Home తాజా వార్తలు రెడ్డిపల్లి లో బీజేపీ ఇంటింటి ప్రచారం

రెడ్డిపల్లి లో బీజేపీ ఇంటింటి ప్రచారం

by Telangana Express

దుబ్బాక అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే రఘునందన్ రావు తోనే సాధ్యమన్న బిజెపి నేత వెంగళరావు

చేగుంట నవంబర్ 27:—-
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)/చేగుంట: చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సోమవారం రోజున గ్రామ సర్పంచ్ లక్ష్మి జ్ఞానేశ్వర్, ఎంపీటీసీ శంబుని రవి, మాజీ సర్పంచ్ బాలచందర్, మాజి సొసైటీ చైర్మన్ వెంగళ్ రావు, మాజి ఎంపీటీసీ హరింకర్,సోసైటీ వైస్ చైర్మన్ అంజనేయులు తో పాటు గ్రామ అద్యక్షులు, నాయకులు తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి, అదే విదంగా రాష్ట్రంలో పార్టీ అదికారంలోకి వస్తే చేపట్టే పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, నాయకులు, తదితరులు పాల్గోన్నారు.

You may also like

Leave a Comment