Home తాజా వార్తలు పోతిరెడ్డిపల్లి లో పండుగలాగాఅయోధ్య రామ మందిర అక్షింతల పంపిణీ

పోతిరెడ్డిపల్లి లో పండుగలాగాఅయోధ్య రామ మందిర అక్షింతల పంపిణీ

by Telangana Express

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి.

వీణవంక, జనవరి 16( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం లో మంగళవారం కనుమ పండుగ పురస్కరించుకొని, అయోధ్య నుండి శ్రీరాముని అక్షింతలు రావడం జరిగింది. అలాగే ఇంటింటికి అక్షింతలు అందజేయడం జరిగింది.
గ్రామం లోని సీతారామాంజనేయస్వామి దేవాలయం నుండి పార్టీలకు అతీతంగా డీజే పాటలతో,మంగళహారులతో మహిళలు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు.అనంతరం బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… అఖండ భారత అవని ఎన్నో ఏళ్లుగా హిందువులంతా మహా యజ్ఞంగాభావించే,అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం చేపట్టిన నాటినుండి కండ్లు కాసేలాగా ఎదురుచూస్తున్న భారతదేశ హిందూ పౌరులకు అఖండ జగతిలో జనవరి 22న శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ట కాబోతున్నాడని సంతోషిస్తూ, అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పంపీయడం ప్రజలు సంతోషంగా ఉన్నారు.
భారతదేశంలో ప్రజలంతా సుభిక్షంగా,ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతారని,మన గ్రామ వాసుల మందిరం శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు ముందు జనవరి 20 నుండి జనవరి 24వ తేదీ వరకు ప్రతి ఒక్కరి గృహంలో ఐదు రోజులు 5 దీపాలు వెలిగించాలని,శ్రీరామ మందిరంతో దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుందని, శ్రీరామ జపం చేస్తూ,నిత్యం శ్రీరాముని స్మరించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి , గ్రామ సర్పంచ్ పంజాల అనూష సతీష్ , వార్డ్ సభ్యులు వొల్లాల శ్రీకాంత్, గజ్జెల శ్రీకాంత్, చేపురి రాజు, తిప్పని సమ్మయ్య,హరీష్ రెడ్డి, రాపర్తి అఖిల్,సాగర్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment