Telangana Express
Telangana Express
Telangana Express is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry. *(Printed, Published and Owned by Chinthala Neelakantam Printed at Ritesh Printers,H.No.5-178, SC Colony,NARNOOR Village & Mandal, Adilabad.District, TELANGANA STATE, AND Published from H.NO. 5-178, SC Colony NARNOOR, ADILABAD DISTRICT -0504311. TELANGANA STATE, EDITOR: CHINTHALA. NEELAKANTAM RNI NO. TELTEL /2014/57821. PHONE NO.9010002679 , 8008801151, E-mail: Telanganaexpress521@gmail.com)*
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 13/03/25
బైంసా:

: శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో టీం ఆశ్రయ (TEAM ASRAYA) ఫౌండేషన్ కు చెందిన కేదారినాథ్ శరణ్య రూ.యాభై విలువైన ఎల్.ఈ.డి టీవీ ను బహూకరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది శ్రీ ఠాకూర్ రవీందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, ఎల్ ఇ డి టీవీలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యార్థులకు తెరపాఠం పరిపుష్టమవుతుందని, బోధనలో చిత్రాలు, వీడియోల ద్వారా సమగ్ర అవగాహన కల్పించడం విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా బోధన విద్యార్థులకు త్వరగా నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు.
అంతేకాకుండా, శ్రీ సరస్వతీ శిశు మందిరాలు క్రమశిక్షణకు నిలయాలని, విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుండాలని, విలువలతో కూడిన విద్య అందించడం ద్వారా సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో విభాగ్ సహా కార్యదర్శి సరుకొండ దామోద, పాఠశాల నిర్వాహక సభ్యులు నూకల సురేష్, శివకుమార్ బచ్చు వార్, బన్నెల్లి సుదర్శన్, పి. కాశీనాథ్, జిలకరి రాజేశ్వర్, దర్బార్ శ్రీశైలం, సాయినాథ్ గుజ్జులవార్, గుజ్జులవార్ లక్ష్మణ్, ప్రాంత సంగీత ప్రముఖ్ సాయినాథ్ పాఠశాల ప్రధానాచార్యులు గంగాధర్, పోషకులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంతేకాదు, టీం ఆశ్రయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, అధికారులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. సేవా గుణాన్ని అలవర్చుకోవడం ద్వారా సమాజ సేవను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి అనే సందేశాన్ని వక్తలు అందరికీ అందించారు.
బండ రామేశ్వర్ పల్లి వాగు నుండి అక్రమ ఇసుక మూడు ట్రాక్టర్లు సీజ్ కేసు నమోదు ఎస్సై అనిల్
మాచారెడ్డి తెలంగాణ ఎక్స్ ప్రెస్ మార్చ్ 13
అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసుల
గురువారం బండ రామేశ్వర్ పల్లి వాగులో నుండి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు మూడు ట్రాక్టర్లను సీజ్ చేశామని కేసు నమోదు చేశామని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించడం జరిగింది కరీంనగర్ కామారెడ్డి వెళ్లే రహదారి వెంబట ఉన్నటువంటి వాగులో నుండి అక్రమంగా తరలిస్తే కేసులు తప్పవు అని ఆయన హెచ్చరించారు
అధికారులకు కనిపించడం లేదా చూసి చూడనట్టు ఊరుకొంటున్నారా.?
ప్రభుత్వ స్థలంలో ఎకరాలకు ఎకరాలు మొరంతవి అమ్ముకున్న పట్టించుకునే నాధుడే లేడా.?
తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ మార్చ్ 13
కామారెడ్డి జిల్లాలో స్మాల్ ఇండస్ట్రీ తో రిజిస్ట్రేషన్స్ లేకుండా అక్రమంగా మొరం తవ్వుతూ మొరం తవ్విన స్థలంలో ఇతర గ్రామాల నుండి చెరువులో నుండి మట్టి తెచ్చి ఉనక బూడిద, కరెంటు ఉత్పత్తి చేయగా వచ్చినటువంటి బూడిదను ట్రక్కుల ద్వారా కొనుగోలు చేసిన బూడిదకు జిఎస్టి ఉంటుందా లేదా అనేది కొసమెరుపు చెరువులో నుంచి తీసుకొచ్చిన మట్టిలో కలిపి తేలికపాటి ఇటుకలను తయారు చేయడం జరుగుతున్న వ్యవహారం దీనికి తోడుగా ఎలాంటి అనుమతులు ఉండవు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పర్మిషన్ రిజిస్టర్ అయి ఉండాలి అనంతరం ఎక్కడైతే ఇటిక బట్టి పెట్టాలి అనుకుంటే ప్రైవేటు వ్యవసాయ భూమి అయినా నాలా కన్వర్షన్ అనేది ఉండాలి నాలా కన్వర్షన్ ఉండి లేబర్ లైసెన్స్ ఉండి ఉండాలి సీనరీ చార్జ్ అనేది ఒకటి ఉంటుంది అని మరిచిపోతున్న ఇటుక బట్టి యజమానులు అధికారులు అన్నింటికంటే ముందుగా గ్రామ పంచాయితీ అనుమతులు ఉంటేనే ఇటికబట్టి నిర్వహణ అనేది ఉండాలి అనేది గత పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జీవోను రద్దుచేసి నా ప్రభుత్వాలు ఉన్నాయి కానీ రద్దు చేసినటువంటి జీవోను అన్నింటికీ అనుసంధానం తహసీల్దార్ కార్యాలయం తాసిల్దార్ కార్యాలయం ద్వారా నాలా కన్వర్షన్ తీసుకొని ఇటుక బట్టి నిర్వహణ చేయాలి కానీ అలాంటివి కామారెడ్డి జిల్లాలో పాలవంచ మండలం లో కనిపించడం లేదు పాలవంచ మండలంలో అధికారులకు అన్ని కనిపించిన చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్న దృశ్యం కంటికి కనిపిస్తున్నాయి పాలవంచ మండలం భవానిపేట్ శివారు భవానిపేట్ తండా ఆనుకొని 769 సర్వే నెంబర్లు సిరిసిల్ల రోడ్ నుండి 200 మీటర్లు దూరంలో అంతా ఇటుక మాఫియా ప్రతి పరంపోగు భూముల్లో ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నాలా కన్వర్షన్ అనుమతులు తీసుకోకుండా ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇటుక బట్టి తయారీ చేయడం కోసమేరుపు ఇది ఈతంగమంతా గతంలో ఉన్నటువంటి తహసిల్దార్ శ్రీనివాస్ నాటినుండి జరుగుతున్నటువంటి మాఫియా ఆనాడు ఆ తహసిల్దార్ సస్పెండ్ కావడం కూడా జరిగింది అక్రమ మొరం తవ్వకాలలో కీలకంగా వ్యవహరించిన తహసిల్దార్ ఆనాటి శ్రీనివాస్ చేసినటువంటి ఈ అక్రమ మొరం దందా నేటికి ఆగడం లేదు అక్రమ ఇటిక తయారీ ఆగడం లేదు అనే ప్రజలు లబోదిబోమంటున్నారు ఎటు చూసినా పొగ తండాలలో నివాసం ఉండడం కష్టమైపోతుంది పొలాలలో పంట పండిద్దాం అనుకుంటే పంట ఆకులపై మొత్తం బూడిద నిండిపోతుంది అని వ్యవసాయదారులు లబోదిబోమంటున్నారు ఇకనైనా అధికారులు ప్రభుత్వ వ్యవసాయ భూములలో ఇటుక బట్టి తయారీ ఆపుతారో లేదో వేచి చూద్దాం అని ప్రజలు ఎదురుచూస్తున్నారు


ఈ విషయమై లేబర్ అధికారి కోటేశ్వరరావు :….
ను ఫోన్ ద్వారా సమాచారం అడగగా కొన్ని ఇటుక బట్టీలకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయి అని మాత్రం మాకు తెలుసు అని ఆయన వివరణ ఇచ్చారు అంటే మిగతా వాటికి లేవు అన్నట్టే కదా అని అడగడదా అది ఏ ఎల్ ఓ లేదా కమిషనర్ ఆఫీస్ లో అడగవలసి ఉంటుంది అని సమాధానం ఇచ్చారు
మరి బాల కార్మికుల గురించి వివరణ అడగగా విచారణ చేస్తాం బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన వివరణ ఇచ్చారు బాల కార్మికులు పనిచేస్తున్న విషయం మీకు తెలియదా అని అడిగితే.? మాకు అలాంటివి ఏవి దృష్టికి రాలేదు అని ఆయన మాట దాటేశారు


_మైనింగ్_ అధికారిని :…
ఫోన్ ద్వారా వివరణ అడగగా
ఎన్ .ఎస్ .ఎం. ఈ రిజిస్టర్ అయిన తర్వాత సంబంధిత పత్రాలు ఉంటేనే నాలా కన్వర్షన్ ఆధార్ కార్డ్ ఎన్ఓసి ఉంటేనే పర్మిషన్ గ్రాండ్ ఉంటుంది అన్నారు
జి ఎస్టి కి ఎగనామం . ?
మరి 20 లక్షల రూపాయలు ఇటుక బట్టి ద్వారా తయారుచేసిన వచ్చిన ఆదాయం 20 లక్షలు దాటితే 1℅ జీఎస్టీ కట్టవలసి ఉంటుంది కానీ జీ, ఎస్టీ కూడా ఎగనామం పెడుతున్న పట్టించుకునే అధికారులే కరువయ్యారు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పర్మిషన్ కలిగి ఉంటే రిజిస్ట్రేషన్ అయి ఉంటే అనంతరం మైనింగ్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ పాల్వంచ మండలం భవానిపేట్ తండా కు ఆనుకొని ఉన్న ఓకే కుటుంబానికి చెందిన మూడు బట్టీలు ఎలాంటి పర్మిషన్లు ఉండవు అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు రాజకీయ నాయకుల ఒత్తిడా లేక మామూళ్ల మత్తులో ఉన్నారా అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు
ప్రభుత్వ స్థలంలో 769 సర్వేనెంబర్ లో గల ప్రభుత్వ స్థల భూమి నుండి మొరం తవ్వి అమ్ముకున్న అడిగే అధికారి లేడా లేక వీరికి రాజకీయ నాయకుల అండతో విర్రవీగుతున్నారా లేక అధికారుల అండతో వీరు మాఫియా నడుపుతున్నారా అనేది వేచి చూడాలి 769 సర్వే నెంబర్లు గల ప్రభుత్వ స్థలంలో పాలవంచ మండలం భవానిపేట గ్రామ శివారులో గల ఇటు కాబట్టి నిర్వహణ దారుణపై చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి ప్రభుత్వ జీవో ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా మొరం తీసిన టు గుర్తిస్తే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కానీ అక్కడ ఎలాంటి పర్మిషన్ లేకున్నా బట్టి మాత్రం కొనసాగుతూనే ఉంది ప్రభుత్వ అధికారులు ఇకనైనా ఆ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనపరచుకుంటారా లేదా మొరం తీసి అమ్ముకున్నందుకు జరిమానా విధిస్తారా అనేది వేచి చూడాలి



తెలంగాణ ఎక్స్ ప్రెస్
వెల్గటూర్ పిబ్రవరి 12
ఉమ్మడి వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సంగ శ్రీనివాస్ S/o లింగయ్య గత 26 సంవత్సరాల క్రితం ముత్తునుర్ నుండి కొండాపూర్ కు ఇల్లరికం వెళ్లాడు,ప్రతి రోజు లాగే మంగళవారం రోజున సాయంత్రం 5:30 గంటలకు ఇంటి నుండి గ్రామశివారులో ఉన్న పొలానికి కెనాల్ ద్వారా నీళ్లు పెట్టడానికి తన బైక్ పై వెళ్లాడు తిరిగి రాత్రి 09:30 గంటలకు ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో కొండాపూర్ గ్రామశివారులో తొండం ఏరియాలో రోడ్డు పై బైక్ ను అడవి పందుల గుంపు వచ్చి బైకును ఢీకొనడంతో రోడ్డు పై బోర్ల బొక్కల పడగ తలకు, ఇతర చోట్ల రక్త గాయాలు అయ్యి, ముక్కులోనుండి చెవుల్లో నుండి రక్తం కారి అక్కడికక్కడే చనిపోయినాడు మృతుని కొడుకు సంగ విష్షువర్ధన్ ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు. చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమా సాగర్ తెలిపారు
మిర్యాలగూడ మార్చి 13 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ చెందిన మాజీ కౌన్సిలర్, హైదరాబాద్ లోని ప్రముఖ అమ్మ హాస్పిటల్ డైరెక్టర్ ఎం.ఎం. ఖాన్. గురువారం తెల్లారుజామున మృతి చెందినట్లు వారి బంధువులు పేర్కొన్నారు. ఎం.ఎం. ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుతో ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి 23 వ వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్, టిఆర్ఎస్ పురపాలక సంఘం మాజీ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్ తెలియజేశారు.ఎం.ఎం. ఖాన్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్ సీనియర్ జర్నలిస్టులు ఖాజ హామీదుద్దీన్, ఎండి అస్లాం, రంగ శ్రీనివాస్, అయూబ్, జంగా లక్ష్మణ్ యాదవ్, మంద సైదులు బొంగారల మట్టయ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆకారపు సైదులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.