నర్వ పురవీధుల్లో కాషాయపు మయం.
నర్వ అంబేద్కర్ కూడలిలొ సాగలైలమ్మ విగ్రహం కూడలిలో కాషాయపు మయం.
నర్వ మండల్ డిసెంబర్ 14 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నర్వ మండల కేంద్రంలో మరియు
నర్వ మండల పరిధిలోని కల్వాల్ గ్రామంలో.ఉదయం 10:30 గంటలకు మొదలుకొని భూత్ కమిటీ మరియు మండల కమిటీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా నారాయణపేట జిల్లా ఇంచార్జి చింతల రామచంద్రారెడ్డి విచ్చేసిన శుభ సందర్బగాముగా పైన నూతనంగా ఎన్నికైన భూత్ కమిటీ సభ్యులు, మండల పదాధికారులు, మండల అధ్యక్ష బాధ్యతలు కావాలనుకునే బీజేపీ నాయకులూ, కార్యకర్తలు పెద్ద ఎత్తున నర్వ మండల కేంద్రంలో హాజరు కావడం జరిగింది , ఇట్టి కార్యక్రమాన్ని నర్వ మండల కేంద్రంలో బూత్ అధ్యక్షులు 263 264 265 ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన అధ్యక్షులను ఉపాధ్యక్షులను నర్వ మండల కేంద్రంలో పురవీధుల్లో తిరుగుతూ వారిని ఎద్దుల బండి పై ఊరేగింపుగా తప్పెట్లపై డోలు వాయిస్తూ.వారి ఇంటి దగ్గరికి తీసుకు వెళ్లడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జెండా వారి ఇంటిపై ఎగరవేయటం జరిగింది. మరియు అంబేద్కర్ విగ్రహానికి మరియు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వెయ్యడం. జరిగింది .ఇట్టి కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీను. మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి మరియు నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూర్ భాస్కర్ బీజేపీ మండల నాయకులు , బూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
