Home తాజా వార్తలు బీసీ చెక్కులను రిటర్న్ తీసుకోవాలె

బీసీ చెక్కులను రిటర్న్ తీసుకోవాలె

by Telangana Express

నిర్మల్ జిల్లా ప్రతినిధి ఆగస్టు 25 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ); బీసీ బంధు పథకం కింద అనర్హులకు ఇచ్చిన చెక్కులను వెంటనే రిటర్న్ తీసుకోవాలని జనసేనా పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ కులవృత్తిదారులతో కలిసి భైంసాలో ఆర్డీవో కోమల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గతంలో బీసీ కార్పోరేషన్ ద్వారా లోన్లు పోందిన వారికి బీసీ బంధు చెక్కులు ఇచ్చారన్నారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తన అనుచరులకు మాత్రమే రూ. లక్ష చెక్కులు ఇవ్వడం సరికాదని, అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని యేడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలా మంది పేద కులవృత్తిదారులు ఒక్కోక్కరు రూ. వెయ్యి ఖర్చు చేసి దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో గంగాప్రసాద్, బ్రహ్మయ్య, భూషణ్, దత్తురాం, రమేష్, విక్రమ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment