Home తాజా వార్తలు వెల్గటూర్ మండల కేంద్రంలోఆంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ

వెల్గటూర్ మండల కేంద్రంలోఆంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ డిసెంబర్ 15

వెల్గటూర్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో స్థానిక అయ్యప్ప మాల ధారణ స్వాములు ఆదివారం చేపట్టిన సామూహిక అయ్యప్ప పడిపూజ వైభవంగా జరిగింది. ధర్మపురి పట్టణానికి చెందిన శ్రీ పెండ్యాల బాలకృష్ణ గురుస్వామి బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప సామూహిక పడిపూజ ను కన్నులు పండువగా జరిపించారు. అందంగా అలంకరించిన వేదికపై అయ్యప్ప విఘ్నేశ్వర స్వామి, సుబ్రమణ్య స్వామి పూజలను వేద మంత్రాల న డుమ గురు స్వామి వైభవంగా జరిపించారు. ఈ పడి పూజ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు .స్వామి వారి పడిపూజ అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు నిర్వహించిన సంగీత కార్యక్రమం భక్తులను బాగా ఆకట్టు కుంది. ఈ పడిపూజ మహోత్సవంలో పొనుగొటీ రాం మోహనరావు, గోలి రత్నాకర్, శ్రీకాంతరావు, గండ్ర వసంతరావు మెరుగు మురళి మెరుగు నరేష్, ఉదయ్ సందీప్ రెడ్డి రేగొండ రామన్న, బీరెల్లి శ్రీనివాస్, గురు స్వాములు పెద్ది శ్రీనివాస్, నరేష్ తదితరులు ఉన్నార

You may also like

Leave a Comment