బిచ్కుంద జనవరి 30( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ప్రొఫెసర్ సునీల్ హండ అహ్మదాబాద్ మరియు బెంగళూర్ ఐఐఎం ప్రొఫెసర్ మరియు ఏకలవ్య ఫౌండేషన్ ఫౌండర్ గారి ఆధ్వర్యంలో ఏకలవ్య ఫౌండేషన్ అహ్మదాబాద్, గుజరాత్ వారు నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాంకు మన రిపుల్స్ పాఠశాల ఫౌండర్ మరియు స్కూల్ లీడర్స్ సెలక్ట్ అవ్వడం జరిగింది.
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు దేశంలోనే అత్యుత్తమ పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది అందులో మన రిపుల్స్ పాఠశాల కూడా సెలెక్ట్ అవ్వడం మనందరం గర్వించదగ్గ విషయం
రిపుల్స్ టీం వారు ఏకలవ్య స్కూల్ సందర్శన మరియు శిక్షణ ప్రోగ్రాంలో పాల్గొన్నారు దీనిద్వారా అడ్వాన్స్డ్ స్కూల్ లీడర్షిప్ స్కిల్స్ మరియు ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ప్రణాళికలను నేర్చుకోవడం జరిగింది. త్వరలోనే ఇవి పిల్లలకు ఉపయోగపడేలా పాఠశాలలో అమలు చేస్తామని ఫౌండర్ అనిల్ కుమార్ గారు చెప్పడం జరిగింది