తెలంగాణ ఎక్స్ ప్రెస్ 18/01/24
భైంసా మండలం కేంద్రం లో ని
దేశం మొత్తం రామనామ జపముతో భక్తి పారవశ్యంతో తేలియాడుతూ ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రమి నిర్మల్ జిల్లా బైంసాకి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త అరవింద్ మహిషా ( భైంసా ) అదిలాబాదు నుండి అయోధ్య వరకు గత నెల డిసెంబర్ 13వ తేదీన తీ స్రి బార్ (మూడోసారి) మోడీ సర్కార్ అనే నినాదంతో పాదయాత్ర ప్రారంభించారు.
అనేక ఇబ్బందులు ఎదురైనా ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా శ్రీరామనామ జపంతో ముందుకెళ్లి జనవరి 12న తేదీన శ్రీరాముడు చెంత అయోధ్యకు చేరుకున్నాడు.
అరవింద్ మాట్లాడుతూ మూడోసారి మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని కావాలి అని భారతదేశం సుభిక్షంగా ఉండాలి అను బలమైన ఆకాంక్షతో ముందుకు కదిలాను అని తెలిపారు అలాగే భారతదేశములో నరేంద్రమోడీ నాయకత్వములో 400 పార్లమెంట్ స్థానాలకు పైగా అలాగే తెలంగాణలో కిషన్ రెడ్డి నాయకత్వములో 10 స్థానాలకు పైగా రావాలి మనస్ఫూర్తిగా సీత రామ సమేత అయోధ్య రామచంద్రున్ని కోరుకున్నాని తెలియజేశారు.
అయోధ్య వరకు పాదయాత్ర చేసిన యువకుడిని పలువురు అభినందించారు.
జై శ్రీరామ్ జైజై శ్రీరామ్.
భైంసా యువకుడి అయోధ్య పాదయాత్ర దిగ్విజయం
56