సీఎం,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల జీతాలు పెంచిన కెసిఆర్, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు ఎందుకు పెంచవు…? బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహాల్లద్ రావుకుల్కచర్ల, జూలై 26, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బిజెపి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో గల స్థానిక ఎంపీడీవో ఆఫీస్ దగ్గర నిరసన దీక్ష నిర్వహించారు. గత 22 రోజుల నుంచి గ్రామపంచాయతీ కార్మికులు తమ హక్కుల సాధన కోసం సమ్మె చేస్తున్నారని,బుధవారం బిజెపి ఆధ్వర్యంలో కులకచర్ల లో నిరసన దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహాల్లద్ రావు, మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ ముదిరాజ్, ఓ బి సి జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర లింగం మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీ కార్మికుల పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా చెస్తుందని అన్నారు. దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు పెంచినప్పుడు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచడంలో ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటి అని వారు ప్రశ్నించారు, ఈ దేశంలోనే అత్యధికంగా వేతనాలు తీసుకునే కెసిఆర్ ,మంత్రులు, ప్రజాప్రతితులు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు, కరోనా సమయంలో గ్రామపంచాయతీ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రెడ్ జొన్ లోకి వెళ్లి ప్రజల ప్రాణాలు కాపాడడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని వారు అన్నారు. కరోనా సమయంలో గ్రామపంచాయతీ కార్మికులను దేవుళ్లతో సమానంగా పోల్చిన కేసీఆర్ ఓడ్డు ఎక్కిన తర్వాత గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కరోనా సమయంలో వివిధ రకాల కార్మికులు ప్రాణాలు సైతం కోల్పోయారని వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రోడ్డు మీద పడ్డాయని వారి కుటుంబాలను గుర్తించి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గ్రామపంచాయతీ కార్మికులు అగ్రభాగాన ఉన్నారని స్వరాష్ట్రంలో పంచాయతీ కార్మికులను పట్టించుకునే నాధుడే లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పిఆర్సి ప్రకారం కనీస వేతనం 19వేల రూపాయలు చెల్లించాలని కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై వేధింపులు, అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తావని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలకృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్ హనుమంతు, బిజెపి ఓబీసీ మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్, మండల ట్రెజరర్ కొండ అంజి, గండి గోపాల్, చాపల మల్లయ్య పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు పి యాదయ్య, పాటు తదితర నాయకులు.కార్యదర్శి రాములు, గౌరవ అధ్యక్షులు హనుమంతు, ఉపాధ్యక్షులు దండు వెంకటయ్య, కార్వబర్స్ , జి వెంకటేష్, శ్రీనివాస్, రమేష్, నరేష్, శేఖర్, పంచాయతీ కార్మికులు కొడుదుటి బాలమ్మ, గుంటి నర్సింలు, యాదయ్య,వెంకటమ్మ,షకీల్,కార్మికులు పాల్గొన్నారు.
కులకచర్లలో పంచాయతీ కార్మికుల ధర్నాకు మద్దతుగా బిజెపి
30
previous post