బోధన్ రూరల్,ఆగస్ట్24:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ ను బోధన్ బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు భవానిపేట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బిఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే షకీల్ ను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ వినోద్ నాయక్, శివాలయం మాజీ చైర్మన్ భరత్ యాదవ్,హున్సా ఎంపీటీసీ శివకుమార్, నరేష్, జక్కా సంజీవ్ పటేల్, గణేష్ పటేల్, అల్లాడి దేవా, రవి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే షకీల్ ను కలిసిన బిఆర్ఎస్ యువజన నాయకులు
79