ఎల్లారెడ్డి, డిసెంబర్ 13,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని అడివి లింగాల గ్రామంలో, శుక్రవారం మధ్యాహ్నం సాయిరెడ్డి స్వామి స్వగృహంలో అయ్యప్ప పడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి కొండంబోట్ల రాజేశ్వర్ రావు శర్మ పంతులు సాయిరెడ్డి స్వామిచే పడి పూజను శాస్త్రోక్తంగా చేయించారు. స్వామి వారి దివ్య మంగళ విగ్రహానికి పది రకాల అభిషేకాలు చేయించి, పదినెట్టంబడి 18 మెట్లకు పడి పూజలు చేసి, పడి పై కర్పూర జ్యోతులు వెలిగింపజేసి మంగళ హారతులతో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. స్వామి వారికి అభిషేకాలు చేస్తున్న సమయంలో అయ్యప్ప స్వాముల భజన పాటలతో మార్మోగింది. అనంతరం అయ్యప్ప మాలా ధార స్వాములకు భిక్ష (ఆన్న ప్రసాదం) ఏర్పాటు చేశారు. పడి పూజ కార్యక్రమానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి మాలాధార స్వాములతో పాటు వెల్లుట్ల గ్రామ సంతోష్ పంతులు, ఎల్లారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయ పూజారి ముత్యాల శ్రీనివాస్ రావు పంతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురు స్వాములు ముదిగొండ చంద్రం స్వామీ, హన్మంతప్ప స్వామి, బొందుగుల నాగేశ్వర్ రావు స్వామి, రాజేందర్ నాథ్ స్వామి, కృష్ణారెడ్డి స్వామి, శ్రీనివాస్ గౌడ్ స్వామి, ఓర భీమన్న స్వామి, డాక్టర్ సాయిలు స్వామి, యాదగిరి స్వామి, కన్నె స్వాములు, తదితర స్వాములు, తదితరులు పాల్గొన్నారు.
