ప్రతిష్టాపన ఉత్సవాలకు 25 వేల ఆర్థిక విరాళం అందజేసిన యుఫ్ టీవీ సీఈవో ఉదయ్ రెడ్డి..
ఘనంగా సన్మానించిన గ్రామస్తులు…
వీణవంక, ఫిబ్రవరి 24( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోశ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, సహిత పోచమ్మ దేవతా ప్రతిష్టాపన మహోత్సవంలో యుఫ్ టి వి సీఈఓ పాడి ఉదయ నందన్ రెడ్డి శనివారం పాల్గొని,ప్రత్యేక పూజలు జరిపి, అనంతరం బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలకు 25,000/- అక్షరాల ఇరువై ఐదు వేల రూపాయలను విరాళంగా మహోత్సవానికి అందజేశారు. అలాగే బ్రాహ్మణపల్లి గ్రామమాజీ సర్పంచ్ గాజుల ప్రసన్న, గ్రామస్తులు,మాజీ ప్రజా ప్రతినిధులు
పాడి ఉదయ నందన్ రెడ్డి ని శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలోబ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ గాజుల ప్రసన్న, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య ,ముడిక కుమార్,అమ్ముల రాజు,మహ్మద్ హకీమ్,రెడ్డి శరత్ రెడ్డి,మండల కొమురయ్య,గాజుల రాము,కడా రాజకొమురయ్య, బినవేన రాజయ్య,ఏడెల్లి వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
