Home తాజా వార్తలు అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ కి పట్టం కట్టాలి

అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ కి పట్టం కట్టాలి

by Telangana Express

కడ్తాల్, నవంబర్ 21
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

తెలంగాణ రాష్ట్రం అవతరించిన 9 సంవత్సరాల కాలంలో మునుపెన్నడూ లేని అభివృద్ధిని చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి మూడవసారి పట్టం కట్టాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. అధికారమే దాహంగా వారంటీ లేని గ్యారెంటీ లతో ప్రతిపక్ష పార్టీలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఐదు సంవత్సరాలుగా కానరాని ప్రతిపక్ష పార్టీలు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి ఓట్ల పండుగతో ప్రయత్నిస్తున్నారని ప్రజలు సరైన సమయంలో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కడ్తాల్ గ్రామ పట్టణ కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు కంబాల పరమేష్ మరియు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ కుమార్తె సంగీత యాదవ్ లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి అభ్యున్నతికి అందించబోయే సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపు తధ్యమని కల్వకుర్తిలో గులాబీ జెండా ఎగిరేది ఖాయమని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గణేష్ గౌడ్, రామచంద్రయ్య, రైతు కోఆర్డినేటర్ నరసింహ, యువజన విభాగం అధ్యక్షుడు ఇర్షద్, పట్టణ అధ్యక్షుడు క్యామ వెంకటయ్య, మూడ రవి, నాగార్జున్,సురేష్,శివ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment