Home తాజా వార్తలు మిర్యాలగూడలోబిఆర్ఎస్కు భారీ షాక్

మిర్యాలగూడలోబిఆర్ఎస్కు భారీ షాక్

by Telangana Express

👉 *పార్టీ మండల అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి చినరామయ్య రాజీనామా*
👉 *కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయానికి కృషి చేస్తా*

మిర్యాలగూడ ఏప్రిల్ 01 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని  అడవిదేవులపల్లి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు కూరాకుల చిన రామయ్య ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టు అయింది. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిన రామయ్య మాట్లాడుతూ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తో 40 సంవత్సరాలు నుంచి తనకు అనుబంధం ఉందని జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో జానారెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం క్రియాశీలకంగా పని చేసేందుకు తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, అనుబంధంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందు రఘువీర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి తాను కృషి చేస్తానని కూరాకుల చిన రామయ్య ప్రకటించారు. బిఆర్ఎస్ పార్టీలో తొలి వికెట్ పడిందని రాబోయే రోజుల్లోనే బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియ వచ్చింది. ఆయన వెంట పి. చెన్నకేశవులు సిహెచ్. సైదయ్య తదితరులున్నారు.

You may also like

Leave a Comment