కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి
వీణవంక, నవంబర్ 8( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో బుధవారం ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా వీణవంక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, అరటి పండ్లు పంపిణీ చేస్తూ ఘనంగా జరుపుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,రాజకీయ చతురత కలిగిన ఏకైక రాజకీయ నాయకుడ ని, తెలంగాణలో నికార్సైన రాజకీయ నాయకుడని, ఆనాటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నుండి, ఇప్పటి కాంగ్రెస్ సోనియా గాంధీ వరకు రేవంత్ రెడ్డి రాజకీయ చతురతను చూసి ప్రశంసించిన వాళ్లేనని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తేవడానికి చాలా కృషి చేస్తూ,రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుపొందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి , బిసి సెల్ అధ్యక్షులు వీరయ్య , ఎస్సీ సెల్ అధ్యక్షులు మాదాసి సునీల్, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు అజయ్ , గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ది సంపత్ రెడ్డి, యాదగిరి, ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సంపత్,తిరుమలేష్,గడ్డం కుమార్, రషీద్, సమ్మిరెడ్డి, నాగిడి రాంరెడ్డి,సుకాసి చంద్రయ్య, గాజుల సంపత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ యూత్ నాయకులు సురేందర్ రెడ్డి, దిలీప్, హరీష్ రెడ్డి, అజయ్, గణేష్, అజయ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.