Home తాజా వార్తలు ఎంపీడీవో ను సన్మానించిన బిజెపినాయకులు

ఎంపీడీవో ను సన్మానించిన బిజెపినాయకులు

by Telangana Express

ఏన్నిల నాగేందర్ కందూర్ కనకయ్య

కుబీర్ ఫిబ్రవరి-: 21 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) కుబీర్ మండల అభివృద్ధికి కృషి చేయండి
బదిలీపై వచ్చిన అధికారులకు సన్మానించిన బిజెపి నాయకులు
స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలతో కుభీర్ మండల అభివృద్ధికి కృషి చేయాలని బిజెపి సీనియర్ నాయకులు ఎన్నిల నాగేందర్, కందుర్ కనకయ్య లు ఎంపీడీవో కు సూచించారు. ఇటీవల బదిలీపై వచ్చి కుభీర్ ఎంపీడీవో గా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. కాగా బుధవారం బిజెపి నాయకులతో కలిసి ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కుభీర్ మండలం అభివృద్ధి చెందలేదని అన్నారు. అభివృద్ధిలో వెనుకబడి ఉన్న కుభీర్ మండలాన్ని స్థానిక ఎమ్మెల్యే, మండల ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో చెత్తాచెదారం పేరుకుపోకుండా ప్రతిరోజు శానిటేషన్ పనులు జరిగేలా చూడాలని అన్నారు. అదేవిధంగా జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి వంద రోజులు పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చేసిన పనులకు అనుగుణంగా కూలీలకు డబ్బులు చెల్లించేలా చూడాలని అన్నారు. అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్ కు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. స్పందించిన ఎంపీడీవో మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామాలలో ఏ సమస్య ఉన్న ఆఫీసుకు వచ్చి సమస్య విన్నవిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు ఏశాల దత్తాత్రి, కందుర్ చిన్న సాయినాథ్, గంగ శేఖర్, డాక్టర్ గణపతి, బోడికే రోహిత్, ఉప్పు శంకర్ తదితరులున్నారు.

You may also like

Leave a Comment