పట్టణ కేంద్రంలో సంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలి
మంచిర్యాల, ఫిబ్రవరి 19, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలో ఇరువైపులా డ్రైనేజ్ మరమ్మతు చేపట్టాలని మండల దుకాణ యజమానుదారులు కోరుతున్నారు. స్థానిక జన్నారం మండలంలోని రామాలయం నుంచి బస్టాండ్ గూండా స్థానిక పోలీస్ స్టేషన్ వరకు రెండు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపట్టి శివారు వాగులో మురికి నీరు ప్రవహించే విధంగా చేపట్టాలి. మండల పట్టణంలోని ఇరువైపులా ప్రధాన రహదారి నుంచి ప్రవహించే డ్రైనేజ్ మురికి నీరు వెళ్లకపోవడంతో దుర్గంధంతో, నిండుకొని వివిధ షాపుల యజమానులకి, వ్యాపారాస్తులకి, వినియోగదారులకి ఇబ్బందికరంగా మారింది. జన్నారం మండలంలోని పొనకల్ జన్నారం ప్రధాన రహదారికి రెండు వైపులా ఉన్న డ్రైనేజీ సుమారు ఎడమ కుడివైపు 6 కిలోమీటర్ల మేర పూర్తి సౌకర్యవంతంగా చేయాలని పట్టణవాసులు గత పది సంవత్సరాల కంటే ముందు నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. పట్టణ డ్రైనేజ్ మురికినీరు పోనకల్ ఊర్ర చెరువులోకి వెళ్లకుండా చూడాలి. వాహనదారులకు అనుకూలంగా ఉండడానికి జన్నారం మండల సబ్ స్టేషన్ మొదలుకొని మందపల్లి బస్టాండ్ వరకు సంటర్ లైన్ వేసి మండల ప్రయాణికులకు రహదారి రోడ్డు లైటింగ్ సమస్య పరిష్కారం చేయాలి.