ఆగమ శాస్త్ర , మయూరగిరి పీఠాధిపతులు నమలికొండ రమణాచార్యులు..
వీణవంక, ఫిబ్రవరి 14( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాల పల్లి గ్రామంలోని భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసినాయి. మయూరగిరి పీఠాధిపతులు శ్రీ నమిలకొండ రమణాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో ..
తొమ్మిది రోజుల నుండి జరుగుతున్న ఉత్సవాలు అధ్యానోత్సవం, సహస్ర కలశాభిషేకం, పవిత్రోత్సవం, వసంతోత్సవం, శకటోత్సవం, రథోత్సవం, మహా పూర్ణాహుతి, ద్వాదశరాధన, సప్తా వర్ణములతో అద్భుతంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ఒక వేడుకగా జరిగినాయి, పలు గ్రామాల నుండి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి భగవంతుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.. చిన్నజీయర్ స్వామి శిష్యులు, వివిధ ప్రాంతాల పండితులు గ్రామ పెద్దలు, ఆలయ అధ్యక్షులు మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు… దేవాలయ ప్రాంతమంతా మామిడాల పెళ్లి గ్రామం అంతా గోవింద నామస్మరణతో మారుమోగింది.
