మంచిర్యాల, నవంబర్ 27, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్ గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసే విధానాన్ని ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు వివరించారు. సోమవారం మండలంలోని పొనకల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ దుమాల ఎల్లయ్య ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్, పాత పొనకల్, ఎస్సీ కాలనీలో ఇంటింటా ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ గత తొమ్మిది సంవత్సరాల కాలంలో దేశంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు. పేదలు, ప్రజలు, రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, తదితర పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకవచ్చారన్నారు. రైతులకు వరి ధాన్యం కొనుగోలు కోసం రైతు వేదిక భవనాలను నిర్మించారన్నారు. మహిళల కోసం కెసిఆర్ కిట్టు, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, తదితర పథకాలను రాష్ట్రంలో మహిళల కోసం ప్రారంభించి, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలను పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల వరకు అనేక పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారన్నారు. ప్రస్తుత బిఆర్ఎస్ మినీపోస్ట్ లలో కెసిఆర్ భరోసా, ఎకరాకు యెాటా 16 వేల, వృద్ధులకు 5016 దశలవారీగా, అర్హులైన పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే, అన్నపూర్ణ పథకం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, ఆరోగ్య భీమా 15 లక్షలు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రారంభిస్తారని, ప్రజలకు తెలియజేశారు. నవంబర్ 30న కారు గుర్తుకు ఓటు వేసి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముఖ్య జంక్షన్ నాయక్ ను భారీ మెజార్టీతో గెలుపొందించాలని ప్రజలతో అన్నారు. ఈ కార్యక్రమంలో రాగుల రవి, కుంబాల రాజన్న, దూమల్ల సుధాకర్, పూప్పార్ల ప్రబూదాస్,నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
గ్రామాలలో ఓటు వేసే విధానాన్ని ప్రజలకు వివరిస్తున్న బిఅర్ఎస్ యువ నాయకులు
38