఖ్దూం పాషా, ఎన్ బిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్, బిఆర్ఎస్ యువ నేత నల్లమోతు సిద్దార్ధ, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాద్యక్షులు బాసాని గిరి, సీనియర్ నాయకులు మధార్ బాబా, ఖాజామొయినుద్దీన్, పట్టణ కౌన్సిలర్లు వంగాల నిరంజన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, వార్డ్ ఇంచార్జిలు, వార్డ్ అద్యక్షులు, ఉపాద్యక్షులు, నాయకులు కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, పూనాటి లక్ష్మీనారాయణ, సాదినేని శ్రీనివాసరావు, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు..