Home తాజా వార్తలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు బిఎల్ఆర్

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు బిఎల్ఆర్

by Telangana Express

మిర్యాలగూడ డిసెంబర్ 4 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయినా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు కల్పించడం జరిగిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. బుధవారం ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడ రాజీవ్ గాంధీ స్టేడియం నుండి నేడు కరీంనగర్ పెద్దపల్లి ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రూప్-4 ఉద్యోగ నియామక పత్రాలు అందుకునేందుకు ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారు వెళ్లనున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హరిబాబు, ఎంఈఓ బాలునాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, దామరచర్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment