ఎల్లారెడ్డి , ఏప్రిల్ 15, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన చోరీ కేసులో నలుగురు నిందితులను, సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్ కు చెందిన షాపులో ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు షాపు తాళం పగలగొట్టి అందులోని సామాన్లను దొంగలించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల పుటే జీీల సాయంతో నలుగురు దొంగలను పట్టుకొని విచారించగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం, తాడ్కోలు గ్రామానికి చెందిన అల్లం లక్ష్మణ్, తూర్పాటి చంద్రశేఖర్, చిత్తారి రమేష్, అంద శ్రీ సురేష్ గా గుర్తించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. వారి వద్ద నుంచి ఆటో , 15 వైర్ల బెండలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ వివరించారు. దొంగతనం కేసులో నిందితులకు గుర్తించి పట్టు కోవడంలో ప్రతిభ కనబరిచిన హోంగార్డ్ ప్రసాద్ ను ఎస్ ఐ. మహేష్ అభినందించారు.
V.Rajendernath
Hyderabad, april 14:-(telangana express Buearo ) MR.VIKAS RAJ, CHIEF ELECTORAL OFFICER AT HIS OFFICE. Today Editors & Senior Journalist of Small and medium News Papers of Urdu Daily Meet the chief electoral Officer & E.O. State of Telengana Mr Vikas Raj IAS in his chamber at BRK Bhavan Hyderabad. The editors and Journalist offered the greetings of Ugadi & Ramzaan festivals.
In the meeting Mr Vikas Raj emphasizes the media role
to make the voters aware & show the importance of their precious vote to safe the Democracy and Constitution. Since the voting percentage is falling badly it is duty of media to work for the improvement of voting percentage in Hyderabad & other constituencies. Voters lost their motivation to vote due to obvious reasons. He strongly requested the print and electronic media to play a pivotal role in order to improve the voting percentage by conducting non political meetings & seminars which must be conducted very frequently at different areas and neighborhoods explaining voters the importance of their votes. Messes Sr Jounalist M R Ghouri, Syed Osman Rasheed. M A Khaleel Ahmed & Mohd Asad Ali
Sr.editors were present in the meeting.
బాన్సువాడ ఎమ్యెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 13, (తెలంగాణ ఎక్స్ (ఎస్) హామీల అమలులో కాంగ్రె సర్కార్ విఫలమైందని మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక వీకేని ఫంక్షన్ హాల్ మాజీ ఎమ్యెల్యే, నియోజకవర్గ ఇంచార్జి జాజాల సురేందర్ అధ్యక్షతన నిర్వహించిన ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే పోచారం మాట్లాడుతూ..రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. టిఆర్ఎస్ హయంలో కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని రైతాంగానికి పెద్దపీట వేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలతో ముందుకు సాగే పరిస్థితి లేదన్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. భారత దేశాన్ని నరేంద్ర మోడీ చేసింది ఏమీ లేదని అన్ని నిత్యవసర సరుకులు షెట్రోల్ డీజిల్ ధరలను అమాంతంగా పెంచడం జరిగిందన్నారు..ప్రజలు ఇప్పటికైనా గమనించి ప్రజా సమస్యలపై పరిష్కరించే దిశగా పనిచేసి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో విద్యుత్తు సాగునీరు సంక్షేమ పథకాలు విషయంలో రాజీలేకుండా నిరంతరాయంగా అందించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ప్రజలు పాలిచ్చే గేదెను పదిలేసి గోడ్డు గేదెకు మేత, కుడితి వేశారని అది పాలిస్తుందా అన్నారు. జహీరాబాద్ టిఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో జహీరాబాద్ పాలించిన నాయకులు ఏమాత్రం అభివృద్ది చేయలేదని తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలం చెందిందన్నారు. హామీలలో లబ్దిదారులకు హామీలను పూర్తిగా అమలు చేయక పోవడం దుర్మార్గమన్నారు. తనను జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం ఎల్లారెడ్డి మా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీలను చిత్తుగా ఓడించాలన్నారు. . ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ,డిసిసిబి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆదిమూలం సతీష్, వెలుట్ల సొసైటీ చైర్మన్ పటేల్ సాయిలు, ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ నర్సింలు, వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచ్ లు , కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ప్రాణం పోసేది దేవుడైతే ఆయువు తీరే వరకు కాపాడేది వైద్యుడు. ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు
కామారెడ్డి, ఏప్రిల్ 13:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
మనిషికి ప్రాణం పోసేది దేవుడైతే, ఆయువు తీరే వరకు కాపాడుతూ వచ్చేవారు వైద్యులు, అలాంటి మంచి వృతిలో ఉన్న వైద్యులు నిరుపేదలకు ఆరోగ్యాలకు అవసరం వచ్చిన సమయంలో వారికి అండగా నిలవాలని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలో భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన స్నేహ మల్టీ స్పెషాలిటీ పిల్లల ఆసుపత్రిని ఎమ్యెల్యే ప్రారంభించారు. ఇదే ఆసుపత్రి మెడికల్ గదిని ప్రముఖ సర్జన్ డాక్టర్. నాగేశ్వర రావు ప్రారంభించారు. ఆసుపత్రి ల్యాబ్ ను మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రారంభించారు. ల్యాబ్ ను పిల్లల వైద్యులు కృష్ణ సుంకం ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్యెల్యేను, వైద్యున్ని ఆసుపత్రి యాజమాన్యం సత్కరించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ..ఆసుపత్రి ఏర్పాటు చేసిన యాజమాన్యం సిద్ది శ్రీధర్, గోపాల్ ను ఎమ్యెల్యే అభినందించారు. ఎల్లారెడ్డి పట్టణంలో పిల్లల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ఆసుపత్రి ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందించి మరింత అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్యులు డాక్టర్.చంద్రశేఖర్ కిరణ్, డాక్టర్. కృష్ణ సుంకం, డాక్టర్. మారుతి రావు, జడ్పిటిసి ఉషాగౌడ్, జిల్లా జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కమిటి సభ్యులు సోమయాజులు గారి రాజ్ కుమార్, జాతీయ జర్నలిస్ట్ సంఘం(ఢిల్లీ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్, బీఆర్ఎస్ నాయకుడు నునుగొండ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, గోపి, జర్నలిస్ట్ బొజ్జ శివకుమార్, సంతోష్, శ్రీధర్, శివ, మహేష్, సాయిరాంగౌడ్, పట్టణ ప్రముఖులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు కన్నారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెడమాస్టర్ సురేష్ మాట్లాడుతూ.. భారతదేశంలోనే ప్రథమంగా బాలికల పాఠశాల ఏర్పాటు చేసి విద్య యొక్క ప్రాధాన్యత ను తెలియ జేసిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. పాఠశాల విద్యార్థులు కూడా బాగా చదువు కొని ఉన్నత స్థాయికి ఎడగలన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ పేరుపల్లి కంసవ్వ, సభ్యులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
ఎల్లారెడ్డికి చెందిన బీఆర్ఎస్ నేతలైన ఎల్లారెడ్డి సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తిరుపతి బుధవారం రాత్రి 10గంటలకు కామారెడ్డి లోని ఎమ్యెల్యే మదన్ మోహన్ స్వగృహంలో ఎమ్యెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్యెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి వెంట కాంగ్రెస్ నాయకులు చెన్నలక్ష్మన్, సాయిరాంగౌడ్, బాలర్జున్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, నాగం సాయిబాబా, అనిల్ నాయక్, బిట్ల సురేందర్ వున్నారు.
క్యాన్సర్ బాధిత చిన్నారికి ఓ పాజిటివ్ రక్తం అందజేతఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
కామారెడ్డి, ఏప్రిల్ 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చింత భువన్ (5) చిన్నారికి హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. హైదరాబాదులోని ఐఐఎంసి ఖైరతాబాద్ డిగ్రీ, పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ సహాయ ఆచార్యులు రామకృష్ణ గుప్తా సహకారంతో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ విద్యార్ధి వ్యోమేష్ కుమార్ వెంటనే స్పందించి వైద్యశాలకు వెళ్లి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగింది.
చిన్నారి ప్రాణాలను కాపాడడం కోసం రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత వ్యోమేశ్ కుమార్,ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్, సహాయ ఆచార్యులు రామకృష్ణ గుప్తా లకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు.
మహబూబాబాద్, ఏప్రిల్ 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) మహబూబాబాద్ జిల్లా నెల్లికూదుర్ మండలం కాచికల్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్. మురళీ నాయక్ తన సొంత నిధులతో రెండు బోర్ వెల్ వేయించారు. ఈ మేరకు సోమవారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఇట్టె దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుగులోత్ శ్రీను లు బోర్ బెల్ పనులకు పూజ చేసి ప్రారంభించారు. రెండు బోర్ లలో కూడా పుష్కలంగా నీరు పడడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
శ్రమదాన కార్యక్రమంలో యువత భాగస్వాములు కావడం అభినందనీయం… జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్
కామారెడ్డి, ఏప్రిల్ 6:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) నాగన్న బావిలో పూడికతీత పనులకు శ్రమదానం చేయడానికి యువత ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న బావిలో శనివారం ఉదయం మండల స్థాయి అధికారులు, ఉపాధి, ఐకెపి సిబ్బందితో కలిసి రెండు గంటల పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూడికతీత పనులకు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పురాతన కట్టడాలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. బావిలో పూడిక తీయడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని చెప్పారు. నాగన్న బావిని పర్యటక కేంద్రాన్ని మార్చడానికి కృషి చేస్తానని తెలిపారు. మండల స్థాయి అధికారులు, యువకులు ఉత్సావంగా స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సమీపంలో మొక్కలు నాటారు. ఎంపీడీవో నరేష్, తాసిల్దార్ నరేందర్, ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, ఏపీవో అన్నపూర్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉపాధి హామీ, రెవెన్యూ అధికారులు, యువకులు పాల్గొన్నారు.
కామారెడ్డి, ఏప్రిల్ 3:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగమైన సామాజిక తనిఖీలు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సామాజిక తనిఖీ గ్రామస్థాయిలో ప్రజల, ఉపాధి హామీ కూలీల, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహించాలి. జరిగిన పనులకు సంబంధించి బహిరంగ సభ చర్చ జరపవలసి ఉంటుంది కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం అనేది లేకుండానే తనిఖీలు ఏ విధంగా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సామాజిక తనిఖీ బృందం వారు గ్రామాలలోకి వెళ్లి తనిఖీ చేస్తున్నప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విభిన్న పార్టీల వారు చేసిన పనులపై విమర్శలు చేయడానికి అవకాశం ఉంది. దీనిపై నిర్ణయాధికారులు వాస్తవంగా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏ విధంగా న్యాయం చేయగలరు. గతంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడు సామాజిక తనిఖీలు నిర్వహించ లేదు, కానీ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత దోమకొండ, మాచారెడ్డి, బీర్కూరు మండలాలలో గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీల, ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండానే ప్రజల సమక్షంలో నిర్వహించవలసిన గ్రామ సభలు, పంచాయతీ కార్యాలయంలో ఎవరి ప్రమేయం లేకుండా నిర్వహించి, మండలంలో జరిగే చివరి సామాజిక తనిఖీ ప్రజావేదిక కేవలం అధికారులు మాత్రమే మండల కార్యాలయంలో ఎవరి ప్రమేయం లేకుండా నిర్వహించడం తో సామాజిక తనిఖీల లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుందని, చేసిన పనులకు సంబంధించిన అవకతవకలు ఏ విధంగా బహిర్గతం అవుతాయని పనిచేసిన కూలీలు వాపోతున్నారు. వాస్తవంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టే ఏ పనులైనా గ్రామసభ తీర్మానం, మండల పరిషత్ తీర్మానం , జిల్లా పరిషత్ ఆమోదం గ్రామసభ తీర్మానం, మండల పరిషత్ తీర్మానం , జిల్లా పరిషత్ ఆమోదంతోనే పనులను నిర్వహిస్తారు. అలాంటప్పుడు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయకుండా తనిఖీలు ఏ విధంగా నిర్వహిస్తారని ప్రజా ప్రతినిధులు సైతం ప్రశ్నిస్తున్నారు.. దేశంలో ఎంతో కఠినంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నప్పటికీ ఇంటింటికి వెళ్లి సామాజిక తనిఖీలు నిర్వహించడం వలన గ్రామాలలో రాజకీయ పార్టీలపై ప్రభావాన్ని చూపనున్నాయి. ఇకనైనా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇకనుంచి జరిగే సామాజిక తనిఖీలను నిర్వహించ కుండా ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.