Home తాజా వార్తలు భీమాబాయిని ఆదర్శనంగా తీసుకోవాలి

భీమాబాయిని ఆదర్శనంగా తీసుకోవాలి

by Telangana Express


తెలంగాణ. ఎక్స్ ప్రెస్ 27/02/24
భైంసా మండలము కేంద్రం లో నీ
భారత రాజ్యాంగ రూపశిల్పి విశ్వరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ మాతృమూర్తి భీమాబాయి అంబేద్కర్ ను మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భైంసా అధ్యక్షులు ప్రసంజీత్ హేమ్లే అన్నారు భైంసాలోని ఏ.పి.నగర్, రాహుల్ నగర్ మైత్రేయ బుద్ధ విహార్ లో మంగళవారం రోజున బిఎస్ఐ బైంసా శాఖ ఆధ్వర్యంలో సుభేదార్ రాంజీ మలోజీ సక్పాల్ అంబేద్కర్ సతీమణి మహామాత భీమాబాయి అంబేద్కర్ 128 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా మహనీయురాలు భీమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంత్ కబీర్ బోధనలతో ప్రభావితం అయిన ఒక సైనిక కుటుంబంలో భీమాబాయి ఉన్నతమైన సంస్కారవంతురాలు రామ్ జీ సక్పాల్ మాలోజీ అంబేద్కర్ కూడా ఉన్నత సంస్కారం గల వ్యక్తి కష్టించి పనిచేసే గుణం అంబేద్కర్ తల్లిదండ్రులు యొక్క గుణాలే డా. బాబాసాహెబ్ అంబేద్కర్ కు వచ్చాయి మనది మాతృస్వామ్య వ్యవస్థ గల సమాజం ఈ మాతృస్వామ్య విధానం లో విలువలు, ప్రేమ ,నీతి,దయ ,జాలి ఉంటాయి బాల్యంలోనే డా. భీమ్ రావ్ అంబేద్కర్ తన తల్లిని కోల్పోయారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో దుక్ఖంతో తనను తాను వెలిగించుకున్న సూర్యుడు అంబేద్కర్ తండ్రి ఎంతో గొప్పగా తన తనయుడిని తీర్చిదిద్దారు తల్లిదండ్రులు యొక్క ప్రభావం వారు పెరిగి పెద్ద అయ్యేవరకు ఉంటుంది నేటి కుటుంబాలు అంబేద్కర్ తల్లిదండ్రులు నుండి ఎంతో ప్రేరణ పొందాలి పిల్లలను ఎలా పెంచాలో అంబేద్కర్ తల్లిదండ్రులను చూసి నేర్చుకోవాలని కోరారు భీమాబాయి అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్ఐ భైంసా అధ్యక్షులు ప్రసంజీత్ హేమ్లే, దమ్మనంద్ దేవ్కే, రాందాస్ వాగ్మారే, అనిత గాయక్వాడ్, ఏక్ నాథ్ బిరదే, జల్బ వానేకర్, గణేష్ హేమ్లె, రమాబాయి, దారు బాయి, సంగీత బాయి,బౌద్ధ ఉపాసిక, ఉపాసకులు మరియు మాజీ శ్రామినర్, బౌద్ధాచార్యులు, కేంద్రీయ శిక్షకులు, బౌద్ధ దమ్మ అభిమానులు,పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment