ఎల్లారెడ్డి, డిసెంబర్ 12,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయం నుంచి, పాదయాత్రగా అయ్యప్ప మాలాధార స్వాములు డిసెంబర్ 1 వ తేదీన సువర్ణభూమి మహా పాదయాత్ర, బాన్సువాడ వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రం లోని శబరి మలకు బయలు దేరినట్లు స్వాములు తెలిపారు. మంగళవారం 12 వ రోజున కర్నూలు సమీపంలోని
జలాపూర్ గ్రామం చేరు కోవడం జరిగిందని , మధ్యాహ్నం అక్కడే పడిపూజ ముగించుకుని, రాత్రికి జోగులాంబ శక్తిపీఠంకు చేరుకుంటుందని పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములు ఫోన్ లో విలేఖరులకు తెలిపారు. ప్రతి రోజు 35 నుంచి 40 కిలోమీటర్లు నడవడం జరుగుతోందని స్వాములు తెలిపారు. పాదయాత్రలో బాలరాజు గౌడ్ , ఈశ్వర్ గౌడ్, ఆకుల కిష్టయ్య , భీమ్ రెడ్డి, వీరేందర్ గౌడ్ స్వాములతో పాటు ఇతర స్వాములు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నుంచి 9 మంది అయ్యప్ప మూలాధార స్వాములు పాదయాత్రలో పాల్గొన్నారు. జనవరి 11 తేదీ 2024 నాడు 1400 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేరళ రాష్ట్రం లోని శబరిమలకు చేరుకుని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునీ ఇరుముడి సమర్పించడం తో పాదయాత్ర సంపూర్ణమ వుతుందని స్వాములు తెలిపారు .