చిగురుమామిడి సెప్టెంబర్ 1
( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
చిగురు మామిడి మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గం లో దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం చేసిన దుండగులను కటినంగా శిక్షించాలని కోరుతూ దానికి నిరసనగా ఎలక్షన్లో ఎలాంటి కుట్రలు హత్య ప్రయత్నాలకు తావివ్వకుండా ప్రశాంతంగా జరిపించాలని తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షులు పెనుకుల తిరుపతి, సుందరగిరి ఎంపీటీసీ మెడబోయిన తిరుపతి, కల్వల రాజేశ్వర్ రెడ్డి, బెజ్జంకి రాంబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు కల్వల సంపత్ రెడ్డి, నాయకులు నాగెల్లి రాజిరెడ్డి, రాచకొండ సంపత్, తదితరులు పాల్గొన్నారు.