నర్వ మండల్/ డిసెంబర్ 29 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నర్వ మండల పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా
తేది 29-12-2024 సాయంత్రం 6:00 గంటల నుండీ 31-12-2024 సాయంత్రం 6:00గంటల వరకు మొత్తం 48 గంటలు నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని పత్రికా ప్రకటన ద్వారా నర్వ గ్రామ పంచాయతీ సెక్రెటరీ బుచ్చిరెడ్డి తెలిపారు.ఎందుకు అనగా మరికల్ నుండి నారాయణపేట పోయే దారిలో పెట్రోల్ బంక్ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ రెండు ప్రదేశాలలో లీకేజీ అవుతున్నదునా లీకేజీ పైపులు తీసి కొత్త పైపులు అమర్చటానికి నీటి సరపరా నిలిపివేయడం జరుగుతుంది. ఇట్టి పని పూర్తి కావడానికి సుమారు 48 గంటలు నీటి సరపరా ఆపివేయడం జరుగుతుంది. దీనివలన మన్యంకొండ నీటి శుద్ధి కేంద్రం నుండి నీటి సరపరా అయ్యే మరియు , నర్వ, మండల గ్రామాలకు పూర్తిగా పాక్షికంగా, నీటిని నిలిపివేయడం జరుగుతుందని కావున నర్వ మండల తెలియజేశారు.
Telangana Express
Telangana Express
Telangana Express is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry. *(Printed, Published and Owned by Chinthala Neelakantam Printed at Ritesh Printers,H.No.5-178, SC Colony,NARNOOR Village & Mandal, Adilabad.District, TELANGANA STATE, AND Published from H.NO. 5-178, SC Colony NARNOOR, ADILABAD DISTRICT -0504311. TELANGANA STATE, EDITOR: CHINTHALA. NEELAKANTAM RNI NO. TELTEL /2014/57821. PHONE NO.9010002679 , 8008801151, E-mail: Telanganaexpress521@gmail.com)*
హుజూర్నగర్ డిసెంబర్ 28 తెలంగాణ ఎక్స్ ప్రెస్
సూర్యాపేట జిల్లా చివ్వె 0ల సాంఘిక సంక్షేమగు రుకుల పాఠశాల విద్యా ర్థి జి విశాల్ (10 వ తర గతి)రాష్ట్రస్థాయి సీఎం పోటీలకు ఎంపిక అయి నట్లు పాఠశాల ప్రిన్సిపా ల్ ఒక ప్రకటనలో తెలి పారు సూర్యపేట ప్రభు త్వ జూనియర్ కళాశాల మైదానం లో ఈ నెల 19 వ తేదీన జరిగిన ఉమ్మ డి నల్గొండ జిల్లా స్థాయి అండర్ 14 అథ్లెటిక్స్ పో టీలలో బాలుర ట్రయా థ్లిన్ (100 మీ రన్నింగ్ షాట్పుట్, హై జంప్ లో గెలుపొందిన చివ్వె0ల గురుకుల విద్యార్థి ప్రతి భ కనబరచిరాష్ట్రస్థాయి కి ఎంపికయ్యాడు హను మకొండ లో ఈ నెల 31 నుంచి వచ్చేనెల 2 వర కు జరగబోయే రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీ లలో పాల్గొనబోతున్నా డు ఈ సందర్భంగా వి ద్యార్ధిని పాఠశాల/కళా శాల ప్రిన్సిపాల్ జి విద్యా సాగర్ ఉపాధ్యాయిని ఉ పాద్యాయులు అభినం దించారు

18 వ రోజు కొనసాగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె…భిక్షాటన చేసి నిరసన తెలిపిన ఉద్యోగులు…
నిరవధిక సమ్మె లో పాల్గొన్న కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది…
ఎల్లారెడ్డి, డిసెంబర్ 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు, శుక్రవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షులు డి.సత్యనారాయణ తో పాటు కేజిబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎం ఆర్ సి ఉద్యోగులు ర్యాలీగా ఫ్లకార్డులు పట్టుకుని పండ్ల దుకాణాలు, మెకానిక్ షాపుల్లో, కిరణ దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. ఆతర్వాత ఆయన మాట్లాడుతూ….తమకు రెగ్యులరైజ్ చేయాలని, ప్రతి ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షలు, ఆరోగ్య భీమా 5 లక్షలు, పిటీఐ లకు 12 నెలల వేతనం, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. ఎంగెజీ పేరుతో తమ బతుకులను అంధకారంలోకి నెట్టవద్దని అన్నారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు తమ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షులు, సెక్రటరీ సంపత్ కుమార్, కోషాధికారి భాను ప్రసాద్, ఉద్యోగులు , తదితరులు పాల్గొన్నారు.



- ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు
ఎల్లారెడ్డి, డిసెంబర్ 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కలశాలలో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయ, అధ్యాపకుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, ప్రిన్సిపాల్ జి. నాగేశ్వర్ రావు, శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్, పిజిటి ఆంగ్లం, పిజిటీ ఫిజికల్ సైన్స్ అధ్యాపక పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో
50 శాతం మార్కులతో పీజీ, సంబంధిత సబ్జెక్ట్స్ తో బీఈడీ పూర్తి చేసి ఉండాలని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఈ నెల 30 న సోమవారం ఉదయం 10.00 గంటలకు ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల నందు ఇంటర్వ్యూ కు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ జి. నాగేశ్వరరావు కోరారు.

- ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా
ఎల్లారెడ్డి, డిసెంబర్ 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేసిన సంస్కరణల ఆద్యులు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అని, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. శనివారం డిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్ కు, శుక్రవారం మండలంలోని సోమార్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పెద్దలు, మాజీ పాలక వర్గ సభ్యులతో కలిసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కురుమ సాయిబాబా మాట్లాడుతూ దేశంలోని గొప్ప ఆర్థిక వేత్త, నాయకుడు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని సంస్కర ణవాది , అన్నిటికంటే మించి మానవతావాది అని ఆయన మృతి చెందడం బాధాకరమని అన్నారు. ధర్మానికి ప్రతీకగా నిష్కలంకమైన సమగ్రత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నవ భారత నిర్మాణంలో తనదైన పాత్ర పోషించారన్నారు. ప్రఖ్యత ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు భారత దేశ పురోగతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆయన మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమార్ పేట్ గ్రామ కమిటీ అధ్యక్షుడు క్యాస కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శి రాజు, మాజీ సర్పంచ్ భర్త పాపయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, సాయిలు, పోశెట్టి, సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి, డిసెంబర్ 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని సోమార్ పేట్ గ్రామ రైతులు, శుక్రవారం ఒకే రోజు 79 వ్యవసాయ విద్యుత్ మోటార్ల బిల్లులు వంద శాతం చెల్లించినట్లు ఫోర్ మెన్ గంగాధర్ తెలిపారు. మొత్తం 79 బోర్ మోటార్ల కు సంబంధించిన 35,288 రూపాయల బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ గంగాధర్ తో పాటు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సిద్దెందర్ రెడ్డి, లైన్ మెన్ బాలకిషన్ గౌడ్, ఏ ఎల్ ఎం ఇస్మాయిల్, సి ఎల్ రియాజ్ , రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి, డిసెంబర్ 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో, శుక్రవారం ఉదయం అయ్యప్ప మాలాధారణ చేసిన నలుగురు స్వాములు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకుని, గురుస్వామి హ్యన్మంతప్ప స్వామిచే, ఆలయ పూజారి శ్రీనివాస్ రావు సమక్షంలో ఇరుముడి కట్టుకుని నెత్తిన పెట్టుకొని, పదునెట్టంబడి పడిని వెలిగించి, ఆలయంలో స్వామివారికి ప్రదక్షణలు చేసి, వాహనంలో శబరిమలకు బయలు దేరి వెళ్ళారు. స్వాములకు కుటుంబ సభ్యులు, మలాధార స్వాములు ఘనంగా వీడ్కోలు పలికారు. శబరిమలకు తరలిన వారిలో పుట్టి గోపాల్ గురు స్వామి, డాక్టర్ ఉపేం దర్ స్వామి, డాక్టర్ అరుణ్ స్వామి, మరో స్వామి, తదితరులు తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో అనిల్ స్వామి, మాలధార స్వాముల కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.

జి పి కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తూ 18000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి సిఐటియు డిమాండ్.
బిచ్కుంద డిసెంబర్ 27 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం నాడు ఎంపీడీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో బిచ్కుంద మండలంలోని వివిధ గ్రామపంచాయతీ కార్మికులందరూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టోకెన్ సమ్మె నిర్వహించడం జరిగింది.
జిపి కార్మికుల సమ్మె కు మద్దతుగా సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు. సురేష్ గొండ పాల్గొనిమాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం. గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని జిపి కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని. పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని. ప్రతినెల ఒకటవ తేదీ నాడు. వేతనాలు నేరుగా కార్మికుల అకౌంట్లో పడాలని. పిఎఫ్. ఈఎస్ఐ. సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సురేష్ గొండ డిమాండ్ చేశారు. కార్మికులందరూ తమ డిమాండ్ల పరిష్కారం అయ్యేంతవరకు ఐక్యంతో ఉండి డిమాండ్లు సాధించుకోవాలని జిపి కార్మికులందరికీ ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో. జిపి కార్మికుల మండల అధ్యక్షులు. రూప్ సింగ్ మండల కార్యదర్శి. సిహెచ్.సాయిలు.బిచ్కుంద. టౌన్. అధ్యక్షులు. భూమయ్య. కార్మికులు. సాయిలు. లక్ష్మణ్. గంగవ్వ. చంద్రవ్వ. శకుంతల. గిన్నే బాయ్. సరూప. మండలంలోనివివిధ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు


భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన మంత్రి దామోదర్ రాజా నర్సిoహ
. జోగిపేట డిసెంబర్ 27:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు, ఆర్థికవేత్తగా, ఆర్బిఐ గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా రెండుసార్లు అందించిన సేవలను స్మరించుకున్నారు, దేశం గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది అన్నారు, వారి మరణం దేశానికి తీరని లోటు ఉన్నారు, మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా పనిచేసిన కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు, ఈ సందర్భంగా వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ ప్రధాని పి ,వి నరసింహారావు మార్గదర్శకంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించిన ఘనత మా మన్మోహన్ సింగ్ కు దక్కిందన్నారు, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కిందన్నారు, దివంగత నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మ శాంతించాలని కోరుకున్నా, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ డిసెంబర్ 27
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా వెల్గటూరు మండల కేంద్రంలో అంబేద్కరు విగ్రహం వద్ద శుక్రవారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
*మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటనీ,దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి మన్మోహన్ ని,ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనత వారికే దక్కుతుందని,ఎటువంటివివివాదాలు లేకుండా 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి వివాహ రహితుడగా పేరు పొందారని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాట కూడా శ్రీమతి సోనియా గాంధీ ,మరియు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోనే సాధ్యం కావడం జరిగిందనీ,కేంద్ర మంత్రిగా వారు చేసిన సేవలు దేశం ఎన్నటికీ మార్చిపోదని,సోనియా గాంధీ కి ప్రధానిగా అవకాశం వచ్చినప్పటికి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల దృష్ట్యా ప్రధాని పదవిని వారికి ఇవ్వడం జరిగిందని,వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నట్లు ఈ సంధర్బంగా తెలిపారు..
వారి వెంట మండల మాజీ సర్పంచ్ మేరుగు మురళి గౌడ్ మాజీ ఎంపీటీసీ రంగు తిరుపతి మండల బీసీ సెల్ అధ్యక్షులు ఉదయ్ గౌడ్ యూత్ అధ్యక్షులు పూదరి రమేష్ సోషల్ మీడియా ఇన్ఛార్జి గుమ్ముల వెంకటేసు మాజీ జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్రావ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ పోలోజు శ్రీనివాస్ సప్ప లింగయ్య దూడ రవి గ్రామ శాఖ అధ్యక్షులు దుంపట సత్యం జనర్ధన్ నల్ల తిరుపతి కస శ్రీనివాస్ నాయకులు నర్సయ్య తిరుమల్ అజయ్ వేణు సంతోష్ పవన్ మహేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

