Home తాజా వార్తలు బిఎల్ఆర్ ను గెలిపించాలని గడపగడపకు బత్తుల మాధవి విస్తృత ప్రచారం..వార్డులలో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు…

బిఎల్ఆర్ ను గెలిపించాలని గడపగడపకు బత్తుల మాధవి విస్తృత ప్రచారం..వార్డులలో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు…

by Telangana Express

మిర్యాలగూడ నవంబర్ 15 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి( బిఎల్ఆర్) ను హస్తం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బిఎల్ఆర్ సతీమణి బత్తుల మాధవి, కాంగ్రెస్ కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు బుధవారం పట్టణంలోని పలు వార్డులలో పాదయాత్ర నిర్వహించి గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల కరపత్రాలని అందజేశారు.

పట్టణంలోని ఏడుకోట్ల తండా రాజీవ్ నగర్ రామచంద్ర గూడెం భాగ్యనగర్ కాలనీ టీచర్స్ కాలనీలలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎల్ఆర్ ను ఓటేసి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. బత్తుల మాధవికి ప్రచారం వెళ్ళినా పలు వార్డులలో హారతులు ఇచ్చి…

తిలకం దిద్ది.. ఆయా వార్డు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల మధ్య ఆటపాటలతో పలు కాలనీలలో ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి, క్రికెటర్ జానీ, నాగలక్ష్మి, చల్ల నాగమణి,మాజీ కౌన్సిలర్ రమేష్ నాయక్, పాతూరి ప్రసాద్, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, పట్టణ మహిళా మాజీ అధ్యక్షురాలు మేడ సుచరిత రెడ్డి, ఆవుల రజిత దేవేందర్ రెడ్డి, సరికొండ మేఘన, మేడ కవిత, గార్లపాటి పద్మ, జొన్నలగడ్డ సరిత, సుజాత, కవిత, నిర్మల, అనిత, లక్ష్మి, రమావత్ మనీ, లక్ష్మీ రవి, ప్రియాంక, ధనావత్ కృష్ణ, సైదా, రాజు, మోహన్, ఉపేందర్, బక్కయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment