మంచిర్యాల, ఏప్రిల్ 08, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశం రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడారు. పెద్దపెల్లి పార్లమెంటరీ ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యేలను అందరినీ ఏకం చేసి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలిపిస్తామని తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశంలో ఏడు నియోజకవర్గ శాసనసభ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెద్ద పెళ్లి పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
41
previous post